పాకిస్తాన్ ప్లేయ‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు | Maaz Sadaqat Creates History, Breaks Chris Gayles 24-Year-Old Record | Sakshi
Sakshi News home page

BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయ‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు

Mar 14 2026 1:18 PM | Updated on Mar 14 2026 1:32 PM

Maaz Sadaqat Creates History, Breaks Chris Gayles 24-Year-Old Record

ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 128 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో యువ సంచ‌ల‌నం మాజ్ సదాకత్‌ది కీల‌క పాత్ర‌. ఈ  మ్యాచ్‌లో స‌దాక‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు.  కెరీర్‌లో రెండో అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన స‌దాక‌త్ త‌న అద్భ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.

తొలుత బ్యాటింగ్‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌దాక‌త్.. బంగ్లా బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. కేవ‌లం 46 బంతుల్లోనే  6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అనంత‌రం బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో స‌దాక‌త్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

బంగ్లాదేశ్‌పై వ‌న్డే మ్యాచ్‌లో ఆర్ధ సెంచ‌రీతో పాటు మూడు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా మాజ్ సదాకత్ రికార్డుల‌కెక్కాడు. కేవ‌లం 20 ఏళ్ల 302 రోజుల‌ వ‌య‌స్సులోనే స‌దాక‌త్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్రిస్ గేల్(23) పేరిట ఉండేది. 

తాజా మ్యాచ్‌తో గేల్‌ను స‌దాక‌త్ అధిగ‌మించాడు. ఓ ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఒకే వ‌న్డే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన 14వ ఆట‌గాడిగా స‌దాక‌త్ నిలిచాడు. పాకిస్తాన్ నుంచి మాత్రం ఈ రికార్డు సాధించిన ఐదో ప్లేయ‌ర్‌గా స‌దాక‌త్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు హిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement