కావాల్సింది భారత్‌ విజయాలు | Gautam Gambhir Makes Stunning People On Social Media Remark After T20 World Cup Triumph | Sakshi
Sakshi News home page

కావాల్సింది భారత్‌ విజయాలు

Mar 10 2026 3:57 AM | Updated on Mar 10 2026 4:00 AM

Gautam Gambhir Makes Stunning People On Social Media Remark After T20 World Cup Triumph

వ్యక్తిగత ఘనతలు కాదు 

మీడియాతో హెడ్‌ కోచ్‌ గంభీర్‌  

భారత జట్టు ప్రదర్శన, టోర్నీ అసాంతం ఆడిన తీరు అద్భుతం. అహ్మదాబాద్‌లో మన జట్టు చరిత్ర సృష్టించింది. (ఎప్పుడు గంభీరంగా ఉండే గౌతీని ఉద్దేశించి) కోచ్‌ సాబ్‌... మీ ముఖంపై ఈ చిరునవ్వు బాగుంది. గెలుపు కోసం తపించిన మీ పట్టుదల, ఈ చిద్విలాసం రెండు కిల్లర్‌ కాంబినేషన్‌. బుమ్రా చాంపియన్‌ బౌలర్‌. అతని గురించి ఓ ముక్కలో సరిపెట్టలేను. ఓ వాక్యంలో పూర్తి చేయలేను. 

 రెండేళ్ల తర్వాత ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్‌కు సోషల్‌ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా ధోని, గంభీర్‌ అభిమానులైతే తెగ రీట్వీట్‌ చేసుకుంటున్నారు.

అహ్మదాబాద్‌: తాజా ప్రపంచకప్‌ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తనకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే భారత జట్టు ఘనవిజయాలే ముఖ్యమని అన్నాడు. విజయానంతరం కోచ్‌ మాట్లాడుతూ ‘మన జట్టు ట్రోఫీలతో సంబరాలు చేసుకోవాలి... వ్యక్తిగత ఘనతలతో కాదు’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తను పదవిలో ఉన్నంత కాలం సమష్టి విజయాలపైనే దృష్టి ఉంటుందని అన్నాడు. ఒకట్రెండు మెగా ట్రోఫీలతో, లేదంటే విజయాలతో భారత శకం మొదలైనట్లుగా భావించనన్నాడు. సోషల్‌ మీడియా చెత్తని పట్టించుకోనని తేలిగ్గా తీసిపారేశాడు. నమ్మకంతోనే జట్టును నిర్మించాలి, అంచనాలతో కాదని స్పష్టం చేశాడు. పలు అంశాలపై మీడియాతో గంభీర్‌ పంచుకున్న అభిప్రాయాలు అతని మాటల్లోనే... 

ఆటగాళ్లపై ఉండాల్సింది నమ్మకం 
ఏదైనా జట్టు నమ్మకంతో ఎదగాలి. అంచనాలతో కాదు. అంటే ఆటగాళ్ల ఎంపికైనా... జట్టు నిర్మాణమైనా... ఈ రెండింటిలో కామన్‌ పాయింట్‌ ఒకటే. అదే రాణిస్తారనే నమ్మకం. ఈ పునాదితోనే జట్టును నిర్మిస్తాం. అంతే కానీ ఫలానా ఆటగాడు ఈ పూటకు మెరిపిస్తాడు లేదంటే ఈ మ్యాచ్‌లో గట్టెక్కిస్తాడనే అంచనాలతో జట్టును నిర్మించడం సాధ్యపడదు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే ఒకటి అర వైఫల్యంతో కూలిపోదు. సంజూ సామ్సన్, అభిõÙక్, ఇషాన్‌ కిషన్‌లు కూడా విఫలమయ్యారు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. అందువల్లే జట్టులో కొనసాగారు. విజయవంతమయ్యారు. 

