సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌ | Aiden Markram set to lead Manchester Super Giants in The Hundred 2026 | Sakshi
Sakshi News home page

The Hundred 2026: సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌

Mar 14 2026 2:10 PM | Updated on Mar 14 2026 2:14 PM

Aiden Markram set to lead Manchester Super Giants in The Hundred 2026

ఇంగ్లండ్ ది హాండ్ర‌డ్ లీగ్ వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్‌క్ర‌మ్‌పై కాసుల వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. సుమారు రూ. 2.5 కోట్ల భారీ ధ‌ర‌కు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఓవర్సీస్ ప్లేయర్‌గా మార్‌క్ర‌మ్ నిలిచాడు.

అయితే మార్‌క్ర‌మ్ ఇప్ప‌టికే ఐపీఎల్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల‌లో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు హాండ్ర‌డ్ లీగ్‌లోనూ సూప‌ర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో జ‌త‌క‌ట్టాడు. మొత్తం మూడు లీగ్‌ల‌లో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు.

ఇక ఇది ఇలా ఉండ‌గా.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఐడైన్ ఇప్ప‌టికే సౌతాఫ్రికా లీగ్ డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. మార్‌క్ర‌మ్ కెప్టెన్సీ స్కిల్స్‌పై మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

"మా మూడు జ‌ట్ల‌లోనూ మార్‌క్ర‌మ్ ఉండ‌డం చాలా సంతోషంగా ఉంది. అత‌డొక అద్బుత‌మైన ఆట‌గాడు. ఐడైన్‌లో గొప్ప నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అత‌డిని వేలంలో ద‌క్కించుకున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాము" ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. కాగా గ‌త సీజ‌న్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు మార్‌క్ర‌మ్ రాక‌తో మాంచెస్ట‌ర్ కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement