భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా అనేది హక్కేం కాదని.. తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది.
భారత్‌లోని యూఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. అందులో..
‘‘అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసా అనేది హక్కు కాదు. అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే’’ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. దేశం నుంచి వెల్లగొట్టడమే కాకుండా భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోవచ్చని స్పష్టం చేసింది.
Breaking U.S. laws can have serious consequences for your student visa. If you are arrested or violate any laws, your visa may be revoked, you may be deported, and you could be ineligible for future U.S. visas. Follow the rules and don’t jeopardize your travel. A U.S. visa is a… pic.twitter.com/A3qyoo6fuD
— U.S. Embassy India (@USAndIndia) January 7, 2026
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. స్టూడెంట్ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరిగా మారాయి. అలాగే స్టూడెంట్ స్టేకు టైమ్ లిమిట్ వంటి నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మార్పులు అమెరికాలో చదవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెదిరింపులు రావడం గమనార్హం.


