దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఒకటీ రెండూ కాదు ఏకంగా పాతిక లక్షల రూపాయలను గెల్చుకున్నాడు. గత రెండేళ్లుగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్న 57 ఏళ్ల బషీర్‌ను ఎట్టకేలకు అదృష్టదేవతవరించింది.
కేరళకు చెందిన బషీర్ కైపురత్ గత పాతికేళ్లుగా యూఏఈలో నివసిస్తున్నాడు. అతని వృత్తి డ్రైవర్. ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోతుందా అనే ఆశతో ప్రతీ నెలా క్రమం తప్పకుండా బిగ్ టికెట్ టిక్కెట్లను కొనుగోలు చేయడం అతనికి అలవాటు. చివరికి రెండేళ్లకు పైగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అతని కల ఫలించింది. బిగ్ టికెట్ ఈ-డ్రాలో 276640 నంబర్ టిక్కెట్‌తో Dh100,000 (సుమారు రూ. 24 లక్షలు) గెలుచుకున్నాడు.
చదవండి: అధికారులే షాక్ : పౌర్ణమి, గుప్త నిధులు, 8 నెలల బాలుడు
ఆసక్తికర విషయం ఏమిటంటే.. 'రెండు కొంటే మూడు ఉచితం అనే పరిమిత కాల ఆఫర్ కింద దీన్ని కొనుగోలు చేశాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ఈ డ్రా గెల్చుకున్నట్టు ఫోన్ రాగానే తొలుత తాను అస్సలు నమ్మలేదని ఆ గెలుపును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అంటూ పట్టరాని సంతోషాన్ని ప్రకటించాడు. ఈ డబ్బులో కొంత భాగాన్ని భారతదేశంలోని తన కుటుంబానికి ఇవ్వాలని భావిస్తున్నాడు. ఓపిక, పట్టుదల తప్పకుండా గెలుస్తాయంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో కూడా డ్రాలలో కూడా పాల్గొంటానని చెప్పాడు.
ఇంతకు ముందు గుజరాత్‌కు చెందిన 52 ఏళ్ల కంప్యూటర్ టీచర్ రితేష్ ధనక్ సుమారు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్న రితేష్, దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా బిగ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అలవాటున్న రితేష్ తన స్నేహితులతో కలిసి దీన్ని కొనుగోలు చేసి, గెల్చుకున్నాడు.
ఇదీ చదవండి: గాయని చిత్ర అయ్యర్ సోదరి దుర్మరణం, ఇన్‌స్టా పోస్ట్ వైరల్
కాగా బిగ్ టికెట్ యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన రాఫెల్ డ్రాలలో ఒకటి. ఇందులో గెలుపొందిన విజేతలు భారీ నగదు బహుమతులు, లగ్జరీ కార్లను దక్కించుకోవచ్చు. ఇది అబుదాబిలో ఉన్నప్పటికీ, దుబాయ్‌తో సహా దేశవ్యాప్తంగా ఇది ఆకర్షిస్తుంది. ఈ డ్రాలు నెలవారీగా జరుగుతాయి. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు న్నవారు ఈ టిక్కెట్లను అధికారిక బిగ్ టికెట్ వెబ్‌సైట్ ద్వారా లేదా అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం, లేదా ఎంపిక చేసిన అధీకృత అవుట్‌లెట్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.


