breaking news
Oman
-
నన్ను టార్చర్ చేస్తున్నారు.. స్వదేశానికి తీసుకెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లిన మహిళ షబ్నం బేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒమన్‌లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్ ద్వారా ఒమన్ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్ నా పాస్‌పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
రోజూ 15 గంటలు పని.. 4 నెలలుగా జీతం లేదు
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న భారతీయుల సంఖ్య రోజురోజూకు పెరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన షబ్నం బేగం అనే మహిళ ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లి అక్కడ యజమాని చేతిలో దారుణమైన వేధింపులకు గురైంది. రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, మూడు నెలలుగా జీతం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది.ఏమి జరిగిందంటే?హైదరాబాద్ పహాడీ షరీఫ్‌కు చెందిన షబ్నం బేగంకు ఒమన్‌లో గృహ కార్మికురాలిగా ఉద్యోగం ఇప్పిస్తానని స్థానిక రిక్రూట్మెంట్ ఏజెంట్ ఒకరు నమ్మబలికాడు. నెలకు 200 ఒమానీ రియాల్స్ జీతం (సుమారు రూ. 43,000) ఇప్పిస్తానని చెప్పడంతో ఈ ఏడాది మార్చి 26న ఆమె ఒమన్ రాజధాని మస్కట్‌కు చేరుకుంది. ఆమెకు అక్కడ చేరుకున్న మొదటి రోజు నుంచే నరకం మొదలైంది. ఒక ఇంట్లో పని అని చెప్పి, యజమాని ఆమెతో రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పలు ఇళ్లలో బలవంతంగా చాకిరీ చేయించుకున్నాడని షబ్నం బేగం తెలిపింది. ఉండటానికి సరైన వసతి కల్పించకపోగా, కడుపునిండా కనీసం అన్నం కూడా పెట్టకుండా వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత నాలుగు నెలలుగా ఆమె చేసిన పనికి పైసా జీతం కూడా ఇవ్వలేదని షబ్నం వెల్లడించింది. యజమాని బారి నుండి చాకచక్యంగా తప్పించుకున్న షబ్నం బేగం ప్రస్తుతం మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ)లో ఆశ్రయం పొందుతున్నారు. షబ్నంను సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. -
భారత జట్టుకు రెండో విజయం
బ్యాంకాక్: ఆసియా కప్ అండర్–18 మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 99–17తో ఒమన్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన జొన్నలగడ్డ విహా రెడ్డి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... నేత్ర బిరుదవోలు, శాన్వీ కొలిశెట్టి కూడా భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఒమన్‌తో మ్యాచ్‌లో విహా 13 నిమిషాలు, నేత్ర 16 నిమిషాలు, శాన్వీ 13 నిమిషాలు బరిలో ఉన్నారు. భారత్ తరఫున తారుశ్రీ 25 పాయింట్లు స్కోరు చేయగా... సాధన, ఏంజెలినా, మెహక్ శర్మ 12 పాయింట్ల చొప్పన సాధించారు. -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఒమన్ తీరంలో హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ‘జీఎఫ్ఎస్ గెలాక్సీ’పై ఇరాన్ సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారిలో 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. అతడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో మొత్తంగా 23 మందిని కాపాడారు. వాణిజ్య నౌకపై ఇరాన్ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన నావికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మస్కట్‌లోని ఒమన్ అధికారులతో కలిసి ఇండియన్ ఎంబసీ గాలింపు చర్యలను సమీక్షిస్తోంది. ఇరాన్ దాడిలో నౌక వెంటనే మంటల్లో చిక్కుకుంది. హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు హెచ్చరికగా జరిపిన దాడికి ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడిలో సైప్రస్ జెండా కలిగిన జీఎఫ్ఎస్ గెలాక్సీ నౌక అగి్నకి ఆహూతయ్యింది. హార్మూజ్‌లో అది అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తోందని ఇరాన్ పేర్కొంది. ఈ ఘటన పట్ల ఎవరైనా ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు జీఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని కారణంగా చూపుతూ అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో విడత దాడులు చేపట్టింది. ఈ వారంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇది మూడోది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని సుమారు 140 సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులుచేసింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత నిఘా కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వెల్లడించింది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన ఖెష్మ్ దీవిపై ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుస దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ అధికార వార్తా సంస్థ ఈ విషయం ప్రకటించింది. దీవిలోని సైనిక లక్ష్యాలపై కనీసం డజను దాడులు జరిగినట్లు తెలిపింది. ఇరాన్ ప్రతిదాడులు అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్ వెంటనే ప్రతిచర్యకు దిగింది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్‌లపై వైమానిక దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు ఖతార్ సైన్యం ప్రకటించింది. పొరుగున ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతర్‌లో ఇరాన్ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన గగనతల రక్షణ వ్యవస్థ శకలాల కారణంగా ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేశామని కువైట్ వెల్లడించింది. అమెరికా దూకుడుపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నౌకలు అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్నాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. వాటిలో ఒకనౌకపై ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. హార్మూజ్‌ను మూసేశామని పేర్కొంది. అయితే హార్మూజ్ తెరచే ఉందని అమెరికా పేర్కొంది. వచ్చేవారం జనం ముందుకు మొజ్తబా! ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వచ్చేవారం ప్రజల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ సభను వచ్చేవారం నిర్వహించబోతున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా ఈ సభ జరుగనుంది. అయితే, ఈ కార్యక్రమానికి మొజ్తబా హాజరవుతారా? లేదా? అనే దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.నౌకలపై ఎలాంటి ఆంక్షలు వద్దు: భారత్ హార్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేలా దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలను విజయవంతంగా ముగించాలని విన్నవించింది. హార్మూజ్‌లో నౌకలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంచేసింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన. నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది. -
బతుకుదెరువు కోసం వెళ్లి.. ఏకంగా ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా
ఒమన్ జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ వినాయక్ శుక్లా ఎంపికయ్యాడు. ఏంటి యూపీ క్రికెటర్ ఒమన్ టీమ్ కెప్టెన్ కావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. అతడి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తి దాయకం.యూపీలోని కాన్పూర్‌లో జన్మించిన 31 ఏళ్ల వినాయక్ శుక్లా.. 2016లో పీఏసీ క్రికెట్ మైదానంలో కోచ్ లేఖ్చంద్ గుప్తా పర్యవేక్షణలో తన క్రికెట్ జర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత బెంగాల్‌కు తన మకాంను మార్చి కలకత్తా కస్టమ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చి యూపీసీఏ అండర్-14, అండర్-16 ట్రయల్స్‌తో పాటు దేశవాళీ డొమెస్టిక్ క్యాంప్‌లకు హాజరైనప్పటికీ సెలెక్ట్ కాలేదు. సీనియర్ ప్లేయర్ ప్రకాష్ పలాండే సాయంతో క్లబ్ క్రికెట్ ఆడేందుకు కెన్యా కూడా వెళ్లాడు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా 4 నెలల్లోనే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.టర్నింగ్ పాయింట్ ఇదేభారత్లో క్రికెట్ ఆడే అవకాశాలు రాకపోవడంతో వినాయక్ ఉద్యోగం కోసం 2021లో ఒమన్‌కు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి 'నేషనల్ మెటల్కాన్స్' (National Metalcans)లో డేటా ఎంట్రీ అపరేటర్‌గా చేరాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. క్రికెట్‌పై ఉన్న మక్కువతో అక్కడ స్ధానిక లీగ్‌ల్లో ఆడాడు. నేషనల్ మెటల్కాన్స్ కంపెనీ జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో 'ఒమన్ స్టాలియన్స్' తరఫున కూడా అతడు ఆడాడు.ఆ తర్వాత అతడికి 2023లో ఒమన్ 'ఎ' జట్టు తరపున పిలుపు వచ్చింది. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో ఏడాది తిరగకముందే అతడు జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2024లో గల్ఫ్ కప్‌లో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ జట్టు తరపున శుక్లా డెబ్యూ చేశాడు.ఇప్పుడు ఏకంగా అరంగేట్ర చేసిన రెండేళ్ల కాలంలోనే ఒమన్ కెప్టెన్ అయ్యి చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించిన జతీందర్ సింగ్ స్థానాన్ని వినాయక్ భర్తీ చేయనున్నాడు. వినాయక్ ఇప్పటివరకు ఒమన్ తరపున 14 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. -
సముద్రంలో మునిగిన భారత నౌక.. 14 మంది భారతీయులు..!
-
హర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్‌పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్ హర్ముజ్‌ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అన్నారు.ఈ విషయమై ఒమన్‌తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
అది ఇరాన్ ఘాతుకమే
వాషింగ్టన్: ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టుచేశారు. అలాగే శాంతి ఒప్పందంలోని పలు అంశాలను మీడియాకు ఇరాన్ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మూడు నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ట్రంప్ ఇరాన్ వైపు వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాంతక దాడులు ఆపాల్సిందే: భారత్ భారతీయ సిబ్బందితో కూడిన మూడు వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని అంతకుముందు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రాణాంతకమైన, ఘోరమైన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని ఆపాల్సిందేనని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్‌లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త(ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్‌కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. తమ విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. జాసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. నౌకపై భీకర దాడి గురించి తెలిసిన తర్వాత తొలుత బుధవారం రాత్రి సమన్లు ఇచ్చారు. ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో మరోసారి సమన్లు జారీ చేశారు. ‘‘భారతీయ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం కొనసాగిస్తున్న దాడుల పట్ల జాసన్ మీక్స్‌కు ఇప్పటికే ఒకసారి తీవ్ర నిరసన తెలియజేశాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం బాధాకరం’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకాయానంపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి దుందుడుకు చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని, క్లిష్ట సమయంలో ఒక సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని తేల్చిచెప్పింది. భారతదేశం తీవ్ర ఆందోళనలను అమెరికా ప్రభుత్వ వర్గాలకు తెలియజేయాలని, అలాగే పశ్చిమాసియాలో పనిచేస్తున్న అమెరికా సైనిక బలగాలు పౌరుల ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అమె రికా దౌత్యవేత్తకు సూచించినట్లు తెలియజేసింది. భరతమాత బిడ్డలను మోదీ కాపాడలేరు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: అమెరికా మిలటరీ కాల్పుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో రాజీపడ్డ ప్రధాని భరతమాత బిడ్డలను కాపాడలేకపోయారని, వారి ప్రాణా లను తీసుకున్న వారిని ప్రశ్నించే శక్తి కూడా ఆయనకు లేకపోయిందని శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లో అంతర్జాతీయ సముద్ర జలాల్లో మూడు నౌకలపై అమెరికా దాడుల చేసి ముగ్గురు భారతీయులను చంపితే ఇప్పటివరకూ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వచ్చే వారం జరగనున్న జీ–7 సమావేశాల్లోనూ ఆయన నోరు మెదపరని, నవ్వుతూ కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసి వస్తారని, మరణించిన ముగ్గురు నావికుల గురించి ఏమీ మాట్లారని విమర్శించారు.ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు: ఇరాన్ భారత సిబ్బందితో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ శుక్రవారం ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని తేల్చిచెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అమెరికా చర్యలు నౌకాయాన స్వేచ్ఛకు ప్రమాదం కలిగిస్తున్నాయని ఆరోపించారు. అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని ప్రభుత్వ సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనంగా ఇస్మాయిల్ బఖాయీ అభివర్ణించారు. -
గంట తరువాత బిడ్డ చావు కబురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి!
గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో.. జరిగిన ఒక విషాదకర ఘటన భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలావు (Palau) దేశ జెండా కింద ప్రయాణిస్తున్న ఏంటీ సెట్టెబెల్లో (MT Settebello) అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి చేయడంతో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 23 ఏళ్ల యువకుడు ఆదిత్య శర్మ (Aditya Sharma) కూడా ఉన్నాడు. ఈ సంఘటన అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రత, యుద్ధ నిబంధనలు & భారతీయ నావికుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.అమెరికా ఆరోపణలుఅమెరికా ఆరోపణల ప్రకారం.. ఏంటీ సెట్టెబెల్లో నౌక ఇరాన్ నుంచి చమురును తరలిస్తూ అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించింది. ఈ కారణంగా నౌకపై దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అయితే.. నౌక యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండిస్తూ అంతర్జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి తర్వాత ఒమాన్ అధికారులు 21 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే.. ముగ్గురు భారతీయ నావికులు కనిపించకుండా పోయారు. అనంతరం వారి మృతదేహాలను గుర్తించి మరణించినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. మరణించిన వారిలో డెక్ కేడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఉన్నారు.క్షేమంగా ఉన్నా అని మెసేజ్.. అంతలోనేఆదిత్య శర్మ మరణం హృదయ విదారకంగా మారింది. దాడికి ఒక గంట ముందు మాత్రమే ఆయన తన తండ్రికి వాట్సాప్‌లో ''నేను క్షేమంగా ఉన్నాను'' అని సందేశం పంపారు. ఆ తరువాత జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మరణంతో తీవ్ర వేదనకు గురైన ఆయన తండ్రి, వాణిజ్య నౌకపై క్షిపణులతో దాడి చేయడం యుద్ధ నేరంగా పరిగణించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే.. ఏంటీ మారివెక్స్ నౌకపై కూడా అమెరికా దాడికి గురైంది. అందులోని 24 మంది భారతీయ నావికులను ఒమాన్ అధికారులు రక్షించారు. అదేవిధంగా ఏంటీ జాల్వేర్ ఏంటీ జావీర్ అనే మరో నౌక ప్రమాదంలో చిక్కుకోవడంతో భారత రాయబార కార్యాలయం, ఒమాన్ నౌకాదళం సహాయంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ అమెరికా ప్రతినిధిని పిలిపించి అధికారిక నిరసన తెలిపింది. భారత ప్రభుత్వం సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది.ప్రమాదకర పరిస్థితుల్లో నావికులుప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ప్రపంచంలోని రోజువారీ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల వేలాది మంది నావికులు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.Three Indian Seafarers killed in US attack on a Vessel off the coast of Oman. 3 attacks in last 4 days. Family of Indian seafarer Aditya Sharma calls it a war crime, demanding investigation. Several Indian crew rescued. India summons top American diplomat, lodges strong protest. pic.twitter.com/fhw4kqTm84— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 11, 2026 -
భారత షిఫ్‌పై అమెరికా దళాలు దాడి.. తెలుగు ఇంజనీర్ మృతి
విశాఖ: ఒమన్ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్ అనే మెరైన్ ఇంజనీర్ మృతిచెందాడు. భారత్‌కు చెందిన షిప్‌పై ఒమన్ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా మర్చంట్ నేవీలో సురేష్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్‌లోని సురేష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఒమన్ తీరంలో 3 రోజుల్లో 3 వాణిజ్య నౌకలపై దాడులు
-
అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి
మస్కట్: ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. మొత్తం 24 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ వాణిజ్య నౌకపై జరిగిన దాడితో ఒక్కసారిగా సముద్ర తీరం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.అమెరికా దాడి.. భారతీయుల బలిఈ వారంలో ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా దళాలు ఈ చమురు ట్యాంకర్‌పై దాడి చేశాయి. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 24 మంది భారతీయులలో 21 మందిని రక్షించగా, ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. అయితే, గురువారం నాటి తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు నావికులు మరణించారని ప్రకటించారు.స్వదేశానికి మృతదేహాల తరలింపుఈ విషాద సమయంలో నౌకాదళ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బాధితుల కుటుంబాలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మిగిలిన 21 మంది భారతీయ సిబ్బందిని వెంటనే స్వదేశానికి రప్పించడానికి, అలాగే మరణించిన నావికుల భౌతిక కాయాలను వేగంగా భారతదేశానికి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను కేంద్రం ఆదేశించింది.అమెరికా రాయబారికి భారత్ సమన్లుఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు జరపడం, భారతీయ నావికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని సీనియర్ అమెరికా రాయబారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసి, తన నిరసనను బలంగా నమోదు చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణించే భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
మరో వాణిజ్యనౌకపై అమెరికా దాడి
న్యూఢిల్లీ: ఒమన్‌లోని సోహర్ నగరానికి సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లో వాణిజ్య నౌక ‘ఎంటీ సెటెబెల్లో’పై బుధవారం అమెరికా సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. అంతే సంఖ్యలో భారతీయులున్న మరో చమురు రవాణా నౌక ‘ఎంటీ మ్యారీవెక్స్’పై అమెరికా రెండ్రోజుల క్రితం దాడి చేయడంపై భారత్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వేళ ‘ఎంటీ సెటెబెల్లో’ నౌకపై దాడి జరగడం గమనార్హం. దాడి ఘటనపై భారత్ బుధవారం ఘాటుగా స్పందించింది. ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డి అఫైర్స్ జేసన్ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్ అధికారిక ప్రకటన వెలువర్చింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని మోదీ సర్కార్ తప్పుబట్టింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలమార్గాలల్లో స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పేర్కొంది. సెటెబెల్లో నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటివరకు 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని వార్తలొచ్చాయి. -
కార్గో నౌకపై దాడి ఘటన.. ముగ్గురు భారతీయుల గల్లంతు
ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 21 మంది భారతీయులను రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ (బుధవారం) ధృవీకరించింది. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఒమన్ అధికారులతో కలిసి గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఒమన్ గల్ఫ్‌లోని సోహార్ తీరంలో పలావు (Palau) జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఇంజన్ రూమ్‌ను మిస్సైల్ తాకింది. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ నౌక ఒమాన్‌లోని సోహార్ పోర్టుకు ఈశాన్య దిశలో సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైన వెంటనే ప్రమాద సంకేతం (distress call) పంపింది. ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం కూడా సంభవించినట్లు సమాచారం.కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. -
పేల్చి పడేస్తాం.. మిత్ర దేశానికి ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రదేశమైన ఒమన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ హర్ముజ్ విషయంలో ఒమన్ గనుక ఇరాన్‌కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాన్ని పేల్చి పడేస్తాం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎవరితో కయ్యం పెట్టుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఈ సారి ఆయన అమెరికా మిత్ర దేశమైన ఒమన్‌పై విరుచుకపడ్డారుఅమెరికాలో జరిగిన ఓసమావేశంలో అక్కడి జర్నలిస్టులు ఇరాన్, ఒమన్ కలిసి హర్ముజ్ నియంత్రించేలా తాత్కాలిక ఒప్పందాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందిన ట్రంప్ "లేదు, ఆ జలసంధి అందరి కోసం తెరిచే ఉంటుంది. అది అంతర్జాతీయ జలభాగం. మిగతా అందరిలాగే ఒమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి, లేదంటే మేము వారిని పేల్చి పడేయాల్సి వస్తుంది. వారికి ఆ విషయం బాగా తెలుసు, అంతా సర్దుకుంటుంది," అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై తదుపరి చిన్న వివాదం చెలరేగింది. ట్రంప్ నిజంగానే ఒమన్‌ని అన్నారా? లేక ఇరాన్‌కి బదులుగా పొరబాటున ఒమన్ పేరు వాడారా అన్నారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడి మీడియా ప్రతినిధులు వైట్హౌస్నను కోరినటప్పటికీ వారు స్పందించనట్లు తెలుస్తోంది. -
ఒమన్‌లో సుదీర్ఘ సెలవులు!
