మలయాళ నేపథ్య గాయని చిత్ర అయ్యర్ సోదరి 52 ఏళ్ల శారదా అయ్యర్ ఒమన్‌లో దుర్మరణం పాలయ్యారు. ఒమన్‌లో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి కచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం, కేరళలోని తాజవాకు చెందిన శారదా అయ్యర్ ఒమన్ ఎయిర్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. ప్రస్తుతం మస్కట్‌లో నివసిస్తున్నారు. ఒమన్‌లోని అల్ దఖిలియా గవర్నరేట్‌లోని జెబెల్ షామ్స్ ప్రాంతంలోని కఠినమైన వాడి ఘుల్ గుర్తింపు పొందిన మార్గాలలో ట్రెక్కింగ్ చేస్తున్న బృందంలోటీంలో ఆమె కూడా ఒకరని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అయ్యర్ మృతదేహాన్ని ఒమన్ నుండి కేరళకు తీసుకువస్తున్నారు. జనవరి 7న తాజవాలోని వారి పూర్వీకుల ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.
దివంగత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్.డి. అయ్యర్, రోహిణికుమార్తె శారదా అయ్యర్. డిసెంబర్ 11న తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 24న తిరిగి ఒమన్‌కు వచ్చినట్లు సమాచారం. తన సోదరి మరణంపై చిత్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందమైన నా సోదరీ, నువ్వు వెళ్లిపోయావు.. ఫోన్‌లో నాన్‌స్టాప్‌గా మాట్లాడే నీగొంతు వినకుండా, పక్కగదిలో నిరంతరం వినిపించే నీ అరుపులు లేకుండా నేను ఎలా జీవించాలి.. తొందరగా వెళ్లిపోయావు.. నేను కూడా నీతో పాటే’’ చాలా ఆవేదనతో కూడిన ఆమె ఇన్‌స్టా పోస్ట్ పలువురి కంట కన్నీరు పెట్టిస్తోంది. చాలా తక్కువ వ్యవధిలోనే అటు తండ్రిని, ఇటు సోదరిని కోల్పోయిన చిత్రకు అభిమానులు, సన్నిహితులు సానుభూతి ప్రకటించారు.
సాధారణంగా శారదా అయ్యర్ అండ్ టీం ట్రెక్కింగ్‌కు వెళ్లిన ప్రదేశంలోని నిటారుగా ఉండే కొండలు , సవాలుతో కూడినభూభాగం ట్రెక్కింగ్ చేసేవారికి ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.


