
నేటి నుంచి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింధు, లక్ష్య సేన్, ప్రణయ్‌లపై దృష్టి
చాంగ్జౌ: ఈ సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నమెంట్‌కు సిద్ధమైంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జపాన్ ప్లేయర్, ప్రపంచ ఆరో ర్యాంకర్ టొమాకా మియజాకితో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0–1తో వెనుకబడి ఉంది. గత ఏడాది స్విస్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మియజాకి చేతిలో సింధు ఓడిపోయింది. చైనా ఓపెన్‌లో సింధు తొలి రౌండ్ అడ్డంకిని దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్) లేదా క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)లలో ఒకరితో ఆడాల్సి ఉంటుంది.
ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ సింధు గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అకానె యామగుచి (జపాన్) లేదా బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)లలో ఒకరితో ఆడవచ్చు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న సింధు ఈ ఏడాది ఇండియా ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, స్విస్ ఓపెన్, మలేసియా మాస్టర్స్, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్‌లతోపాటు ఆసియా చాంపియన్íÙప్, సుదిర్మన్ కప్ టోర్నీలలోఆడింది. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే ఈ సీజన్‌లో సింధు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. చైనా ఓపెన్‌లో భారత్ నుంచి సింధు, ఉన్నతిలతోపాటు అనుపమ కూడా బరిలో ఉంది. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ సియాంగ్ టితో అనుపమ ఆడుతుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి లక్ష్య సేన్, ప్రణయ్ మాత్రమే బరిలో ఉన్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా)తో లక్ష్య సేన్; కోకి వతనాబె (జపాన్)తో ప్రణయ్ పోటీపడతారు. ముఖాముఖి రికార్డులో లీ షి ఫెంగ్‌పై లక్ష్య సేన్ 7–5తో ఆధిక్యంలో ఉండగా... వతనాబెతో ఒకేసారి తలపడ్డ ప్రణయ్ ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ మాత్రమే ఈ టోర్నీలో ఆడనుంది. తొలి రౌండ్‌లో కెన్యా మిత్సుహాíÙ–హిరోకి ఒకమురా (జపాన్)లతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. మహిళల డబుల్స్‌లో భారత్ నుంచి సెల్వం కవిప్రియ–సిమ్రన్; రుతపర్ణ–శ్వేతాపర్ణ పాండా, అమృత–సోనాలీ సింగ్ జోడీలు ఆడుతున్నాయి. తొలి రౌండ్‌లో యియుంగ్ ఎన్గా టింగ్–యియుంగ్ పుయ్ లామ్‌లతో రుతపర్ణ–శ్వేతాపర్ణ; సియె పె షాన్–హుంగ్ ఎన్ జులతో అమృత–సోనాలీ; లౌరెన్ లామ్–అలీసన్ లీ (అమెరికా)లతో కవిప్రియ–సిమ్రన్ పోటీపడతారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట; అశిత్ సూర్య–అమృత జోడీలు బరిలో ఉన్నాయి. తొలి రౌండ్‌లో వోంగ్ టియెన్ సి–లిమ్ చియె సియెన్ (మలేసియా)లతో రుతి్వక–రోహన్; రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా)లతో అశిత్–అమృత తలపడతారు.
చైనా ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలో భారత్ నుంచి ఇప్పటి వరకు ముగ్గురు చాంపియన్స్‌గా నిలిచారు. 2014లో కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. 2014లో సైనా నెహా్వల్, 2016లో సింధు మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
చైనా ఓపెన్ టోర్నమెంట్‌లో చైనా క్రీడాకారులు సాధించిన టైటిల్స్. 1986 నుంచి నిర్వహిస్తున్న ఈ టోరీ్నలో చైనా నుంచి పురుషుల
సింగిల్స్‌లో 19 మంది... మహిళల సింగిల్స్‌లో 25 మంది విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్‌లో చైనా నుంచి 9 జోడీలు... మహిళల డబుల్స్‌లో 29 జోడీలు... మిక్స్‌డ్
డబుల్స్‌లో 19 జోడీలు టైటిల్స్ గెలిచాయి.