అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య! | Indian Woman Found Dead In USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!

Jan 5 2026 9:47 AM | Updated on Jan 5 2026 12:26 PM

Indian Woman Found Dead In USA

అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది.  న్యూ ఇయర్‌ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి తన మాజీ ప్రియుడు  ఫ్లాట్‌లో శవమై కనిపించింది.  మేరీల్యాండ్‌లోన  మాజీ ప్రియుడు అర్జున్‌ శర్మ ఫ్లాట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 

దాంతో అర్జున్‌ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్‌ శర్మ పరారీలో ఉన్నాడు.  అతని కోసం యూఎస్‌ పోలీసులు గాలిస్తున్నారు.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తుంది.మాజీ ప్రియుడిపై ఫస్ట్- సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ  అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. 

జనవరి 2వ తేదీన ఆమె అవృశ్యమైన ఫిర్యాదు తమకు వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపడితే ఆమె హత్య గావించబడ్డ విషయం తాజాగా వెలుగుచూసిందన్నారు.  మేరీల్యాండ్‌ సిటీలోని అర్జున్‌శర్మ ఫ్లాట్‌లో  ఆమె డిసెంబర్‌ 31వ తేదీన చివరిసారి కనిపించినట్లు పోలీసులకు అపార్ట్‌మెంట్‌ వాసులు తెలిపారు.  

అదే అపార్ట్‌మెంట్‌లో సెర్చ్‌ వారెంట్‌ అమలు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కత్తిపోట్లతో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.  ఆమెది తెలంగాణ రాష్ట్రంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు.   అయితే అర్జున్‌ శర్మది కూడా ఇండియానే. హత్య చేసిన తర్వాత అర్జున్‌ శర్మ భారత్‌కు  వచ్చేశాడు.హత్యోదంతం తర్వాత భారత్‌కు వచ్చేసిన అర్జున్‌ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు.  అర్జున్‌ శర్మది తమిళనాడు రాష్ట్రంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement