లావణ్య త్రిపాఠి కేసు దర్యాప్తు ముమ్మరం | Hyderabad Cybercrime Police Seek Instagram Details Over Lavanya Tripathi Social Abuse Case, Details Inside | Sakshi
Sakshi News home page

లావణ్య త్రిపాఠి కేసు దర్యాప్తు ముమ్మరం

Mar 11 2026 7:25 AM | Updated on Mar 11 2026 9:48 AM

lavanya tripathi online harassment case hyderabad cyber crime probe

ఆ ఐడీ వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌కు సైబర్‌ కాప్స్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొణిదెలను ఆన్‌లైన్‌ వేధింపులకు గురిచేసిన ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆ సంస్థకు ఈ–మెయిల్‌ ద్వారా లేఖ రాశారు. అభ్యంతరకర, అసభ్య, పరువుకు భంగం కలిగించే అంశాలను తొలగించాలని కోరారు. తనకు ఎదురైన ఆన్‌లైన్‌ వేధింపులపై లావణ్య త్రిపాఠి మేనేజర్‌ శనివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

ఫిర్యాదుతోపాటు ఆధారాలుగా 11 స్క్రీన్‌షాట్లను పోలీసులకు అందించారు. దాదాపు 15 వారాలుగా ఎదుర్కొంటున్న వేధింపులను వివరించారు. ఇన్‌స్టాలో ‘పర్పుల్‌ క్రెయాన్‌ 00’అకౌంట్‌ ఐడీ ఉన్న వ్యక్తి.. లావణ్య త్రిపాఠిపై పెట్టిన అభ్యంతరకర పోస్టులు, కామెంట్స్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ ఐడీకి సంబంధించిన ఐపీ అడ్రస్‌ను సంగ్రహించాలని నిర్ణయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement