అమెరికాలో తెలుగు వారికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నార్త్ కరోలైనాలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ నార్త్ కరోలైనా విభాగం నార్త్ క్వారీ పార్క్‌లో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు స్థానిక తెలుగు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 24 జట్లు ఐదు డివిజన్లలో పోటీ పడి తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాయి. ఈ టోర్నమెంట్ కేవలం ఒక ఆటల పోటీగానే కాకుండా, తెలుగు వారందరిని ఒకచోట చేర్చే ఒక వేదికగా నిలిచింది. క్రీడాకారుల మధ్య కనిపించిన అద్భుతమైన సమన్వయం, తెలుగు వారి ఐక్యతకు ప్రతిబింబింలా నిలిచాయి.

అభిమానుల నుంచి లభించిన ఉత్సాహభరితమైన మద్దతు ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠను పెంచింది. నాట్స్ నార్త్ కరోలైనా విభాగం నిర్వహించిన ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు దగ్గుబాటి, నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ ఉమాశంకర్ నార్నే, నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్ దీపిక సాయపురాజు, వెబ్ అండ్ మీడియా కో ఆర్డినేటర్ రాజేష్ మన్నేపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రవి ఖాజా చేసిన కృషి ప్రశంసనీయం. వారి నిబద్ధత, అంకితభావం కారణంగా ఈ టోర్నమెంట్ ఒక చిరస్మరణీయమైన ఈవెంట్‌గా నిలిచింది.

నార్త్ క్వారీ పార్క్‌లో నిర్వహించిన నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ నార్త్ కరోలైనా టీం సభ్యులను అభినందించారు. ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో విజేతలకు నాట్స్ నాయకులు బహుమతులు ప్రదానం చేశారు.

నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
• Division 1: Beer Box జట్టు విజేతగా నిలవగా, Chill Out జట్టు ద్వితీయ స్థానంతో పోరాట స్ఫూర్తిని చాటింది.
• Division 2: Infinity జట్టు అద్భుతమైన ఆట తీరుతో విజయం సాధించగా, Unicorn Beeta జట్టు రన్నరప్‌గా నిలిచింది.
• Division 3: Strikers తమ పేరుకు తగ్గట్టుగా బలమైన ప్రదర్శనతో విజేతగా నిలవగా, Falcon Wings జట్టు పట్టుదలతో ద్వితీయ స్థానం సాధించింది.
• Division 4: Warrior Xtremes మరియు Warrior Ignites జట్ల మధ్య జరిగిన పోరులో, Warrior Xtremes విజయం సాధించింది.
• Division 5: Arrow Club జట్టు తమ కచ్చితత్వంతో గెలుపొందగా, Cava జట్టు బలమైన పోరాటాన్ని కనబరచి ద్వితీయ స్థానంలో నిలిచింది.