సోషల్‌ మీడియాను పట్టించుకోను 
అదేపనిగా విమర్శల్ని లేదంటే ప్రతికూల వార్తల్ని వైరల్‌ చేసే సోషల్‌ మీడియాను, పనికిరాని నెటిజన్ల పోస్టుల్ని పట్టించుకోను. కోచ్‌గా నేను జవాబుదారీగా ఉండాలనుకునేది ఈ 30 మందికే (డ్రెస్సింగ్‌ రూమ్‌లో భాగమయ్యే ప్లేయర్లు)!  

పరిమిత ఓవర్ల శకం మాదే అనుకోను 
అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌ శకం మొదలైందని నేను అనుకోను. మా ఆధిపత్యం మొదలైనట్లయితే మేం గత మూడు వన్డే సిరీస్‌లలో రెండు ఎలా ఓడిపోతాం. ప్రత్యేకించి ఐసీసీ క్రికెట్‌ టోర్నిల్లో మాత్రం భారత్‌ ఆధిపత్యాన్ని అంగీకరిస్తాను. 2024లో టి20 ప్రపంచకప్, 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ, 2026లో టి20 వరల్డ్‌కప్‌ ఇలా ఏడాదికో ఐసీసీ ట్రోఫీ చొప్పున భారత్‌ గెలుచుకుంది.  

లక్ష్మణ్, ద్రవిడ్‌లకు థ్యాంక్స్‌
ముఖ్యంగా ఈ తాజా కప్‌ను నా కన్నా ముందు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన రాహుల్‌ ద్రవిడ్‌కు, బీసీసీఐ ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు అంకితమిస్తున్నా. కొన్నేళ్లపాటు అంకితభావంతో శ్రమించిన ద్రవిడ్‌ టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో పటిష్టమైన జట్టుగా మార్చాడు. అలాగే ఆటగాడిగా భారత్‌కు 
విజయాలందించిన లక్ష్మణ్‌ ఇప్పుడు బెంగళూరులో కుర్రాళ్లకు సరైన మార్గదర్శనం చేస్తున్నాడు.

2028లో ‘హ్యాట్రిక్‌’, బంగారమాయేనా... 
భారత జట్టు సభ్యులందరూ గెలుచుకున్న వరుస ప్రపంచకప్‌లతో అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత జట్టు సభ్యుల సగటు వయసు 30. అంటే ఇంకో రెండేళ్లలో జరిగే మెగా ఈవెంట్‌కు దాదాపు వీరే ఉండటం ఖాయం. నిజానికి కెపె్టన్‌ సూర్యకుమార్‌ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపించినా విజయానంతరం స్వయంగా అతనే వాటిని తోసి పుచ్చాడు. ప్రస్తుతానికి పక్కన బెట్టినా... 2028 వరకైతే సూర్య కొనసాగడం ముమ్మాటికి కష్టమే! ఇక ఆ ఏడాది (2028) భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కానుంది.

ఓవైపు ఆ్రస్టేలియా–న్యూజిలాండ్‌ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌లో ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ ఊరిస్తుంటే... ప్రతిష్టాత్మక లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ కూడా జరుగనున్నాయి. ఇందులోనూ చాంపియన్‌ అయితే మాత్రం 2028 మనకి బంగారమవుతుంది! ఆదివారం రాత్రి కప్‌తో పిచ్‌పై కూర్చున్న కెపె్టన్‌ సూర్యకుమార్‌ ఫొటోలకు పోజులిస్తూ తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌ స్వర్ణం, మరో టి20 ప్రపంచకప్‌ గెలవడమనే చెప్పాడు. ఆదివారం రాత్రి విన్నర్స్‌ ట్రోఫీ బహుమతి ప్రదానోత్సవం తర్వాత భారత క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో మైదానంలో ఉల్లాసంగా గడపడంతోపాటు ట్రోఫీతో ఫొటోలు దిగారు. సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌ నుంచి పలువురు ఆటగాళ్లు తమ స్వస్థలాలకు బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement