ఈ విజ‌యం వారిద్ద‌రికీ అంకితం: గంభీర్ | Gautam Gambhir dedicates T20 World Cup win to 2 people | Sakshi
Sakshi News home page

టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం వారిద్ద‌రికీ అంకితం: గంభీర్

Mar 9 2026 7:20 PM | Updated on Mar 9 2026 7:41 PM

Gautam Gambhir dedicates T20 World Cup win to 2 people

ట్రోఫీతో గంభీర్, సూర్య‌కుమార్ యాద‌వ్ (Photo: @BCCI)

టీమిండియా సొంత‌గ‌డ్డ‌పై టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డంతో హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు అత‌డిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేన‌ని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్ద‌రు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజ‌యాల వెనుక వీరిద్ద‌రూ ఉన్నార‌ని మీడియా ముఖంగా ప్ర‌క‌టించాడు.

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌లిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్‌. టీమిండియా టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యాన్ని ఎవరికి అంకితం చేస్తార‌ని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు గంభీర్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానం ఇచ్చాడు. ఎవ‌రూ ఊహించ‌ని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్ర‌విడ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌. టీమిండియా విజ‌యాల్లో వీరిద్ద‌రి పాత్ర ఎంతో ఉంద‌ని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.

"టి20 ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్  లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను లక్ష్మణ్ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నడిపిస్తూ జ‌ట్టుకు విలువైన సేవ‌లు అందిస్తున్నార‌"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్ర‌విడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్‌కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.

వారిద్ద‌రికీ కృతజ్ఞతలు
ఐసీసీ ప్ర‌స్తుత‌ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్య‌ద‌ర్శి జైషా త‌న‌కు క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచార‌ని వెల్ల‌డించారు. గ‌తేడాది స్వ‌దేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న‌ప్పుడు జైషా ద‌న్నుగా నిలిచార‌ని తెలిపాడు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా నిజాయితీగా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోయార‌ని బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌ను పొగిడారు. వీరిద్ద‌రికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.

భయాన్ని వ‌దులుకోవాలి
తాను త‌న జ‌ట్టుకు జ‌వాబుదారిగా ఉంటాన‌ని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్ప‌ష్టం చేశాడు. టీమ్ వ‌ల్లే తాను కోచ్ కాగ‌లిగాన‌ని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయ‌ప‌డ్డాడు. సెమీస్‌, ఫైన‌ల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేన‌న్నారు. ఆట‌గాళ్లు వ్య‌క్తిగ‌త రికార్డుల కంటే ట్రోఫీలు గెల‌వ‌డానికే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించాడు. తానేప్పుడు న‌మ్మ‌కం ఆధారంగానే  జ‌ట్టు స‌భ్యుల‌ను ఎంపిక చేస్తాన‌ని చెప్పాడు. 

చ‌ద‌వండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే!

Advertisement
 
Advertisement
Advertisement