మస్కట్: ఒమన్ నివాసితులకు ఈద్ అల్ ఫితర్ (బక్రీద్) సందర్భంగా ఈసారి సుదీర్ఘ సెలవులు లభించే అవకాశం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని దేశంలో వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వచ్చే వారం విడుదల చేయనుంది.ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. 'అరాఫా డే' మే 26 (మంగళవారం) వచ్చే అవకాశం ఉంది. దీంతో మే 26 నుండి మే 31 (ఆదివారం) వరకు సెలవులను పొడిగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, దుల్ హజ్ మాసపు చంద్రదర్శనం ఆధారంగానే ఈ సెలవుల తుది తేదీలపై స్పష్టత రానుంది.పర్యాటక రంగానికి ఊపు..వరుస సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో ఒమన్‌లోని స్థానికులు, ప్రవాసీయులు ఇప్పటికే తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దేశీయంగా ఉండే పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ఈ లాంగ్ వీకెండ్ ఎంతగానో ఉపయోగపడనుంది. సాధారణంగానే ఈద్ పండుగ రోజుల్లో ఒమన్‌లోని తీరప్రాంతాలు, పర్వత ప్రాంత పర్యాటక స్థలాలు సందర్శకులతో కిక్కిరిసిపోతాయి.చంద్రదర్శనం ఆధారంగా తేదీలను ఖరారు చేసిన వెంటనే, కార్మిక మంత్రిత్వ శాఖ సెలవులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. -
భారత నౌకపై దాడి: ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో నౌక పూర్తిగా మునిగిపోయినప్పటికీ, అందులోని 14 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది.సోమాలియా నుండి బయలుదేరిన ఈ నౌక బుధవారం ఒమన్ తీరానికి సమీపంలో ఉండగా దాడికి గురైంది. దాడి కారణంగా నౌకలో భారీగా మంటలు చెలరేగి, చివరకు అది సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించి, సిబ్బందిని రక్షించి 'దిబా' నౌకాశ్రయానికి తరలించారు.భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంఈ దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడం "ఆమోదయోగ్యం కాదు" అని స్పష్టం చేసింది. "భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినందుకు ఒమన్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాణిజ్య నౌకల స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం, అమాయక పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడం వంటి చర్యలను భారత్ సహించదు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.యూఏఈ సంఘీభావంఈ ఉగ్రవాద దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర నావిగేషన్‌కు, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పు అని హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఈ దాడి స్పష్టంగా ఉల్లంఘించిందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత నౌకల భద్రత కోసం తీసుకునే అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని యూఏఈ ప్రకటించింది.ఆందోళన కలిగిస్తున్న ప్రాంతీయ పరిస్థితులుఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి భారత నౌకలపై దాడి జరగడం ఇది మూడవసారి. హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో ఈ తాజా దాడి చోటుచేసుకోవడం గమనార్హం. వాణిజ్య మార్గాలను ఆర్థిక బ్లాక్మెయిల్ కోసం వాడుకోవడం పైరసీ చర్యలతో సమానమని, ఇది ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.UAE Strongly Condemns Terrorist Attack on Indian-Flagged Ship off the Coast of Oman pic.twitter.com/gRArK2tniB— MoFA وزارة الخارجية (@mofauae) May 14, 2026 -
ఒమన్‌లో పెను విషాదం
ఒమన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. రుస్తాక్ విలాయత్‌లోని అల్-హైమాలి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై, ప్రాణాల కోసం పోరాడుతున్నారు. పాడుబడిన ఓ మట్టి భవనం కూలిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో చిన్నారులు భవనంలో ఆడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.ఒమన్‌లో గతంలో కూడా పాడుబడిన భవనాలు, గోడలు కూలి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోపక్క ఒమన్ ఇరాన్ మిస్సైల్ దాడులతో సతమతమవుతుంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిరోజు ఒమన్‌పై దాడులు చేస్తుంది. ఒమన్‌తో నేరుగా ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న కారణంగా ఇరాన్ దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్,అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
ఒమన్‌లో వరద బీభత్సం.. ముగ్గురు మృతి
మస్కట్/దుబాయ్: గల్ఫ్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలతో ఒమన్, యూఏఈ అతలాకుతలమవుతున్నాయి. ఒమన్‌లో వరద ఉధృతికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం పొడవునా వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని ‘వాడి అల్ మావిల్’ వద్ద వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వేగంగా వచ్చిన నీటి తాకిడికి మూడు వాహనాలు కొట్టుకుపోయాయి.ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు మరణించినట్లు ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. సహాయక బృందాలు ఒకరిని ప్రాణాలతో కాపాడగలిగాయి. మస్కట్, అల్ బతినా తీర ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన మరో 40 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. యూఏఈలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్‌లో ఈ రాత్రి భారీ పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఎన్సీఎం)అంచనా వేస్తోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల ధూళి మేఘాలు కమ్ముకొని, విజిబిలిటీ గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20°C నుంచి 23°C మధ్య నమోదవుతున్నాయి. Significant flooding in Muscat, Oman’s port capital today...🌊 pic.twitter.com/ZBkEdqBBWj— Volcaholic 🌋 (@volcaholic1) March 21, 2026వారికి భారీ జరిమానాలువరదలను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు వాగులు, వంకల దగ్గరకు వెళ్లే వారికి యూఏఈ హోం మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. వరద కాలువలు లేదా డ్యామ్‌ల వద్ద గుమిగూడినా, ప్రవహిస్తున్న వాగుల్లోకి వాహనాలతో వెళ్లినా శిక్ష తప్పదని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వాడి అల్ నహ్వా’, ‘అల్ హేయర్’ దృశ్యాలు వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మంగళవారం వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: మరో చరిత్ర లిఖించిన ప్రధాని మోదీ -
గల్ప్‌కు మరిన్ని భారత యుద్ధ నౌకలు
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల నడుమ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతుండటంతో కీలక చమురు రవాణా మార్గాలను కాపాడుకునేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తోంది.ఏడుకు చేరిన యుద్ధ నౌకలుపశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ దేశాలకు 20 శాతం ముడి చమురు సరఫరా చేసే హార్మూజ్ జలసంధి ప్రస్తుతం మూతపడింది. ఈ క్రమంలో భారత చమురు నౌకలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు నౌకాదళం తన యుద్ధ నౌకల మోహరింపును మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ మూడు యుద్ధనౌకలు ఉండగా, తాజాగా చేపట్టిన అదనపు మోహరింపుతో ఈ సంఖ్య ఏడుకు చేరనుంది.నౌకాదళం అభయంషిప్పింగ్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జలసంధికి పశ్చిమ దిశలో సుమారు 22 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. అయితే భారత నౌకాదళం పహారా నడుమ ఇప్పటికే కొన్ని నౌకలు క్షేమంగా చేరుకున్నాయి. గత వారం ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే రెండు ఎల్పీజీ క్యారియర్లు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో భారత తీరానికి చేరుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరా పోర్ట్ నుండి బయలుదేరిన ఒక చమురు ట్యాంకర్‌ను కూడా భారత యుద్ధనౌక సురక్షితంగా ఎస్కార్ట్ చేసింది.ఏమిటీ ‘ఆపరేషన్ సంకల్ప్’?భారత నౌకాదళం 2019 నుండి ‘ఆపరేషన్ సంకల్ప్’ పేరుతో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తన ఉనికిని చాటుతోంది. సముద్ర మార్గంలో భారత వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి నౌకాదళం తన పహారాను మరింత కఠినతరం చేసింది. దీనికితోడు 2008 నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో కొనసాగుతున్న సముద్రపు దొంగల వ్యతిరేక గస్తీ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత ఇంధన భద్రతకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా, నౌకాదళం గల్ఫ్ ప్రాంతంలో నిరంతర నిఘా ఉంచుతోంది.ఇది కూడా చదవండి: 80 వేల టన్నుల చమురుతో భారత్‌కు ‘జగ్ లాడ్కీ’ -
యూఏఈ, ఒమన్‌లో రంజాన్ సెలవులు ప్రకటన
మస్కట్: ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒమన్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులకు మార్చి 19 గురువారం నుంచి మార్చి 23 సోమవారం వరకు సెలవులు అమల్లో ఉంటాయి. అనంతరం మార్చి 24 నుంచి సాధారణ పనిదినాలు తిరిగి ప్రారంభమవుతాయి.ఇదిలా ఉండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో కూడా ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ సందర్భంగా సెలవులను ముందుగానే ప్రకటించారు. మానవ వనరులు, వలస మంత్రిత్వ శాఖ ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సంబంధించిన సెలవుల వివరాలను వెల్లడించింది.ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మార్చి 19 నుంచి 21 వరకు మూడు రోజుల సెలవు ప్రకటించారు. అయితే రంజాన్ నెల 30 రోజులు పూర్తయితే, ఈ సెలవు మార్చి 22 వరకు పొడిగించే అవకాశం ఉంది. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మార్చి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయి. మార్చి 23 నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయి.ఈ ఏడాది ఈద్ సందర్భంగా యూఏఈ నివాసితులకు గరిష్టంగా నాలుగు రోజుల సెలవులు లభించే అవకాశముంది. అయితే ఈద్ పండుగ తేదీ నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై అధికారిక ప్రకటనను ఆయా దేశాల షవ్వాల్ అబ్జర్వేటరీ కమిటీలు జారీ చేయనున్నాయి. -
ఒమన్, కువైట్, ఖతార్ పాలకులకు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైట్ యువరాజు షేక్ సబా అల్–ఖలీద్ అల్–హమద్ అల్–ముబారక్ అల్–సబా, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిపై వారితో చర్చించారు. మూడు దేశాలపై దాడులతోపాటు సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల ఉల్లంఘన జరుగుతుండడాన్ని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై చర్చించారు. భారతీయులకు తగిన రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాని మోదీ గత రెండు దేశాల్లో పశ్చిమాసియాలో ఎనిమిది దేశాల అధినేతలతో మాట్లాడారు. ప్రధానంగా భారతీయుల భద్రతని వారి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఒమన్, కువైట్, ఖతార్ దేశాల పెద్దలతో మాట్లాడినట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వివాదాలను దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టంచేశారు. భారతీయుల రక్షణ విషయంలో మద్దతు ఇస్తున్నందుకు మూడు దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. -
చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టిన పడవ
దుబాయ్: ఒమన్ సముద్ర తీరంలో ఘోరం జరిగింది. భారీ చమురు ట్యాంకర్‌ను పేలు డు పదార్థాలతో నింపిన మరో పడవ ఢీకొట్టడంతో ఒక భారతీయుడు మృతిచెందాడు. ఆ ట్యాంకర్‌లోని ఇతర సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మస్కట్ గవర్నరేట్‌లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్‌కు 52 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ఎంకేడీ వ్యోమ్ అనే పేరు గల ఈ చమురు ట్యాంకర్‌పై రిపబ్లిక్ ఆఫ్ ద మార్షల్ ఐలాండ్స్ జెండా ఉంది. ఘటన జరిగిన సమయంలో ట్యాంకర్లో 59,463 మెట్రిక్ టన్నుల చమురు ఉన్నట్లు తెలిసింది. మనుషులెవరూ లేని భారీ పడవ ఢీకొట్టడంతో చమురు ట్యాంకర్ ఇంజన్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే విధుల్లో ఉన్న భారతీయుడు మృతిచెందాడు. అతడి వివరాలు తెలియరాలేదు. ట్యాంకర్లో ఇంకా 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 16 మంది భారతీయులు కాగా, నలుగురు బంగ్లాదేశీలు, ఒకరు ఉక్రెయిన్ పౌరుడు. వారందరినీ ఒమన్ అధికారులు రక్షించారు. -
మార్ష్ విధ్వంసం.. పసికూనను చిత్తు చేసిన ఆసీస్
టీ20 ప్రపంచకప్ 2026 చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా పసికూన ఒమన్‌పై ప్రతాపం చూపింది. తొలుత బౌలింగ్‌లో 104 పరుగులకే (16.2 ఓవర్లలో) ఒమన్‌ను ఆలౌట్ చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇదివరకే సూపర్-8కి చేరాయి. సూపర్-8 మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.ఒమన్ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్ జంపా (3.2-0-21-4), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్ బార్ట్లెట్ (4-0-27-2), నాథన్ ఇల్లిస్ (2-0-14-1), మార్కస్ స్టోయినిస్ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్ బౌలర్ల ధాటికి ఒమన్ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. కెప్టెన్ జతిందర్ సింగ్ (17), హమ్మద్ మీర్జా (16), కరణ్ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్(32), ఇంగ్లిస్ (12 నాటౌట్) సహకరించారు. హెడ్ వికెట్ షకీల్ అహ్మద్‌కు దక్కింది. -
అంతా అయిపోయాక లైన్లోకి వచ్చిన ఆసీస్.. పసికూనపై ప్రతాపం
టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు అంతా అయిపోయాక లైన్లోకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో ఇదివరకే నిష్క్రమించిన ఈ మాజీ ఛాంపియన్.. ఇవాళ (ఫిబ్రవరి 20) పసికూన ఒమన్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆసీస్.. ఒమన్‌ను 104 పరుగులకే (16.2 ఓవర్లలో) కుప్పకూల్చింది.ఒమన్ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్ జంపా (3.2-0-21-4), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్ బార్ట్లెట్ (4-0-27-2), నాథన్ ఇల్లిస్ (2-0-14-1), మార్కస్ స్టోయినిస్ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్ బౌలర్ల ధాటికి ఒమన్ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. కెప్టెన్ జతిందర్ సింగ్ (17), హమ్మద్ మీర్జా (16), కరణ్ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్ కెప్టెన్ జతిందర్ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తామని బీరాలు పలికి ఏమీ చేయలేకపోయాడు. ఈ టోర్నీ నుంచి ఆసీస్‌తో పాటు ఒమన్ కూడా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్ గ్రూప్ దశ మొత్తంలో చివరిది. ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇదివరకే సూపర్-8కి చేరాయి. -
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
-
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
-
ఒమన్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్.. సెమీస్ ఆశలు సజీవం
టీ20 ప్రపంచకప్-2026లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఒమన్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐరీష్ జట్టు తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.టాపార్డర్ విఫలమైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్లు లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా టక్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టక్కర్ కేవలం 51 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. డెలానీ 30 బంతుల్లో 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఒమన్ బౌలర్లలో షకీల్ అహ్మద్ మూడు, కలీం రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది.ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీం (50),హమ్మద్ మీర్జా (46) రాణించగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ చెరో రెండు వికెట్లు తీశారు. -
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఒమన్ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుసాల్ మెండిస్ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ దసున్ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్ మిషారా 8, కమిందు మెండిస్ 19 (నాటౌట్), వెల్లాలగే 6 (నాటౌట్) పరుగులు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్ రామనంది (4-0-41-2), సూఫ్యాన్ మెహమూద్ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్ ఖాన్ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మొహమ్మద్ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్ కలీమ్ 6, కెప్టెన్ జతిందర్ సింగ్ 1, హమ్మద్ మీర్జా 9, వినాయక్ శుక్లా 1, నదీం ఖాన్ 2, సూఫ్యాన్ మెహమూద్ 1, షా ఫైసల్ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్), జితేన్ రామనంది డకౌటయ్యారు.నదీం ప్రపంచ రికార్డుఒమన్ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్ ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.మరో ప్రపంచ రికార్డు కూడా సమంఈ మ్యాచ్‌లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్ 2024 ఎడిషన్‌లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. -
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) ధాటికి ఒమన్ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్ కలీమ్, కెప్టెన్ జతిందర్ సింగ్, షా ఫైసల్ తలో 5 పరుగులు, షకీల్ అహ్మద్ 4, జితెన్ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్ మీర్జా, కరన్ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్), బ్రెండన్ టేలర్ (31 రిటైర్డ్ హర్ట్) రాణించారు. మరుమని 21, సికందర్ రజా 5 (నాటౌట్) పరుగులు చేయగా.. డియాన్ మైర్స్ డకౌటయ్యాడు. ఒమన్ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్ ముజరబానీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్ ఆటగాడు ఆమిర్ కలీమ్ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్ మ్యాచ్ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్ నదీమ్ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ 42, ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, నెదర్లాండ్స్ ఆటగాడు వాన్‌డర్ మెర్వ్ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్నారు.కలీమ్ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్ కెరీర్ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కలీమ్.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి ఒమన్ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. -
ఎడారిలో ఎనిమిదేళ్ల చిన్నారి... 15 కిలోమీటర్లు నడక
మస్కట్‌లో ఓఎనిమిదేళ్ల బాలుడు మృత్యువును జయించాడు. ఉత్తర షర్కియాలోని బిడియా ప్రాంతంలోని ఎడారిలో బాలుడు తప్పిపోయాడు.15 కిలోమీటర్లు ఏకాకిగా తీవ్రమైన ఉష్ణోగ్రతలో నడిచిన చిన్నారి ఎట్టకేలకు అక్కడి అధికారులకు దొరికాడు. సాధారణంగా ఎండాకాలంలో ఇసుకలో నడిస్తేనే ఆ ఉష్ణోగ్రతను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే ఏడారి ప్రాంతంలో అయితే ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దప్పిక, తీవ్రమైన వేడిమి, ఎక్కడ ముగింపు ఉంటుందో తెలియదు. ఇక ఆ ఆలోచనే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఒమన్ దేశం మస్కట్‌లో చిక్కుకపోయిన ఓ ఎనిమిదేళ్ల చిన్నారి. ఎవరికి తెలియని దారిలో దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎండ, వేడిమిని భరిస్తూ దాహాన్ని తట్టుకుంటూ ఒంటరిగా పయణించాడు. ఎటువంటి ప్రమాదం లేకుండా ఎట్టకేలకు సురక్షితంగా బయిటపడ్డాడు.తమ పిల్లాడు ఎడారిలో తప్పిపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉత్తర షర్కియా భద్రత విభాగం వెంటనే అప్రమత్తమై తప్పిపోయిన బాలుడి కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టింది. సివిల్ డిఫెన్స్ అంబులెన్స్ అథారిటీ ప్రకారం దాదాపు ఎనిమిది ఎనిమిది గంటల పాటు శ్రమించిన తర్పాత ఎట్టకేలకు ఆ బాలుడి జాడను అధికారులు కనుగొన్నారు.అంత కఠినమైన ఏడారిలో నీరు లేకుండా, ఎండ వేడిమిని తట్టుకొని ఆ చిన్నారి దాదాపు 15 కిలోమీటర్ల నడిచినట్లు తెలిపారు. అయితే విహారయాత్రలకు వెళ్లినప్పడు గానీ క్యాంపు ఫైర్ చేసిన ప్రాంతాలకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు పేర్కొన్నారు. -
వ్యవస్థలు వైఫల్యం చెందిన వేళ..
గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది.నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు, నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందాడు. అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కార్మికులను అక్కడి చట్టాల ప్రకారం ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి)గా పరిగణించడంతో, వారికి లభించాల్సిన కొన్ని హక్కులు, సౌకర్యాలు రద్దవుతాయి. ఈ నేపథ్యంలో, “అబ్బులు, కంపెనీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి అతనితో మాకు సంబంధం లేదు” అంటూ మృతదేహం తరలింపు ఖర్చును భరించబోమని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) నుంచి సహాయం అందిస్తారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొంటూ, మృతదేహం తరలింపుకు రూ.1.50 లక్షలు చెల్లించాలని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు కుటుంబానికి ఫోన్ చేసి తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఓమాన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య తొగరి చిన్న సావిత్రి తన కుమారుడు సంజయ్, యామ్చా గ్రామ సర్పంచ్ బేగారి సాయిలుతో కలిసి మంగళవారం (13.01.2026) హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తన భర్త పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయాలని ఆమె వేడుకున్నారు. కాగా ఆమె ఇదివరకే డిసెంబర్ 29న మెయిల్ ద్వారా సీఎంఓ కు వినతిపత్రం పంపారు. దీనికి స్పందనగా జీఏడి ఎన్నారై విభాగం ఇండియన్ ఎంబసీకి వైర్ మెసేజ్ పంపింది.ఇదిలా ఉండగా, అబ్బులు చిన్నాపూర్ కు చెందిన ఒక గల్ఫ్ సబ్ ఎజెంట్ కు రూ.1.20 లక్షలు చెల్లించి ఓమాన్ కు వెళ్ళాడు. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మాత్రం అస్సాం రాజధాని గౌహతి లోని ఒక రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా జరిగింది. ప్రవాసీ భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాదం బీమా పాలసీ కూడా జారీ అయింది. వలస కార్మికుడు విదేశాల్లో మరణించినప్పుడు మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రవాసీ పాలసీ ద్వారా పొందే అవకాశాన్ని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ ఎందుకు వినియోగించలేదన్నది పెద్ద ప్రశ్న. చట్ట ప్రకారం శవాన్ని తరలించే బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ తీసుకోవాలి. సమస్య 'మదద్' పోర్టల్ లో నమోదు అయిన తర్వాత కూడా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సరిగా పట్టించుకోలేదని స్పష్టం అవుతున్నది.తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యుడు నంగి దేవేందర్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ మహమ్మద్ బషీర్ అహ్మద్ ఈ అంశాన్ని సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన డా. చిన్నారెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రిని ఆదేశించారు.చలించిన ఐఏఎస్ అధికారిణిఇదే అంశాన్ని సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్‌కు వివరించగా, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. ఓమాన్‌కు వెళ్లిన మూడు నెలలకే అబ్బులు మృతి చెందడం, నెలరోజులుగా ఆసుపత్రి శవాగారంలో మృతదేహం ఉండిపోవడం, భర్త పార్థివదేహం కోసం గ్రామం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మొరపెట్టుకున్న భార్య పరిస్థితి ఆమెను చలింపజేసింది.ఫలితంగా, ఓమాన్ నుంచి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన రూ.1.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చెక్కుగా జారీ చేసి మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేశారు. ఓమాన్లో ఇండియన్ ఎంబసీ గుర్తింపు పొందిన ఇండియన్ సోషల్ క్లబ్ – తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్ ఈ వ్యవహారంలో సమన్వయం చేస్తూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఈ మానవీయ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ బెగారి సాయిలు, మంద భీంరెడ్డి తదితరులు ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, నాగేపూర్ మహిపాల్ రెడ్డికి వారు కృతఙ్ఞతలు తెలిపారు. -
చరిత్ర సృష్టించిన ‘కౌండిన్య’
మస్కట్: భారత పురాతన నౌకానిర్మాణ కౌశలంతో ఇంజిన్, ఇనుము లేకుండా కేవలం చెక్క, కొబ్బరి తాళ్లు, జిగురుతో నిర్మితమైన అపురూప, అద్భుత నౌక ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ తన సత్తా చాటింది. కేవలం గాలివాటానికి అనుగుణంగా పయనించే నౌకను 17 మంది నిష్ణాతులైన సిబ్బంది విజయవంతంగా గమ్యానికి చేర్చారు. కేవలం 17 రోజుల వ్యవధిలోనే పోరుబందర్ నుంచి సముద్రయానం మొదలెట్టి ఒమన్‌లోని మస్కట్ సముద్రతీర నగరానికి చేరుకుని భారతీయ నావికానిర్మాణ పటిమను ప్రపంచానికి చాటిచెప్పింది. భారత్, ఒమన్‌ల మధ్య ప్రాచీన సముద్రయాన రాకపోకలను ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చిందని మస్కట్‌లో భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదో శతాబ్దంనాటి విఖ్యాత అజంతా గుహల్లోని కుడ్య చిత్రం నుంచి ప్రేరణ పొందిన నిపుణులు, కళాకారుల బృందం 65 అడుగుల పొడవుతో నిర్మించిన ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసిల్(ఐఎన్ఎస్వీ) కౌండిన్య బుధవారం విజయవంతంగా మస్కట్‌లోని పోర్ట్ సుల్తాన్ ఖాబూస్‌కు చేరుకోవడంతో అందులోని నావికులు సంబరాలు చేసుకున్నారు.నౌకకు ఘన స్వాగతం పలికిన మంత్రి, అధికారులుమస్కట్ నౌకాశ్రయానికి చేరుకున్న ఐఎన్ఎస్వీ కౌండిన్యకు భారత పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ఘన స్వాగతం పలికారు. మస్కట్‌లో భారతీయ రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు, ఒమన్ పర్యాటక, వారసత్వ మంత్రిత్వ శాఖ, ఒమన్ రాయల్ నేవీ అధికారులు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శర్బానంద మాట్లాడారు. ‘‘ఈ నౌక ప్రయాణం భారతీయ సముద్రయాన ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తుచేసింది. ఇంజిన్‌లేని నౌకను ధైర్యసాహసాలతో లక్ష్యం దిశగా నడిపించిన నావికాబృందాన్ని చూసి దేశం గర్విస్తోంది. భారత్, ఒమన్‌ల ప్రాచీన సముద్రయాన బంధాన్ని ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చింది. కమాండర్ ∙హేమంత్ కుమార్, కమాండర్ వికాస్ షేవ్రాన్‌ల సారథ్యంలో మొత్తంగా నలుగురు అధికారులు, 13 మంది నావికుల బృందంతో ఈ నౌక గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన విషయం తెల్సిందే. 650 నాటికల్ మైళ్ల దూరాన్ని ఎలాంటి అవరోధాల్లేకుండా విజయవంతంగా పూర్తిచేశామని నావికాబృందం ఆనందం వ్యక్తంచేసింది. ప్రయాణం విజయవంతమవడంపై కమాండర్ హేమంత్ మాట్లాడారు. ‘‘యుద్ధవిమాన వాహకనౌక మొదలు జలాంతర్గాముల దాకా ఎన్నింటినో భారత్ తయారుచేసింది. కానీ ఇలాంటి విలక్షణ నౌకను గతంలో తయారుచేయలేదు. అజంతా గుహలో రాతిపై వేసిన పురాతన పెయింటింగ్‌లో అస్పష్ట వివరాలు మినహా నౌక తయారీకి మన దగ్గర ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. కనీసం బ్లూప్రింట్ లేదు. అయినాసరే దీన్నో సవాల్‌గా తీసుకుని నిపుణులు తయారుచేశారు. నౌక తయారీలో ఇనుము, మేకులు, ఇంజిన్లను ఉపయోగించలేదు. కొబ్బరి నార తాళ్లను తెరచాపలను కట్టేందుకు ఉపయోగించారు. ఉప్పుమయ సముద్రనీటిలో నౌక అడుగుభాగం పాడవకుండా ఉండేందుకు సహజ జిగురును పూతగా ఉపయోగించారు. కేరళ కళాకారులు నౌక విడిభాగాలను ప్రాచీన విధానంలో అతికించారు’’ అని ఆయన వెల్లడించారు. #WATCH | INSV Kaundinya given water salute as it completes its voyage from Gujarat's Porbandar to Oman's MuscatINSV Kaundinya is a recreation of a 5th century Indian ship using the ancient stitching technique. The ship departed from Gujarat's Porbandar on 29th December 2025 pic.twitter.com/xc3NtGdg6U— ANI (@ANI) January 14, 2026 -
ఒమన్‌లో కార్మికుల జీతాల పెంపు..!?
అరబ్ దేశమైన ఒమన్ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేతన విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్లు కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ జాయెద్ అల్ బైవిన్ తెలిపారు. త్వరలోనే కార్మికులకు వేతనాలు పెంచే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కార్మిక మార్కెట్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వాటాదారులతో సంప్రదించి మంత్రిత్వ శాఖ సిఫార్సులను రూపొందించిందని... మెరుగైన జీవన ప్రమాణాలు సాధించే విధంగా కనీస వేతనాన్ని పెంచే విషయంపై మంత్రిత్వ శాఖ పరిశీలించిందని తెలిపారు.కనీస వేతన పెంపు విధానంపై మంత్రిత్వ శాఖ అధ్యయనం పూర్తయిందని.. సిఫార్సులను సంబంధిత అధికారులకు సమర్పించినట్లు అల్ బైవిన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియకు ఆమోదం లభించనుందని పేర్కొన్నారు. షురా కౌన్సిల్ ఐదు ప్రధాన రంగాలపై దృష్టి సారించి చర్చలు జరిపిందని వెల్లడించారు. కార్మిక మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి.. ఉద్యోగాలను సృష్టించడానికి, డిమాండ్‌కు అనుగుణంగా కార్మికులను అందించడానికి రూపొందించిన కార్యక్రమాలను కౌన్సిల్ సమావేశంలో మంత్రి మహద్ అల్ బైవిన్ ప్రదర్శించారు.విదేశీయులను నియమించడం లాంటి విస్తృతమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రయత్నాలు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, బహుళ రంగాలలో జాతీయ శ్రామిక శక్తిని స్థిరీకరించడంలో సహాయపడ్డాయని అన్నారు. ఎప్పటికప్పుడు మంత్రిత్వ శాఖ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తుందని అన్నారు. ఈ రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలతో కలిసి జాతీయ కార్మిక డేటాబేస్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు. ప్రైవేట్ రంగ ఉద్యోగ నియామక కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని 50 మిలియన్ రియాల్స్ నుంచి 100 మిలియన్ రియాల్స్‌కు పెంచిందని తెలిపారు.సబ్సిడీ రెండేళ్లపాటు నెలకు 200 రియాల్స్‌తో ప్రారంభమవుతుందని.. మిగిలిన వేతనాలను యజమానులు భరిస్తారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ మద్దతు లభించేంత వరకు ఉద్యోగ ఒప్పందం ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. 2021 నుంచి గత సంవత్సరం అక్టోబర్ వరకు 200,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయని మంత్రి వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ రంగంలో 68,033 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 81,114 ఉద్యోగాలు, రెండు రంగాలలో 50,925 శిక్షణ సంబంధిత ఉద్యోగాలు ఉన్నాయన్నారు. -
ఒమన్ పౌరసత్వం దరఖాస్తులు.. నిబంధనల్లో భారీ మార్పులు..!
అరబ్ దేశమైన ఒమన్ తమ దేశ పౌరసత్వ చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒమన్ పౌరసత్వంతో సహా జాతీయత చట్టంపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యనిర్వాహక నిబంధనలను ప్రకటించింది. అక్కడి స్థానిక మంత్రివర్గ నిర్ణయించాక అధికారిక గెజిట్ విడుదల చేసింది. ప్రవాస కుటుంబాలకు పౌరసత్వం నిబంధనల్లో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. కాగా.. అరబ్ దేశాల్లో కఠిన నిబంధనలు ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే.పౌరసత్వం దరఖాస్తు నిబంధనలు..జాతీయతకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత వ్యక్తి లేదా వారి సంరక్షకుడు మంత్రిత్వ శాఖ తయారుచేసిన ఫారమ్‌లను అంతర్గత వ్యవహారాల శాఖకు సమర్పించాలి. దరఖాస్తుదారు విదేశాలలో నివసిస్తుంటే ఒమన్ జాతీయతను గుర్తింపు కోసం దరఖాస్తులను ఒమన్ రాయబార కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తుదారులు నోటిఫికేషన్ తేదీ నుంచి 90 రోజుల్లోపు అవసరమైన విధానాలను పూర్తి చేయాలి. అయితే, మంత్రిత్వ శాఖ వ్రాతపూర్వక అభ్యర్థనపై దీనిని పొడిగించవచ్చు. ఇది పాటించడంలో విఫలమైతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఒమన్‌లో చట్టపరమైన నివాసం, పాస్‌పోర్ట్ డేటా, మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఏదైనా ఇతర మార్గాల ద్వారా నిరూపించాలి.అంతేకాకుండా దరఖాస్తుదారులు నేర చరిత్ర లేని ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అరబిక్ భాషలో ప్రావీణ్యం, అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్వహించే వ్రాత పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో ఒకసారి విఫలమైతే..మళ్లీ ఆరు నెలల తర్వాత పరీక్షను తిరిగి రాయవచ్చు.. కానీ నాలుగు సార్లకు మించి రాయడానికి వీల్లేదు. ఒమన్ పౌరసత్వం పొందిన ప్రతి వ్యక్తి తాను సుల్తానేట్ పట్ల విధేయుడిగా ఉంటానని..దాని ప్రాథమిక చట్టాలు, ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తానని, మంచి పౌరుడిగా ఉంటానని ప్రాథమిక కోర్టులో ప్రమాణం చేయాలి. ఒమన్ పౌరసత్వం పొందిన ప్రతి వ్యక్తి వారి మైనర్ పిల్లలకు ఒమన్ పాస్‌పోర్ట్‌లు పొందడం కోసం ఆరు నెలల్లోపు మంత్రిత్వ శాఖను సందర్శించాలి.ఒమన్‌కు తిరిగి రావాల్సిందే..ఒమన్ పౌరసత్వం పొందిన వ్యక్తి వరుసగా 24 నెలలకు పైగా ఒమన్ వెలుపల నివసించకూడదు. ఎక్కువ కాలం ఉండాలనుకునే వారు కాల వ్యవధి ముగియడానికి మూడు నెలల ముందే విదేశాల్లో ఉండడానికి గల కారణాలు, వివరాలతో సహా దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తులను సమర్పించిన 60 రోజులలోపు మంత్రిత్వ శాఖ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ వ్యవధిలోపు ఎటువంటి ప్రతిస్పందన రాకపోతే.. మీ అభ్యర్థన తిరస్కరించినట్లే. దరఖాస్తుదారు అనుమతించిన వ్యవధి ముగిసేలోపు ఒమన్‌కు తిరిగి రావాలి. పౌరసత్వం కోల్పోయిన వారు ఎవరైనా తమ పాస్‌పోర్ట్, ఐడీ కార్డు విదేశాలలో ఉన్న రాయబార కార్యాలయాలకు 90 రోజుల్లోపు తిరిగి ఇవ్వాలి. లేకుంటే, సంబంధిత అధికారులు, మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది. పౌరసత్వం కోల్పోవడం, రద్దు చేయడం, ఉపసంహరణ కేసులను పరిశీలించడానికి మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో చర్యలు చేపడుతుంది.పౌరసత్వ దరఖాస్తు రుసుములు..ఒమానీ పౌరసత్వం కోసం దరఖాస్తు: 600 రియాల్స్ఒమానీ మహిళ, విదేశీ భార్య, వితంతువు, విడాకులు తీసుకున్న వ్యక్తి లేదా బిడ్డ కోసం దరఖాస్తు: 300 రియాల్స్పౌరసత్వం పునరుద్ధరణ లేదా వదులుకోవడం కోసం దరఖాస్తు: 200 రియాల్స్సాధారణ షరతులు..సమర్పించిన అన్ని పత్రాలు అరబిక్‌లో ఉండాలి.ఒమానీ పౌరసత్వం లేదా పునరుద్ధరణ కోసం దరఖాస్తుదారులు అవసరమైన పరీక్షల కోసం (అరబిక్ లేదా ఇతర భాషలు) సంబంధిత విభాగం ముందు హాజరు కావాలి.ఒమానీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి మరో దేశ పౌరసత్వం మంజూరు అయినట్లు నిర్ధారించే పత్రాలతో పాటు శాఖకు సమర్పించి నిర్దేశించిన రుసుము చెల్లించాలి.పౌరసత్వాన్ని వదులుకున్నా, రద్దయినా వారు ఎవరైనా తమ పౌరసత్వాన్ని పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సుల్తానేట్‌లో కనీసం రెండు సంవత్సరాల శాశ్వత నివాసం, ఇతర దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు రుజువులు సమర్పించాలి.ఒమానీ వ్యక్తిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వం..ఒమానీ వ్యక్తి భార్య అయిన విదేశీ మహిళ ఈ క్రింది షరతుల కింద ఒమానీ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు1. వివాహం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతితో జరిగి ఉండాలి (చట్టం ప్రకారం అవసరమైతే).2. ఆమె వివాహం చేసుకుని తన భర్తతో సుల్తానేట్‌లో కనీసం 10 సంవత్సరాలు ఉండాలి.3. ఆమెకు ఒమానీ భర్త ద్వారా సంతానం కలిగి ఉండాలి.4. ఆమె ఎలాంటి అనైతిక నేరాలకు పాల్పడి ఉండకూడదు.5. ఒమానీ మహిళను వివాహం చేసుకున్న విదేశీయుడు పౌరసత్వం పొందాలంటే, వివాహాన్ని మంత్రిత్వ శాఖ ఆమోదించాలి. -
గాయని చిత్ర అయ్యర్ సోదరి దుర్మరణం, ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మలయాళ నేపథ్య గాయని చిత్ర అయ్యర్ సోదరి 52 ఏళ్ల శారదా అయ్యర్ ఒమన్‌లో దుర్మరణం పాలయ్యారు. ఒమన్‌లో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి కచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం, కేరళలోని తాజవాకు చెందిన శారదా అయ్యర్ ఒమన్ ఎయిర్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. ప్రస్తుతం మస్కట్‌లో నివసిస్తున్నారు. ఒమన్‌లోని అల్ దఖిలియా గవర్నరేట్‌లోని జెబెల్ షామ్స్ ప్రాంతంలోని కఠినమైన వాడి ఘుల్ గుర్తింపు పొందిన మార్గాలలో ట్రెక్కింగ్ చేస్తున్న బృందంలోటీంలో ఆమె కూడా ఒకరని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అయ్యర్ మృతదేహాన్ని ఒమన్ నుండి కేరళకు తీసుకువస్తున్నారు. జనవరి 7న తాజవాలోని వారి పూర్వీకుల ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.దివంగత వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్.డి. అయ్యర్, రోహిణికుమార్తె శారదా అయ్యర్. డిసెంబర్ 11న తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 24న తిరిగి ఒమన్‌కు వచ్చినట్లు సమాచారం. తన సోదరి మరణంపై చిత్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందమైన నా సోదరీ, నువ్వు వెళ్లిపోయావు.. ఫోన్లో నాన్‌స్టాప్‌గా మాట్లాడే నీగొంతు వినకుండా, పక్కగదిలో నిరంతరం వినిపించే నీ అరుపులు లేకుండా నేను ఎలా జీవించాలి.. తొందరగా వెళ్లిపోయావు.. నేను కూడా నీతో పాటే’’ చాలా ఆవేదనతో కూడిన ఆమె ఇన్‌స్టా పోస్ట్ పలువురి కంట కన్నీరు పెట్టిస్తోంది. చాలా తక్కువ వ్యవధిలోనే అటు తండ్రిని, ఇటు సోదరిని కోల్పోయిన చిత్రకు అభిమానులు, సన్నిహితులు సానుభూతి ప్రకటించారు. సాధారణంగా శారదా అయ్యర్ అండ్ టీం ట్రెక్కింగ్‌కు వెళ్లిన ప్రదేశంలోని నిటారుగా ఉండే కొండలు , సవాలుతో కూడినభూభాగం ట్రెక్కింగ్ చేసేవారికి ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. View this post on Instagram A post shared by Chitra Iyer (@chitraiyerofficial) -
కొత్త ఏడాదిలో అవన్నీ సాగవు : గుర్తిస్తే కఠిన చర్యలు
మస్కట్: వర్క్ పర్మిట్లు, వృత్తిపరమైన లైసెన్స్, సర్టిఫికెట్లపై ఒమన్ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వర్క్ పర్మిట్లు, జాబ్ లైసెన్స్ పత్రాలను సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి నకిలీని సర్టిఫికెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో నిబంధనలను కఠినతరం చేసింది. ఫేక్ సర్టిఫికెట్లు, కాపీలు లాంటి చర్యలు చట్టాలు, నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒమన్‌లో పని అనుమతులు (వీసాలు) పునరుద్ధరించడానికి, కొత్త ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి, సంబంధిత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికెట్లు, వృత్తిపరమైన అభ్యాస లైసెన్స్‌లను సమర్థ అధికారుల (సెక్టోరల్ స్కిల్స్ యూనిట్లు) నుండి పొందాలని స్పష్టం చేసింది.అదే సమయంలో, అన్ని ఉద్యోగులు, కంపెనీలు ఈ పత్రాలు జారీ చేసే క్రమంలో వాటి ప్రామాణికతను ధృవీకరించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. ఏదైనా అనధికార పత్రాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రొఫెషనల్ వర్గీకరణ సర్టిఫికేట్ , వృత్తిని అభ్యసించడానికి లైసెన్స్ ముఖ్యమైనవి. ఉద్దేశించిన వృత్తికి సంబంధిత వ్యక్తి సుముఖత , అర్హతను ధృవీకరించడం, వృత్తిపరమైన సామర్థ్యం , పనితీరు ప్రమాణాలను నిర్ధారించడం, కార్మిక మార్కెట్‌ను నియంత్రించడం వృత్తిపరమైన ప్రమాణాలను నిర్ధారించడమే దీని లక్ష్యంమని పేర్కొంది. నకిలీ లేదా తప్పుడు పత్రాన్ని సృష్టించడం నేరస్థుడిపై చట్టపరమైన చర్యలకు దారితీసుకుంటామని హెచ్చరించింది. చట్టాలని లోబడి జరిమానా, ఇతర చర్యలుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఒమన్ కీలక నిర్ణయం.. నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలే
ఒమన్‌లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి వర్క్ సర్టిఫికెట్స్, లైసెన్స్, తదితర పత్రాలు సరైనవి లేకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్కడి కార్మిక శాఖ ప్రకటన విడుదల చేసింది.ఒమన్‌లో వీసా పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగులలో ప్రవేశానికి సంబంధింత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికేట్లు, లైసెన్స్‌లు అందుకు సంబంధించిన శాఖలకు చెందిన అధికారులనుంచి పొందవలసి ఉంటుంది. అయితే అలా పొందాల్సిన సమయంలో సంబంధిత అధికారులు అన్ని రకాలుగా సరైన సమాచారం ధృవీకరించుకున్నాకే ఆ పత్రాలు జారీ చేయాలని తెలిపింది. ఒకవేళ నకిలీ పత్రాలు జారీదేస్తే ఉద్యోగులతో పాటు సంబంధింత కంపెనీలు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కాగా ఒమన్‌లో ఉన్న మెుత్తం విదేశీ కార్మికుల సంఖ్య దాదాపు 18 లక్షలు కాగా భారత్ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా అక్కడ పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా ఒమన్‌లో పని చేస్తున్న భారతీయుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి. -
ఒమన్ వరల్డ్‌కప్ జట్టు కెప్టెన్‌గా భారత సంతతి ఆటగాడు
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల ఒమన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ కూడా భారత సంతతి ఆటగాడే (వినాయక్ శుక్లా) కావడం మరో విశేషం. ఈ జట్టులో వీరే కాక మరో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కరణ్ సోనావాలే, జయ్ ఒడేడ్రా, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రామనంది భారత్‌లో జన్మించిన వారే.ఈ జట్టుకు డిప్యూటీ కోచ్ కూడా భారతీయుడే. ముంబై మాజీ హెడ్ కోచ్‌గా పని చేసిన సులక్షన్ కులకర్ణి ప్రపంచకప్‌లో ఒమన్ డిప్యూటీ కోచ్‌గా వ్యవహరిస్తాడు. మొత్తంగా చూస్తే ప్రపంచకప్ బరిలోకి దిగబోయే ఒమన్ బృందం భారతీయులతో నిండుకొని ఉంది.2026 టీ20 వరల్డ్‌కప్ కోసం ఒమన్ జట్టు..జతిందర్ సింగ్ (c), వినాయక్ శుక్లా (vc), మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఓడేడ్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రమనంది, హస్నైన్ అలీ షా కాగా, ఒమన్ జట్టు ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జరిగిన 2024 వరల్డ్‌కప్‌కు కూడా ఒమన్ క్వాలిఫై అయ్యింది. ఈసారి ప్రపంచకప్‌లో ఒమన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఒమన్ ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్‌లో ఆడనుంది. కొలొంబో వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
ఐఎన్ఎస్వీ కౌండిన్య చరిత్రాత్మక యాత్ర షురూ
పోరుబందర్: ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్యచిత్రంలోని అసంపూర్ణ అంశాలను గుదిగుచ్చి, ఎలాంటి యంత్రాలు, మేకులు, స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవనిర్మిత అద్భుతం ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ నౌక తొలి సముద్రయానాన్ని విజయవంతంగా ఆరంభించింది. సోమవారం గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీరనగరానికి పయనమైంది. వెస్టర్న్ నావల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జెండా ఊపి నౌకాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. ప్రాచీన భారతీయ నావికానిర్మాణ కౌశలాన్ని కళ్లకు కట్టేలా ‘కుట్టుడు పద్ధతి’లో నౌక నిర్మించామని భారత రక్షణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 15 రోజులపాటు 1,400 కిలోమీటర్ల సముద్రయానం చేశాక ఒమన్ తీరానికి నౌక చేరుకోనుంది. పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక అంటూ ప్రధాని ప్రశంస నౌక ప్రయాణంపై ప్రధాని మోదీ అమితానందం వ్యక్తంచేశారు. ‘‘ పోరుబందర్ నుంచి మస్కట్‌ను మన ప్రాచీనమూలాలున్న ఐఎన్ఎస్ కౌండిన్య బయల్దేరడం ఎంతో సంతోషదాయకం. నౌకలోని 18 మంది నావికుల ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నా. గల్ఫ్, ఆవలి ప్రాంతాలతోనూ భారత్ ప్రాచీనకాలంలో అద్బుతంగా సముద్రమార్గంలో వాణిజ్యం జరిపేదని ఈ నౌక ద్వారా చాటిచెప్పండి. మేకులకు బదులు తాళ్లతో విడిభాగాలను జతచేసే స్టిచ్చింగ్ పద్దతిలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నౌక భారత ఉజ్జ్వలమైన సముద్రసంప్రదాయాలను స్మరణకు తెచ్చింది. నౌకను నిర్మించిన కళాకారులు, సిబ్బందికి నా అభినందనలు. ఈ నౌక పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధంగా.. సమున్నతంగా.. → నౌక తయారీలో మేకులు ఉపయోగించలేదు. → స్టిచ్చింగ్ పద్ధతిలో విడిభాగాలను అత్యంత ధృడమైన తాళ్లతో ముడివేశారు. → కొబ్బరినారతో తయారుచేసిన తాళ్లను ఉపయోగించారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు. కేవలం తెరచాపలతో గాలివాటానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. → సహజసిద్ద జిగురులతో విడిభాగాలను అతికించారు. చేప నూనెను పూత పూశారు. → ఐదో శతాబ్దంనాటి అజంతా గుహల్లో వెలుగుచూసిన ప్రాచీన నౌక చిత్రాల నుంచి డిజైన్‌ను సంగ్రహించారు. → ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది. నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, తెడ్డులను ప్రాచీన తరహా డిజైన్‌లో రూపొందించారు. → పురాతన నౌకా నిర్మాణాలు, నౌకా నిర్మాణశాస్త్రం, సాంప్రదాయ విధానాలను మేళవించి నౌకకు తుదిరూపునిచ్చారు. → కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నౌకాస్థావరంలో దీనిని తయారుచేశారు. దీని పొడవు 65 అడుగులు. → ఒకటో శతాబ్దంలో హిందూమహాసముద్రంలో సముద్రయానం చేసిన భారత నావికుడు కౌండిన్య పేరుతో ఈ నౌకకు ‘ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్ఎస్వీ) కౌండిన్య అని నామకరణం చేశారు. → ఒక తెరచాపపై కదంబ పాలకుల రాజలాంఛనమైన గండభేరుండ పక్షి చిత్రం, మరో తెరచాపపై సూర్యుని ఆకృతిని చిత్రించారు. -
ఒమన్ పర్యటనలో ప్రధాని మోదీ ‘చెవి రింగు’ స్టోరీ ఏంటో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ పర్యటన సందర్బంగా కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఒమన్‌లో ప్రధాని మోదీకి అక్కడి అత్యున్నత పౌర గౌరవం గార్డ్ ఆఫ్ హానర్ లభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ప్రధాని ఎడమ చెవికి ఒక చిన్న, రత్నం లాంటి పరికరం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది ఇయర్ రింగ్ అని కొందరు, ట్రాన్సలేటర్ కొందరు ఇలా ఆన్లైన్లో పలు ఊహాగానాలకు దారితీశాయి. అసలు ఇదేంటి? తెలుసుకుందాం.ప్రధాని మోదీ తన ఇటీవలి పర్యటనల్లో బాగంగా జోర్డాన్, ఇథియోపియా తర్వాత ఒమన్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు ఒమన్ రక్షణ వ్యవహారాల మంత్రి డిప్యూటీ పీఎం సయ్యద్ సాహిబ్ బిన్ తారిక్ అల్ సయీద్ ఘనస్వాగతం పలికారు. రిసెప్షన్ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే ప్రధాని కొత్త స్టైల్ అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి అయితే, నిశితంగా పరిశీలిస్తే ఆ వస్తువు చెవిపోగు కాదని, రియల్ టైం ట్రాన్సలేషన్కు ఉపయోగించే పరికరమని తేలింది. అధికారులు వివిధ భాషలలో సంభాషించేటప్పుడు కమ్యూనికేషన్‌కు సహాయం చేయడానికి అంతర్జాతీయ, దౌత్య కార్యక్రమాలు, చర్చల సందర్భంలో ఇలాంటి డివైస్‌లను ఉపయోగిస్తారు. అరబిక్ ఒమన్ అధికారిక భాష. స్థానికులతో సంభాషించేటపుడు ఎప్పటికప్పుడు, మనకు తెలిసిన భాషలో అది తర్జుమా చేసి వినిపిస్తుంది. ఇటీవల భారత్ పర్యటన్ సందర్బంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాంటి ట్రాన్స్ లేటర్లు వినియోగించడం గమనార్హం.Prime Minister @narendramodi arrived in Muscat, Oman, a short while ago. He was warmly received by the Deputy Prime Minister for Defence Affairs His Highness Sayyid Shihab bin Tarik Al Said at the airport. pic.twitter.com/TUj7szjzgN— PMO India (@PMOIndia) December 17, 2025> కాగా అధికారిక కార్యక్రమాలు,మోదీ పర్యటనల సమయంలో అక్కడి వారితో మమేకమవుతూ, తన వస్త్రధారణ, తనదైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించడం ప్రధానికి అలవాటు. అలా మోదీ ధరించిన టైలర్డ్ జాకెట్లు , విలక్షణమైన రంగుల పాలెట్లు చర్చల్లో నిలిచాయి. గతంలో ఆయన పేరుతో ఎంబ్రాయిడరీ చేయబడిన బంధ్‌గలా సూట్ కూడా ఇందులో ఒకటి. -
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
మస్కట్: భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు గురువారం సంతకాలు చేశాయి. ఫలితంగా 98 శాతానికిపైగా భారతీయ ఉత్పత్తులపై ఒమన్‌లో సుంకాలు సున్నాకు చేరుకోనున్నాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే భారతీయ వ్రస్తాలు, వ్యవసాయ, తోలు సహా పలు ఉత్పత్తులను ఒమన్‌లో విక్రయించుకోవచ్చు. అదేసమయంలో ఒమన్ నుంచి దిగుమతి అయ్యే ఖర్జూరం, మార్బుల్స్, పెట్రో కెమికల్స్ సహా పలు ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గించనుంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం సుంకాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం సానుకూల పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎఫ్‌టీఏపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి ఖాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసుఫ్ సంతకాలు చేశారు. దీన్ని అధికారికంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)గా పిలుస్తున్నారు. ఒప్పందంలో ముఖ్యాంశాలు → భారతదేశం ఒమన్‌కు చేసే ఎగుమతుల్లో 99.38 శాతం ఉత్పత్తులపై జీరో–డ్యూటీ అమల్లోకి రానుంది. → భారతీయ సంప్రదాయ ఔషధాలపైనా ఒమన్ సున్నా సుంకాలు విధించబోతోంది. దీనివల్ల ఇండియాలోని ఆయుష్, వెల్నెస్ రంగాలకు లబ్ధి చేకూరనుంది. → భారత్ నుంచి ఎగుమతి అయ్యే బంగారు ఆభరణాలు, తోలు, పాదరక్షలు, క్రీడా పరికరాలు, సామగ్రి, ప్లాస్టిక్, ఫరి్నచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా, వైద్య పరికరాలు, ఆటోమొబైల్ పరికరాలపై ఎలాంటి పన్ను ఉండదు. → కంప్యూటర్ సంబంధిత సేవలు, వ్యాపార, వృత్తి సేవలు, ఆడియో–విజువల్, పరిశోధన–అభివృద్ధి, విద్య, ఆరోగ్య సేవలపైనా ఒమన్ ప్రభుత్వం సుంకాలు తగ్గించబోతోంది. ఒమన్ 12.52 బిలియన్ డాలర్ల విలువైన సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఇండియా వాటా కేవలం 5.31 శాతంగా ఉంది. ఎఫ్టీఏతో ఈ వాటా మరింత పెరగనుంది. → భారతీయ వృత్తి నిపుణులకు ఉద్యోగాలు కల్పిచేందుకు ఒమన్ ముందుకొచ్చింది. అకౌంటెన్సీ, టాక్సేషన్, ఆర్కిటెక్చర్, మెడికల్ సంబంధిత రంగాల్లో భారతీయులకు సులువుగా ఉద్యోగాలు లభిస్తాయి. → అంతేకాకుండా భారతీయ కంపెనీల నుంచి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ)కు ఒమన్ అనుమతి ఇవ్వనుంది. → ఒమన్ నుంచి దిగుమతి అయ్యే వాటిలో 94.81 శాతం ఉత్పత్తులపై భారత ప్రభుత్వం సుంకాలు రద్దు చేయనుంది. → భారతీయ పరిశ్రమలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం లేదు. ఒమన్ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బర్, పొగాకు, బంగారం, వెండి ఆభరణాలు, పాదరక్షలు, క్రీడాసామగ్రి, కొన్ని రకాల లోహాలపై ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. వీటిని ఒప్పందంలో చేర్చలేదు. కీలక మిత్రదేశం ఒమన్ → 2006 తర్వాత ఒమన్ ప్రభుత్వం మరో దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. అలాగే గత ఆరు నెలల్లో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో ఇది రెండోది. ఆరు నెలల క్రితం యూకేతో కలిసి ఎఫ్‌టీఏపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. → ఇండియా, ఒమన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2024–25లో 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. → గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి ఒమన్. అంతేకాకుండా భారతదేశ సరుకులు, సేవలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలకు చేరడానికి ఒమన్ ఒక ముఖద్వారంగా ఉపయోగపడుతోంది. → ఒమన్‌లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 300 ఏళ్ల క్రితమే స్థిరపడిన భారతీయ వ్యాపార కుటుంబాలు కూడా ఉన్నాయి. → ఒమన్‌లో 6 వేలకుపైగా భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. → ఒమన్‌లోని భారతీయులు ప్రతిఏటా 2 బిలియన్ డాలర్లను భారత్‌కు పంపిస్తున్నారు. → 2000 ఏప్రిల్ నుంచి 2025 సెపె్టంబర్ మధ్య ఒమన్ నుంచి భారత్‌కు 615.54 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. -
ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం
మస్కట్: భారత్ -ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ గౌరవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.సుల్తాన్ హైతమ్ స్వయంగా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించారు. భారత్-ఒమాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన దూరదృష్టి, నాయకత్వం, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.భారత్–ఒమాన్ మధ్య 1950లలో ప్రారంభమైన దౌత్య సంబంధాలు ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సముద్ర భద్రత, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ గౌరవం ప్రతీకాత్మకంగా నిలిచింది.ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్భారత్-ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్నాయి. మస్కట్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) పై కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఇంధన, సముద్ర భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.12 బిలియన్ డాలర్ల వాణిజ్యం భారత్–ఒమన్ మధ్య ప్రస్తుతం సుమారు 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఎఫ్‌టీఏ అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఔషధాలు,వ్యవసాయ ఉత్పత్తులు,ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోకెమికల్స్ వంటి రంగాలకు భారీగా లాభం చేకూరనుంది. ఒమాన్, భారత సముద్ర భద్రతా వ్యూహంలో కీలక భాగస్వామి. అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్త విన్యాసాలు, నౌకాదళ సహకారం మరింత పెరగనున్నాయి.ఒమన్‌లో సుమారు 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కూడా ఇరుపక్షాలు చర్చించాయి. వీసా సౌకర్యాలు, కార్మిక ఒప్పందాల సరళీకరణపై ఒమన్ సానుకూలంగా స్పందించినట్లు వర్గాలు తెలిపాయి.అంతకుముందు మస్కట్‌లో ప్రధాని మోదీకి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్‌తో జరిగిన సమావేశం అనంతరం మోదీ, ఒమాన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి బంధం మరింత బలపడుతోంది అని పేర్కొన్నారు. -
రెండోరోజు ఒమన్ పర్యటనలో ప్రధాని మోదీ
రెండోరోజు ఒమన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పలు అంశాలపై అగ్రనేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించనున్నారు. ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ ఇథియోపియా నుంచి బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఉప ప్రధానమంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ ఇవాళ (గురువారం) ఒమన్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు.ఈ సందర్భంగా కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన పర్యటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి. -
ఒమన్ పర్యటన షురూ
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ ఉప ప్రధానమంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్‌తో సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ ఇథియోపియా నుంచి బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఉప ప్రధానమంత్రి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ గురువారం ఒమన్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన పర్యటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి. భారత్–ఒమన్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఒమన్‌లోని మస్కట్‌లో తాను బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేశారు. భారతీయ కళాకారులు సైతం సాంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే భారత్–ఒమన్ సంబంధాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ గత శుక్రవారమే ఆమోదించింది. దీనిపై 2023 నవంబర్‌లో చర్చలు మొదల య్యాయి. ఈ ఏడాది విజయవంతంగా ముగి శాయి. ఒప్పందంపై సంతకాలు జరిగితే రెండు దేశాల వాణిజ్య సంబంధాల్లో నూతన ఆధ్యాయం ప్రారంభమైనట్లేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మోదీ ఒమన్ సుల్తాన్‌తో భేటీ కాబోతున్నారు. వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై వారు చర్చించనున్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. -
15 నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో త్వరలో పర్యటించనున్నారు. రక్షణ, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల మెరుగే లక్ష్యంగా ఈ నెల 15 నుంచి 18వ తేదీల మధ్య ఈ మూడు దేశాలను చుట్టిరానున్నారు. రాజు అబ్దుల్లా ఆహ్వానం మేరకు ఈ నెల 15, 16వ తేదీల్లో జోర్డాన్‌లో పర్యటిస్తారు. అక్కణ్నుంచి, ఇథియోపియాకు చేరుకుంటారు. అనంతరం ఒమన్‌లో 17, 18వ తేదీల్లో పర్యటన జరుపుతారని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. -
యువ భారత్ విజృంభణ
చెన్నై: పురుషుల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జోరు సాగుతోంది. తొలి మ్యాచ్‌లో చిలీపై ఘనవిజయం సాధించిన యంగ్ ఇండియా... రెండో మ్యాచ్‌లో ఒమన్‌పై విజయఢంకా మోగించింది. పూల్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆతిథ్య భారత జట్టు 17–0 గోల్స్ తేడాతో ఒమన్‌ను మట్టికరిపించింది. భారత్ తరఫున దిల్‌రాజ్ సింగ్ (29వ, 32వ, 50వ, 58వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించగా... అర్ష్ దీప్ సింగ్ (4, 33, 40వ నిమిషాల్లో), మన్మీత్ (17, 26, 36వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ గోల్స్ చేశారు. అజీత్ యాదవ్ (34, 47వ నిమిషాల్లో), గుర్జ్యోత్ సింగ్ (39, 45వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ సాధించగా... లువాన్ (43వ నిమిషంలో), అన్మోల్ ఎక్కా (29వ నిమిషంలో), శారదానంద్ తివారి (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. తొలి క్వార్టర్లో ఒక్క గోల్‌తో సరిపెట్టుకున్న యంగ్‌ఇండియా ఆ తర్వాత గోల్స్ వర్షం కురిపించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ 11–1 తేడాతో కొరియాపై, ఆ్రస్టేలియా 5–3 తేడాతో బంగ్లాదేశ్‌పై, స్విట్జర్లాండ్ 3–2 తేడాతో చిలీపై, జర్మనీ 7–0తో కెనడాపై, దక్షిణాఫ్రికా 2–1తో ఐర్లాండ్‌పై, మలేసియాపై 5–1 ఆ్రస్టియాపై, నెదర్లాండ్స్ 5–3 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై విజయాలు సాధించాయి. తదుపరి పోరులోమంగళవారం స్విట్జర్లాండ్‌తో భారత్ తలపడనుంది. -
‘ఆమె’ను కాపాడండి.. జైశంకర్‌కు జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి!
సాక్షి,హైదరాబాద్: తక్కువ పని ఎక్కువ వేతనం వస్తోందంటూ ఆశ చూపించడంతో ఓ మహిళ ఏజెంట్ చేతిలో మోసపోయింది. గల్ఫ్ దేశంలో యజమానుల చేతుల్లో చిత్ర హింసలకు గురవుతోంది. పాస్‌పోర్టు లేకపోవడంతో గల్ఫ్ దేశం వదిలి రాలేక.. అక్కడే ఉండలేక నానా ఇబ్బందులు పడుతోందని, వెంటనే జోక్యం చేసుకుని ఆమెకు విముక్తి కలిగించాలని కోరుతూ.. జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ కేంద విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఫౌజియా బేగమ్ అనే మహిళ మోసపూరిత ఏజెంట్ వలలో చిక్కుకుని ఒమన్‌లో ఇబ్బందులు పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంఐఎం నేత మాజీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అహ్మదుల్లా ఖాన్ ఎంబీటీ విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.ఫౌజియా బేగమ్ భర్తతో విడాకులు తీసుకుని ఖైరతాబాద్‌లో నివసిస్తోంది. బెంగుళూరుకు చెందిన సిద్ధిఖీ అనే పాస్‌పోర్టు ఏజెంట్, ఒమన్‌లో ఇంటిపని చేస్తే నెలకు భారత్‌లో వచ్చే సంపాదన కంటే అధిక మొత్తంలో వస్తుందని ఆశ చూపించి ఆమెను అక్కడికి పంపించాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రెండు ఇళ్లలో పని చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు, ఆమె పాస్‌పోర్టును ఇవ్వకుండా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు అహ్మదుల్లా ఖాన్.. జైశంకర్‌కు లేఖ రాసి, ఆమె ప్రస్తుతం నార్త్ వెస్ట్ ఒమన్‌లోని ఆల్ బురైనీ ప్రాంతంలో ఉన్నారని వివరించారు. ఆమెను కాపాడి సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కోరారు. మా సోదరి ఏజెంట్ వలలో చిక్కుకుంది. ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి వెంటనే చర్యలు తీసుకుని ఆమెను రక్షించండి’అని కోరారు. అహ్మదుల్లా ఖాన్ విజ్ఞప్తిపై ఓమన్‌లోని భారత్ రాయబార కార్యాలయం స్పందించింది. త్వరలోనే బాధితురాల్ని క్షేమంగా భారత్‌కు తరలించే ప్రయత్నం చేస్తామని ఎక్స్ వేదికగా స్పందించింది. .@DrSJaishankar Sir, One Fouzia Begum resident of Hyderabad is stuck up in Al Buraimi, North-Western Oman who has been cheated by her agent. Her family has requested yourself to rescue her as soon as possible.All details emailed and attached.Kindly ask @Indemb_Muscat to rescue… pic.twitter.com/ij2Y0uZs5d— Amjed Ullah Khan MBT (@amjedmbt) November 20, 2025 -
వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్‌కు భారత్
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో జితేశ్ శర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వసీమ్ అలీ (45 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా... కెపె్టన్ హమ్మద్ మీర్జా (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. భారత ‘ఎ’ జట్టు బౌలర్లలో గుర్జపనీత్ సింగ్, సుయాశ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్ వైశాక్, హర్‡్ష దూబే, నమన్ ధిర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ష్ దూబే (44 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకోగా... నమన్ ధీర్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ షాట్లతో అలరించాడు. ఐపీఎల్ స్టార్లు వైభవ్ సూర్యవంశీ (12), ప్రియాన్ష్ ఆర్య (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. నేహల్ వధేరా (23) ఫర్వాలేదనిపించాడు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 4 పాయింట్లతో భారత ‘ఎ’ జట్టు ముందంజ వేసింది. -
టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్, ఒమన్ అర్హత
దుబాయ్: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌నకు ఒమన్, నేపాల్ జట్లు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్ ‘సూపర్ సిక్స్’లో ఆడిన మూడేసి మ్యాచ్‌ల్లో నెగ్గిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొననున్నాయి. బుధవారం సమోవాతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ జట్టు 77 పరుగుల తేడాతో విజయం సాధించడంతోనే... ఒమన్, నేపాల్ ముందంజ వేశాయి. వరల్డ్‌కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా... నేపాల్, ఒమన్‌తో ఆ సంఖ్య 19కి చేరింది. ఈ టోర్నీ నుంచి మరొక్క జట్టు మాత్రమే అర్హత సాధించాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న యూఏఈ జట్టుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక ప్రపంచకప్ ఆడనుండగా... 2024 వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగా అఫ్గానిస్తాన్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ ముందంజ వేశాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా మెగా టోర్నీకి అర్హత సాధించాయి. అమెరికా క్వాలిఫయర్స్ ద్వారా కెనడా జట్టు... యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా ఇటలీ, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి నమీబియా, జింబాబ్వే ముందంజ వేయగా... ఆసియా క్వాలిఫయర్స్ నుంచి తాజాగా నేపాల్, ఒమన్ వరల్డ్ కప్‌నకు అర్హత సాధించాయి. మరో జట్టు కూడా బెర్త్ దక్కించుకుంటే... ప్రపంచ కప్‌లో పోటీపడే జట్ల సంఖ్య పూర్తి కానుంది. -
44 ఏళ్ల వయసులో సత్తా చాటి...
అబుదాబీ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒమన్ బ్యాటర్ ఆమిర్ కలీమ్ భారత్‌పై అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఫిఫ్టీ పూర్తవడంతోనే అదేదో సెంచరీ లేదంటే డబుల్ సెంచరీ చేసినంతగా సంబరాలు చేసుకున్నాడు. డగౌట్లో ఉన్న సహచరులు కూడా అతనికి చప్పట్లతో జేజేలు పలికారు. ఇది మనకు ‘ఓవరాక్షన్’లా కనిపించింది. చేసిన అర్ధ శతకానికే ఏంటీ సంబరాలు అనిపించింది. కానీ అసలు సంగతి మరొకటి ఉంది. ఎందుకంటే అతనేమీ టి20లు ఆడే రెగ్యులర్ యువ క్రికెటర్ కాదు. 44 ఏళ్ల వెటరన్! అంతేకాదు. ఓ రిటైర్డ్ క్రికెటర్ కూడా! ఆట వదిలేసి కోచింగ్ బాట పట్టిన కలీమ్ తిరిగొచ్చి యువకుడిలా చెలరేగడమే గొప్ప విశేషం. ఈ విశేషం తాలుకూ సంబరాలే ఆ చిందులు! కోచింగ్‌లో టైటిల్ కొన్ని నెలల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ డివిజన్–2 ఆసియా క్వాలిఫయర్స్‌లో ఒమన్ యువజట్టు టైటిల్ గెలిచింది. ఈ జట్టును తీర్చిదిద్దింది మరెవరో కాదు... ఆమిర్ కలీమ్. అలా కోచ్‌గా సక్సెస్ అయ్యాడు. కానీ అతని జాతీయ క్రికెట్లో సంక్షోభం తలెత్తింది. ఏకంగా 11 మంది ఒమన్ ఆటగాళ్లు మస్కట్‌లో ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ముందు వైదొలిగారు. అమెరికా, కరీబియన్లలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాల్గొన్న తమకు బోర్డు ప్రైజ్‌మనీ ఇవ్వకపోవడంతో కెప్టెన్ అఖిబ్ ఇలియాస్, మాజీ కెప్టెన్ జీషాన్ మక్సూద్ సహా 11 మంది ఒమన్‌కు ఆడేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఒమన్ క్రికెట్ బోర్డు తమ మాజీ క్రికెటర్, ప్రస్తుత అండర్–19 జట్టుకు కోచ్ అయిన ఆమిర్ కలీమ్‌ను ఆడేందుకు పిలిచింది. దీంతో అతను రిటైర్మెంట్ను పక్కనబెట్టి ఆడేందుకు సై అన్నాడు. భారత్‌పై మెరుపు ఫిఫ్టీ అలా ఒమన్ క్రికెట్ జట్టును సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వచి్చన కలీమ్ వయసు సహకరించకపోయినా... క్రికెట్‌పై అంకితభావంతో ఆటగాడిగా మళ్లీ మైదానంలో చెమటోడ్చాడు. అబుదాబీలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో పటిష్టమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్న తీరు ఆకట్టుకుంది. ఈ వెటరన్ క్రికెటర్ తమ కెప్టెన్ జతిందర్ సింగ్‌తో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. భారత బౌలర్లపై దూకుడుగా ఆడి బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. ఇటీవల కోచ్‌గా మార్గదర్శనం చేసిన చేతులతోనే తాజాగా సెంచరీ చేసిన ఆనందం కట్టలు తెగడంతో అంతగా సంబరాల్లో మునిగితేలాడు. ఓపెనర్‌గా వచ్చిన కలీమ్ 18వ ఓవర్‌గా నిలబడటం గొప్ప విశేషం. అంతేకాదు భారత శిబిరాన్ని కూడా తన మెరుపు బ్యాటింగ్‌తో కాసేపు వణికించాడు. ఉద్యోగం కోసం కరాచీ నుంచి... పాకిస్తాన్‌కు చెందిన కలీమ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. కానీ ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని కరాచీ నుంచి 2004లో ఒమన్ బాటపట్టాడు. అక్కడ డెలివరీ సెక్షన్లో లోడింగ్, అన్లోడింగ్ చేసే హమాలీగా పనిచేశాడు. వేడి వాతావరణ పరిస్థితుల మధ్య చెమట చిందించిన కలీమ్ తర్వాత రెస్టారెంట్లో పనికి కుదిరాడు. భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని కెకె మోహన్‌దాస్‌కు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. స్థానికంగా ఓ క్రికెట్ క్లబ్‌ను ఆయన నడిపిస్తున్నాడు. ఇది తెలుసుకున్న కలీమ్ తన క్రికెట్ జిజ్ఞాసను యజమానికి వివరించాడు. ఓ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు. అతని ఉత్సాహాన్ని గమనించిన మోహన్‌దాస్ కొత్త కిట్ కొనిచ్చి ప్రోత్సహించాడు. అలా భారత సంతతి యజమాని ప్రోత్బలంతో ఆమిర్ కలీమ్ 2012లో ఒమన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుత కెప్టెన్ జతిందర్ సింగ్‌తో కలిసి 13 ఏళ్ల పాటు ఒమన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇద్దరు కూడా ఓ పూట జాబ్ చేసుకుంటూనే క్రికెట్‌ను కొనసాగించారు. ఇన్నేళ్లుగా రాని గుర్తింపు ఈ ఒక్క మ్యాచ్ (భారత్)తో కలీమ్‌కు వచ్చింది. – సాక్షి క్రీడా విభాగం -
జస్ట్ మిస్..! టీమిండియాని వణికించిన ఒమన్
-
భారత్ అజేయంగా...
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో లీగ్ దశను భారత్ అజేయంగా ముగించింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి తమతో తలపడిన చిన్న జట్టు ఒమన్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. బ్యాటర్ల పట్టుదలతో ఒమన్ కొంత పోరాడగలిగినా... టీమిండియా ముందు అది సరిపోలేదు. శుక్రవారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 21 పరుగులతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (45 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆమిర్ కలీమ్ (46 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టోర్నీలో నేటి నుంచి సూపర్–4 దశ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. తొలి పోరులో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుండగా ... ఆదివారం పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది. రాణించిన అభిషేక్, తిలక్... శుబ్‌మన్ గిల్ (5) త్వరగానే వెనుదిరిగినా... అభిషేక్ మరోసారి తనదైన రీతిలో దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించాడు. షకీల్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను నదీమ్ ఓవర్లో మరో మూడు ఫోర్లు బాదాడు. సామ్సన్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో భారత్ 60 పరుగులు చేసింది. అయితే రామనంది వేసిన ఓవర్లో ముందు అభిషేక్ అవుట్ కాగా... రెండు బంతుల తర్వాత దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా (1) రనౌటయ్యాడు.సామ్సన్ కొట్టిన షాట్‌కు బంతి బౌలర్ చేతికి తాకుతూ స్టంప్స్‌ను పడగొట్టడంతో పాండ్యా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకదశలో నాలుగు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, సిక్స్ బాదిన అక్షర్‌ను వెంటనే వెనక్కి పంపడంతో ఒమన్సఫలమైంది. శివమ్ దూబే (5) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, తన సహజశైలికి భిన్నంగా ఆడిన సామ్సన్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మరో వైపు క్రీజ్‌లో ఉన్నంత సేపు తిలక్ ధాటిని ప్రదర్శించాడు. అయితే వరుసగా వికెట్లు పడుతూ ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినా కూడా ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం చివరి వరకు బ్యాటింగ్‌కు రాలేదు! కలీమ్, మీర్జా అర్ధసెంచరీలు... భారీ లక్ష్య ఛేదనలో ఒమన్‌కు సరైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు జతీందర్, కలీమ్ జాగ్రత్తగా ఆడి తొలి 6 ఓవర్లలో 44 పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు తొలి వికెట్‌కు 52 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ఒమన్ సఫలమైంది. ఈ క్రమంలో 38 బంతుల్లో కలీమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒమన్ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. కలీమ్‌కు తోడు మీర్జా కూడా ధాటిని ప్రదర్శించాడు. 55 బంతుల్లోనే వీరిద్దరు 93 పరుగులు జత చేయడం విశేషం. 30 బంతుల్లో మీర్జా అర్ధ సెంచరీ సాధించగా... ఆ తర్వాత చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి ఒత్తిడిలో ఒమన్ ఓటమి దిశగా పయనించింది.1 అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్ దీప్ సింగ్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 క్రికెట్లో 25 మంది బౌలర్లు 100 వికెట్ల మైలురాయిని దాటారు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ (173 వికెట్లు) ‘టాప్’లో ఉన్నాడు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) శుక్లా (బి) రామనంది 38; గిల్ (బి) ఫైసల్ 5; సామ్సన్ (సి) బిష్త్ (బి) ఫైసల్ 56; పాండ్యా (రనౌట్) 1; అక్షర్ (సి) శుక్లా (బి) కలీమ్ 26; దూబే (సి) జతీందర్ (బి) కలీమ్ 5; తిలక్ (సి) జిక్రియా (బి) రామనంది 29; హర్షిత్ (నాటౌట్) 13; అర్ష్ దీప్ (రనౌట్) 1; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–6, 2–72, 3–73, 4–118, 5–130, 6–171, 7–176, 8–179. బౌలింగ్: షకీల్ 3–0–33–0, ఫైసల్ 4–1–23–2, నదీమ్ 1–0–19–0, రామనంది 4–0–32–2, శ్రీవాస్తవ 2–0–23–0, జిక్రియా 3–0–23–0, కలీమ్ 3–0–31–2. ఒమన్ ఇన్నింగ్స్: జతీందర్ (బి) కుల్దీప్ 32; కలీమ్ (సి) పాండ్యా (బి) హర్షిత్ 64; హమ్మద్ (సి) (సబ్) రింకూ (బి) పాండ్యా 51; జిక్రియా (నాటౌట్) 0; శుక్లా (సి) (సబ్) రింకూ (బి) అర్ష్ దీప్ 1; రామనంది (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–56, 2–149, 3–154, 4–155. బౌలింగ్: పాండ్యా 4–0–26–1, అర్ష్ దీప్ 4–0–37–1, హర్షిత్ 3–0–25–1, కుల్దీప్ 3–0–23–1, అక్షర్ 1–0–4–0, దూబే 3–0 –31–0, తిలక్ 1–0–8–0, అభిషేక్ 1–0–12–0. -
Asia Cup 2025: రాణించిన సంజూ.. ఒమన్‌పై టీమిండియా విజయం
ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) వికెట్లు తీశారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.ఓపెనర్ ఆమిర్ కలీమ్ (64), వన్ డౌన్లో వచ్చిన హమ్మద్ మీర్జా (51) అద్బుతమైన అర్ద సెంచరీలతో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మరో ఓపెనర్, ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (32) కూడా పర్వాలేదనిపించారు.ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సూపర్-4కు అర్హత సాధించగా.. ఒమన్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. సూపర్-4 దశలో భారత్ సెప్టెంబర్ 21న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
మరో ‘ప్రాక్టీస్’ మ్యాచ్!
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో వరుసగా రెండు విజయాలతో తమ స్థాయిని ప్రదర్శిస్తూ అలవోకగా ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన భారత జట్టు తమ సాధనకు పదును పెడుతోంది. ఈ క్రమంలో గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమన్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో యూఏఈని 57కు ఆలౌట్ చేసిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 130 పరుగులకే పరిమితం చేసింది. ఏకపక్షంగా సాధించిన ఈ విజయాల కారణంగా మన బ్యాటర్లందరికీ బరిలోకి దిగే అవకాశమే పెద్దగా రాలేదు. ఈ రెండు మ్యాచ్‌లు కలిపి అభిõÙక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. సామ్సన్, హార్దిక్ పాండ్యాలకు ఏమాత్రం బ్యాటింగ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. దాంతో ఒమన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిస్తే జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మన దుర్బేధ్యమైన టీమ్‌ను నిలువరించడం ఒమన్‌కు సాధ్యం కాదు. భారత బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది.అయితే అందరూ ‘సూపర్–4’కు ముందు తగిన ప్రాక్టీస్‌ను ఆశిస్తున్నారు. ఈ టోర్నీలో ఏకైక మ్యాచ్‌లో అబుదాబిలో ఆడుతున్న సూర్యకుమార్ బృందం... ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో సాధన చేసే అవకాశం లేదు. అందుకే ఈ మ్యాచ్ జట్టుకు కావాల్సిన ప్రాక్టీస్‌ను అందించవచ్చు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందేమో చూడాలి. చిన్న జట్టు కాబట్టి బుమ్రాకు విశ్రాంతినిచ్చి అర్ష్ దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరిని ఆడించే అవకాశం కూడా ఉంది. మరోవైపు తొలిసారి ఆసియా కప్‌లో ఆడుతున్న ఒమన్ నుంచి ఆశించేదేమీ లేదు. పాకిస్తాన్, యూఏఈలతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కూడా ఒక్కరూ లేరు. -
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్‌ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్‌ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్‌రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్‌కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?! -
Asia Cup 2025: బోణీ కొట్టిన యూఏఈ
ఆసియా కప్-2025లొ ఆతిథ్య యూఏఈ బోణీ కొట్టింది. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్‌లో ఒమన్‌పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లో వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు), అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించడంతో మంచి స్కోర్ చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడి 200 స్కోర్ దిశగా పయనించిన యూఏఈ.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసిఫ్ ఖాన్ (2), వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (0) నిరాశపర్చగా.. ముహమ్మద్ జోహైబ్ (21), హర్షిత్ కౌశిక్ (19 నాటౌట్) తేలికపాటి మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2, హస్నైన్ షా, సమయ్ శ్రీవాత్సవ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆ దశలోనే మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20), రామనంది (13) కొద్ది సేపు ఓటమిని వాయిదా వేయగలిగారు. 18.4 ఓవర్లలో ఆ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బకొట్టాడు. హైదర్ అలీ, ముహమ్మద్ జవాదుల్లా తలో 2, రోహిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు. యూఏఈ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో (సెప్టెంబర్ 17) తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుకు సూపర్ 4 అవకాశాలు ఉంటాయి. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. ప్రపంచ రికార్డు బద్దలు
యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వసీంకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ పేరిట ఉండేది. బట్లర్ 3000 పరుగులు పూర్తి చేసేందుకు 2068 బంతులు తీసుకోగా.. వసీం కేవలం 1947 బంతుల్లోనే ఈ ల్యాండ్ మార్క్‌ను తాకాడు. ఈ జాబితాలో వసీం, బట్లర్ తర్వాతి స్థానాల్లో ఆరోన్ ఫించ్ (2077), డేవిడ్ వార్నర్ (2113), రోహిత్ శర్మ (2149) ఉన్నారు.మ్యాచ్‌ల పరంగా చూస్తే.. వసీం మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లి (భారత్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు రిజ్వాన్‌కు 79, విరాట్ కోహ్లికి 81, బాబర్ ఆజమ్‌కు 81 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వసీం తన 84వ ఇన్నింగ్స్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు. ఆసియా కప్-2025లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో వసీం పై రెండు ఘనతలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో వసీం 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేశాడు. వసీంకు జతగా మరో ఓపెనర్ అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) కూడా అర్ద సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఒమన్ తడబడుతుంది. ఆ జట్టు 6.1 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. షా ఫైసల్ (8), ఆర్యన్ బిస్త్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో యూఏఈ భారత్, పాక్, ఒమన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. కొద్ది రోజుల కింద భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు చిత్తుగా ఓడింది. -
పాకిస్తాన్ జోరు
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీని పాకిస్తాన్ జట్టు విజయంతో మొదలు పెట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. తొలిసారి ఆసియా కప్ బరిలోకి దిగిన ఒమన్ జట్టు పాక్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా...ఛేదనలో ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. అబుదాబిలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి. ఓపెనర్ సయీమ్ అయూబ్ (0) డకౌట్ కాగా... మొహమ్మద్ హరీస్ (43 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాహిబ్జాదా ఫర్హాన్ (29 బంతుల్లో 29; 1 ఫోర్) కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఒమన్ సఫలమైనా...ఆ తర్వాత పట్టు విడిచింది. హరీస్, ఫర్హాన్ రెండో వికెట్‌కు 64 బంతుల్లో 85 పరుగులు జోడించారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (0) తొలి బంతికే వెనుదిరగ్గా... ఫఖర్ జమాన్ (23 నాటౌట్; 2 ఫోర్లు), మొహమ్మద్ నవాజ్ (19 నాటౌట్) కూడా కీలక పరుగులు జత చేయడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఒమన్ పూర్తిగా చేతులెత్తేసింది. హమ్మద్ మీర్జా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ కనీసం క్రీజ్‌లో నిలబడలేకపోయారు. పాకిస్తాన్ తరఫున ఫహీమ్ అష్రఫ్, ముఖీమ్, అయూబ్ తలా 2 వికెట్లు తీశారు. పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో రేపు భారత్‌ను ఎదుర్కొంటుంది. -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన పసి కూన..
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లకు ఒమన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ హరిస్ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగల్గింది. తొలి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ హరిస్(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికి బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్(16 బంతుల్లో 23) తన మార్క్ చూపించలేకపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్ నవాజ్(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు. -
జీవనాధారం కోసం ఉద్యోగానికి ‘జై’... క్రికెట్‌కూ ‘సై’
సాక్షి క్రీడా విభాగం : మన దేశంలో క్రికెట్ ఓ మతమైంది. కోట్ల మంది జీవితాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల అంత స్థాయికి ఎదగలేకపోయినా సరే ఒక్కసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే చాలు... ‘గ్రేడ్’తో పని లేకుండా కోట్ల రూపాయల్లో వార్షిక పారితోషికం... పోటీలకు ఇంతని లక్షల్లో మ్యాచ్ ఫీజలు లభిస్తాయి. కాబట్టి ఆటగాడైతే చాలు... దేశవాళీ క్రికెట్‌తోనూ ఆటతోనే విలాసవంతంగా బ్రతికేస్తాడు. అంతెందుకు ఒక్క ఐపీఎల్ సీజన్లో జూనియర్ స్థాయి ఆటగాడైన సరే అదృష్టం తలుపుతట్టి వేలంలో ఆయా జట్లకు ఎంపికైనా చాలు మిగతా జీవితమంతా సుఖమయం అవుతుంది. అయితే ఇదంతా భారత్‌లోనే చెల్లుతుంది. కానీ ఇతర దేశాల్లోని క్రికెటర్లు మైదానంలో చెమటోడ్చాలి. ఆఫీస్‌లో ఉద్యోగం చేయాలి. చాలా దేశాల్లో ఇలానే... క్రికెట్ ఆడే ఎన్నో దేశాల్లో ఇలాగే ఉంటుంది. కేవలం బ్యాట్ పట్టి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి, మ్యాచ్లపుడు మైదానంలో దిగితే సరిపోదు. జీవనాధారం కోసం ఉద్యోగం లేదంటే వ్యాపారం ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాల్సిందే! తాజా ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలో ఉన్న ఒమన్ క్రికెటర్లు కూడా ఇదే చేస్తారు. రూపాయి మారకం విలువ పరంగా ఒమని రియాల్ (ఒమన్ కరెన్సీ) మనకంటే చాలా విలువైందే అయినా... క్రికెట్లో మాత్రం బలహీనమైంది. అక్కడి ప్రొఫెషనల్ క్రికెటర్లు సైతం తెల్లారితే లంచ్ బాక్స్‌లు కట్టుకొని ఆఫీస్‌కు వెళ్తారు. సాయంత్రమైతేనే ఆటకు సిద్ధమవుతారు. మ్యాచ్‌లు, పెద్ద పెద్ద సిరీస్‌లు ఉంటేనే పక్షం లేదంటే నెలకు మించి సెలవులు పెట్టి మెగా ఈవెంట్లు ఆడతారు. ఇది ముగియగానే ఒమన్ ఆటగాళ్లు మళ్లీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఇవి ఎవరో ‘నెట్టింట’ పెట్టిన విషయాలో, ‘షార్ట్స్’, ‘రీల్స్’లో చెప్పిన కబుర్లో కాదు... స్వయంగా ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్, ఆల్‌రౌండర్ సుఫియాన్ మెహమూద్ వెల్లడించిన వాస్తవాలు. ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం క్రికెటే తమ కెరీర్ కానేకాదని జతిందర్ స్పష్టం చేశాడు. తమ తొలి ప్రాధాన్యం ఉద్యోగమేనన్నాడు. ఆటను మొదలు పెట్టిన తొలినాళ్లలో మా ప్రాధాన్యమంతా ఉద్యోగానికే ఉండేదని, క్రికెట్ ఆట తమకు రెండో ప్రాధాన్యమని ఒమన్ కెప్టెన్ చెప్పాడు. ‘నేనే కాదు చాలామంది ఇదే చేస్తారు. ఠంచనుగా ఉద్యోగం చేసేందుకు బయల్దేరతారు. క్రికెట్‌ను ఓ ప్రత్యామ్నాయంగానే చూస్తారు. అయితే ఇప్పుడు ఆసియా కప్ లాంటి పేరొందిన సిరీస్ ఆడటం ద్వారా క్రికెట్ కల పెద్దగా అనిపిస్తుంది. తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని జతిందర్ అన్నాడు. కాంక్రిట్పై కష్టాలెన్నో... ఒమన్‌లో క్రికెట్‌కు ప్రత్యేకించి టర్ఫ్ గ్రౌండ్లు అంటూ లేని రోజుల్లో తాము సిమెంట్ వికెట్లపైనే ఆడాల్సి వచ్చిందని, 2008లో ఆస్ట్రోటర్ఫ్ వినియోగంలోకి వచ్చినా... మూడేళ్ల తర్వాతే 2011 నుంచి పూర్తిస్థాయి టర్ఫ్ గ్రౌండ్‌పై క్రమం తప్పకుండా ఆడుతున్నామని జతిందర్ ఒమన్ క్రికెట్ కష్టాలను చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఫలితం (ప్రాభవం లేని క్రికెట్)లేని ఆట కోసం ఎందుకు కష్టపడాలని ఎన్నోసార్లు అనిపించినా... ఏదో క్రికెట్‌పై ఉన్న కాస్త మక్కువే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని వివరించాడు. 36 ఏళ్ల జతిందర్ ఇప్పటి వరకు 36 వన్డేలాడి 1704 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టి20ల్లో 115 స్ట్రయిక్‌రేట్‌తో 1120 పరుగులు సాధించాడు. మరోవైపు 34 ఏళ్ల ఆల్‌రౌండర్ సుఫియాన్ 8 వన్డేలాడి 107 పరుగులు చేయడంతో పాటు 24.50 సగటుతో 6 వికెట్లు కూడా తీశాడు. తనకు టీమిండియాలో గిల్, సూర్యకుమార్, అభిషేక్ శర్మ, అర్ష్ దీప్, తిలక్ వర్మ అంటే ఇష్టమని చెప్పాడు. క్రికెటెందుకు... చదువుకో ముందు! సుఫియాన్ ఒమన్ క్రికెట్ జట్టుకు ఎంపికవగానే అతని తల్లిదండ్రులు ససేమిరా అన్నారట! ఒమన్‌లో క్రికెట్‌కు భవిష్యత్తే లేదని, ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగంపైనే దృష్టి సారించాలని తన తల్లిదండ్రులు గట్టిగా చెప్పారని పేర్కొన్నాడు. ‘కానీ క్రికెట్ అంటే పిచ్చి. నాపై ఉన్న నమ్మకమే ఆటవైపు నడిపించింది. 2016 టి20 ప్రపంచకప్ అర్హత సాధించగానే మేం పడిన కష్టాలకు సాంత్వన చేకూరింది’ అని సుఫియాన్ తెలిపాడు. ఒమన్ క్రికెట్ నిలబడటానికి ఆ మెగా ఈవెంట్ ఎంతగానో దోహదం చేసిందన్నాడు. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అభిమాన క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. -
మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) కూటమి దేశాల్లో ఒమన్ మొదటిసారి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టనుంది. 42,000 రియాల్స్ (1,09,000 డాలర్లు-దాదాపు రూ.93 లక్షలు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వర్గానికి 5% పన్ను విధించనున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒమన్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ కథనం ప్రచురించింది. ఈ విధానం 2028 నుంచి అమల్లోకి రానుందని అంచనా వేసింది.చమురుకు తగ్గుతున్న డిమాండ్ముడిచమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై దేశం తక్కువగా ఆధారపడటానికి ఈ చర్య దోహదపడుతుందని ఒమన్ ఆర్థిక మంత్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ అల్ సక్రీ తెలిపారు. అదే సమయంలో ప్రజా సేవలు, సామాజిక అవసరాలపై వ్యయాన్ని సమర్థంగా నిర్వర్తించవచ్చని చెప్పారు. మొత్తం ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలు ఆదాయంపై పన్ను విధించకుండా దూరంగా ఉన్న నేపథ్యంలో ఒమన్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న జీరో ట్యాక్స్ విధానం అధిక ఆదాయం ఉన్న ప్రవాసులను ఆకర్షించడానికి సహాయపడింది. ఒకవేళ ఒమన్ ప్రతిపాదించిన విధానం ఆచరణలోకి వస్తే ప్రవాసుల ధోరణి ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంటుంది.అబుదాబి కమర్షియల్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ మోనికా మాలిక్ ఈ పరిణామాన్ని ఆర్థికంగా కీలకమైనదిగా అభివర్ణించారు. ఒమన్ తన పక్క దేశాలతో అభివృద్ధిలో పోటీ పడేందుకు వీలుగా, రాజీపడకుండా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఇదిలాఉండగా, పొరుగు దేశాల మాదిరిగానే ఒమన్ కూడా సంపద సృష్టించడంలో భాగంగా ఇటీవలి కాలంలో ఆస్తుల అమ్మకాలు, ప్రైవేటీకరణ ద్వారా డబ్బు సమీకరిస్తోంది.గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో..?సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పడుతుండటంతో ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం చాలా జీసీసీ దేశాలు మెరుగైన ప్రభుత్వ నిధులను కలిగి ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్జీసీసీ దేశాలు ఏవంటే..గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) అనేది ఆరు మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక కూటమి. అందులోని దేశాలు..బహ్రెయిన్కువైట్ఒమన్ఖతార్సౌదీ అరేబియాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)1981లో జీసీసీ స్థాపించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. -
ముగిసిన ఇరాన్, అమెరికా మూడో దఫా చర్చలు
మస్కట్ (ఒమన్): యురేనియం శుద్ధి కార్యక్రమం వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్‌తో అమెరికా చేపట్టిన మూడో దఫా పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో ముగిశా యి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. చర్చల తర్వాత అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు ఒమన్ నుంచి తమ స్వదేశాలకు పయనమయ్యారని విశ్వస నీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘పరస్పర గౌరవం, హామీలకు కట్టుబడేలా ఒప్పందం కుదర్చుకునేందుకు రెండు దేశాలు ఆసక్తి కనబర్చాయి. కీలక ప్రతిపాదనలు, సాంకేతిక అభ్యంతరాలు, తదితరాలపై మరోదఫా చర్చలు జరుపుతాం. వచ్చే వారం సైతం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతుంది. మళ్లీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మే మూడో తేదీన తదుపరి భేటీ ఉంటుంది’’అని ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. గతంలో మస్కట్, రోమ్‌లో ఇలా పరోక్ష చర్చలు జరిగాయి. గతంలో మాదిరే ఈసారి చర్చల్లో సైతం ఒమన్ విదేశాంగ మంత్రి బుసైదీ మధ్యవర్తిగా ఉన్న విషయం విదితమే. చర్చలకు ముందు విట్కాఫ్ రష్యాలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. చర్చలు మొదలైన సమయంలోనే దక్షిణ ఇరాన్లో రజేయీ నౌకాశ్రయంలో శనివారం పేలుళ్లు సంభవించడం గమనార్హం. అర్ధశతాబ్ద శత్రుత్వాన్ని పక్కనబెట్టిమరీ ఇరాన్‌పై కఠిన ఆంక్షలను సడలిస్తామని, అందుకు ప్రతిగా అణ్వాయుధంలో ఉపయోగించే యురేనియం శుద్ధి వేగాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్ చేయడం తెల్సిందే. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే దాడులతో తెగబడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే అందుకు దీటుగా బదులిస్తామని ఇరాన్ ప్రతిస్పందించడం విదితమే. -
మూడో దశ చర్చలు 26న
రోమ్: అణు కార్యక్రమాలను ఇరాన్ మరింతగా వేగవంతం చేసిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా మొదలెట్టిన రెండో దఫా చర్చలు శనివారం రోమ్‌లో ముగిశాయి. తొలి దఫా చర్చలు ఒమన్‌లో ముగియగా రెండో రౌండ్ చర్చలు ఇటలీ వేదికగా శనివారం జరిగాయి. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి సమీపంలోని క్యామిలూసియా ప్రాంతంలోని ఒమన్ రాయబార కార్యాలయంలో ఈ పరోక్ష చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే రెండోదఫా చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే వివరాలను ఇరుదేశాలు వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 26వ తేదీన ఒమన్‌లో స్టీవ్ విట్కాఫ్తో మూడో దఫా చర్చలు జరగనున్నాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ చెప్పారు. ‘‘ఇరాన్ గొప్పగా, సుసంపన్నంగా ఉంటే సరిపోతుంది. అణ్వాస్త్ర సామర్థ్యంతో పనిలేదు. ఆ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం’’అని ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘‘మేం ఎల్లప్పడూ బాధ్యతాయుతంగానే మెలిగాం. సమస్యలకు దౌత్యమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాం. సంపత్రింపులు కొనసాగుతాయి’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. చర్చలు ముందు ఇరాన్ మంత్రి అరాగ్చీ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో భేటీ అయ్యారు. తదుపరి చర్చల్లో రష్యా సైతం భాగస్వామి కానుందని వార్తలొచ్చాయి. -
అణు కార్యక్రమంపై ముగిసిన ఇరాన్–అమెరికా ప్రతినిధుల భేటీ
మస్కట్: ఇరాన్, అమెరికా ప్రతినిధుల ముఖాముఖి మొదటి విడత చర్చలు శనివారం ఒమన్ రాజధాని మస్కట్‌లో ముగిశాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు వీరు వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక మొదటి విడత చర్చలు పూర్తయినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఈ నెల 19వ తేదీన తదుపరి విడత పరోక్ష చర్చలు జరుపుతామని అరగ్చి తెలిపారు. ‘ఫలితం లేని ఈ చర్చలతో సమయం వృథా. వీటిపై ఎవరికీ ఆసక్తి లేదు’అని పేర్కొన్నారు. మస్కట్ శివారులోని ఓ భవనంలో సమావేశమైన రెండు దేశాల ప్రతినిధులు రెండు గంటలపాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు ముఖాముఖి జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతినిధి విట్కాఫ్ తెలపడం గమనార్హం. అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమన్నదే తమ లక్ష్యమని ఇరాన్‌కు తెలిపినట్లు విట్కాఫ్ అంటున్నారు. -
ఒమన్‌లో నేడు ఇరాన్–అమెరికా అణు చర్చలు
మస్కట్: ఆకాశహర్మ్యాలు, హంగూ ఆర్భాటాలు కనిపించని ప్రశాంతమైన తీరప్రాంత మస్కట్ నగరం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో భాగమైన కీలక చర్చలకు మరోసారి వేదికగా మారనుంది. తమ అణు కార్యక్రమంపై ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ శనివారం అమెరికాతో చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించకున్నా ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక అంగీకారానికి రాని పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా వైమానిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తుండటం.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మాత్రం ఆపేది లేదని ఇరాన్ కరాఖండిగా చెబుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే ఒమన్ కల్పించుకోవాల్సి వచ్చింది. ట్రంప్ కూడా చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వంపై అనూహ్యంగా సానుకూలత ప్రకటించారు. ఒమన్ వైపు మొగ్గు ఎందుకు? ఒమన్ కీలకంగా వ్యవహరించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘గల్ఫ్ స్టేట్ అనాలిటిక్స్’సీఈవో జార్జియో కెఫియెరో అంటున్నారు. దౌత్యపరంగా ఒమన్ పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. చారిత్రకంగా చూసినా ప్రపంచ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన గత అనుభవం ఒమన్‌కు ఉందని హైడెల్బర్గ్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ మార్క్ అంటున్నారు. ఒమన్ ప్రజల్లో అత్యధికులు ఇబాదీ ముస్లింలు. ఇది సున్నీ–షియా విభజనకు ముందు నుంచీ ఉన్న ఉదారవాద ఇస్లాం శాఖ అని వివరించారు. ఇరాన్‌తో వ్యవహరించే విషయంలో గత కొన్నేళ్లుగా అమెరికా ప్రధానంగా ఒమన్పైనే ఆధారపడుతోందని ఆయన అన్నారు. 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరటానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రహస్య చర్చల్లో ఒమన్ ఎంతో సాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ దేశం ఎప్పుడూ వార్తల్లో ప్రధానంగా కనిపించేందుకు ప్రయతి్నంచలేదని, కేవలం తెరవెనుక ప్రభావవంతమైన పాత్ర పోషించిందన్నారు.అమెరికాతో నేరుగా చర్చలు జరపం: ఇరాన్ అమెరికాతో తాము నేరుగా చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ అంటోంది. అణు కార్యక్రమంపై ఒప్పందం విషయంలో ముందుగా ఒమన్ విదేశాంగ మంత్రితో మాట్లాడుతామని, తమ సందేశాన్ని ఆయనే అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు అందజేస్తారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ బద్ర్ తెలిపారు. 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ 3.67 శాతం శుద్ధి చేసిన యురేనియంను కొద్ది మొత్తంలో మాత్రమే నిల్వ ఉంచుకునేందుకు అవకాశముంది. అయితే, ఆ దేశం వద్ద ప్రస్తుతం 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో, ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటికి వస్తూ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండగా ప్రకటించారు. ప్రస్తుతం అణ్వాయుధం తయారీ దిశగా సాంకేతికంగా ఇరాన్ అతి సమీపంలో ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగా హిందూ మహా సముద్రంలోని డీగో గార్సియా మిలటరీ స్థావరానికి ఆరు బీ2 బాంబర్లను తరలించారు. చమురు అన్వేషణ, అణు కార్యక్రమంపై మరిన్ని ఆంక్షలు తప్పవని కూడా ట్రంప్ అంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని, ఐరాస అణు పరిశీలకులను దేశం నుంచి బహిష్కరించడానికి కైనా వెనుకాడబోమని ఇరాన్ అంటోంది. -
తొలిసారి ఆసియా కప్ బరిలో ఒమన్
న్యూఢిల్లీ: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈసారి 8 జట్లు పాల్గొననున్నాయి. ఒమన్ జట్టు తొలిసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలువడం ద్వారా యూఏఈ, ఒమన్ జట్లు ఆసియా కప్ టోర్నీకి అర్హత పొందాయి. ఈ రెండు జట్లతోపాటు హాంకాంగ్ జట్టు కూడా ఆసియా కప్‌లో ఆడనుంది. 2026లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యలో ఈసారి ఈ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. 2023 వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరిగే అవకాశమున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్ద ఉన్నప్పటికీ... తటస్థ వేదికపై టోర్నీ జరగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకుండా... దుబాయ్‌లోనే అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌లో పర్యటించబోమని గతంలోనే వెల్లడించింది. దీంతో ఆసియా కప్‌ను యూఏఈ, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆసియా కప్ చరిత్రలో భారత్ 8 సార్లు విజేతగా నిలిచి విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. -
వన్డేల్లో సరికొత్త చరిత్ర.. 40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏ
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ మ్యాచ్ మొత్తంలో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. అన్ని ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. యూఎస్ఏ, ఒమన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఒమన్.. యూఎస్ఏ బ్యాటింగ్ చేసిన 35.3 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అనంతరం యూఎస్ఏ సైతం ఒమన్ బ్యాటింగ్ చేసిన 25.3 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 61 ఓవర్లు జరగ్గా, అన్నింటినీ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏఈ మ్యాచ్‌లో మరో రికార్డు వరల్డ్ రికార్డు కూడా నమోదైంది. వన్డేల్లో అతి తక్కువ స్కోర్‌ను (122) డిఫెండ్ చేసుకున్న జట్టుగా యూఎస్ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 1985లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. 40 ఏళ్ల తర్వాత యూఎస్ఏ.. భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై యూఎస్ఏ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో మిలింద్ కుమార్ (47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆండ్రియస్ గౌస్ (14), హర్మీత్ సింగ్ (10), ఆరోన్ జోన్స్ (16), సంజయ్ కృష్ణమూర్తి (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లు షకీల్ అహ్మద్ 3, ఆమిర్ కలీమ్, సమయ్ శ్రీవత్సవ్ తలో 2, జే ఒడెడ్రా, సిద్దార్థ్ బుక్కపట్నం చెరో వికెట్ తీసి యూఎస్ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఒమన్ తరఫున బౌలింగ్ చేసినవారంతా స్పిన్నర్లే.అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. యూఎస్ఏ స్పిన్నర్ల దెబ్బకు 25.3 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ఏ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుశ్ కెంజిగే ఐదు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాశించాడు. మిలింద్ కుమార్, యాసిర్ మొహమ్మద్ తలో రెండు, హర్మీత్ సింగ్ ఓ వికెట్ పడగొట్టి ఒమన్ పతనానికి తమవంతు సహకారాన్ని అందించారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం హమ్మద్ మీర్జా (29) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. నలుగురు డకౌట్ అయ్యారు. ఒమన్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేసిన బౌలర్లు కూడా స్పిన్నర్లే. -
భారత్ ‘ఎ’ హ్యాట్రిక్ గెలుపు
మస్కట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్ నదీమ్ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్ సింగ్, సాయికిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్‌ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్‌ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్‌దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
పాకిస్తాన్ తొలి విజయం
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఏసియా కప్ 2024 టోర్నీలో పాకిస్తాన్-ఏ జట్టు తొలి విజయం నమోదు చేసింది. అల్ అమీరట్ వేదికగా ఒమన్‌తో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో పాక్-ఏ జట్టు 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ (48), రొహైల్ నజీర్ (41 నాటౌట్), ఆరాఫత్ మిన్హాస్ (31 నాటౌట్), ఒమైర్ యూసఫ్ (25), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలరల్లో ముజాహిర్ రజా రెండు వికెట్లు పడగొట్టగా.. వసీం అలీ, సమయ్ శ్రీవత్సవ, సుఫ్యాన్ మెహమూద్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఒమన్‌ను కట్టడి చేశారు. జమాన్ ఖాన్ 2, షానవాజ్ దహాని, మొహమ్మద్ ఇమ్రాన్, ఖాసిమ్ అక్రమ్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ పడగొట్టారు. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (28), జతిందర్ సింగ్ (24), హమ్మద్ మిర్జా (14), ఆమిర్ ఖలీమ్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ ఈ టోర్నీలో తమ తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుండగా.. భారత్ ఇవాళ సాయంత్రం అదే యూఏఈని ఢీకొట్టనుంది. చదవండి: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ -
చరిత్ర సృష్టించిన ఒమన్ పేసర్.. షాహీన్ అఫ్రిది రికార్డు బద్దలు
ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ వన్డేల్లో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బిలాల్‌కు ముందు ఈ రికార్డు పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది పేరిట ఉండేది. షాహీన్ 51 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. బిలాల్ కేవలం 49 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా (పేసర్లు, స్పిన్నర్లు) వన్డేల్లో ఫాస్టెస్ 100 వికెట్స్ రికార్డు నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ పేరిట ఉంది. లామిచ్చేన్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు.ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బిలాల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నమీబియాపై ఒమన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. ఒమన్ 49.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా ఇన్నింగ్స్‌లో మలాన్ క్రుగెర్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. ఆకిబ్ ఇలియాస్ (68), ఖలీద్ కైల్ (43) ఒమన్‌ను గెలిపించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 3, ఫయాజ్ భట్ 2, కలీముల్లా, జే ఒడేడ్రా, షోయబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టగా.. నమీబియా బౌలర్లలో జాక్ బ్రసల్ 2, బెన్ షికోంగో, తంగెని లుంగమెని తలో వికెట్ దక్కించుకున్నారు.వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్లుబిలాల్ ఖాన్- 49 మ్యాచ్లుషాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52షేన్ బాండ్- 54ముస్తాఫిజుర్ రెహ్మాన్- 54వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లుసందీప్ లామిచ్చేన్- 42రషీద్ ఖాన్- 44బిలాల్ ఖాన్- 49షాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52 -
అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు.. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే!
స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కాసెల్ రికార్డులకెక్కాడు. సోమవారం ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ లీగ్ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాసెల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా పేరిట ఉండేది. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో వరల్డ్రికార్డును కూడా అతడు నమోదు చేశాడు. అరంగేట్రంలో తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా కాస్సెల్ నిలిచాడు. తను వేసిన మొదటి ఓవర్లో తొలి రెండు బంతుల్లో ఒమన్ బ్యాటర్లు జీషన్ మస్కూద్ అయాన్ ఖాన్‌లను ఔట్ చేసిన కాసెల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయలేకపోయాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఒమన్.. కాసెల్ దాటికి కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ 2 వికెట్లు కోల్పోయి చేధించింది.Charlie Cassell's sensational seven-for on debut has helped Scotland bowl Oman out for a modest total 👏Catch all the live #CWCL2 action on https://t.co/CPDKNxoJ9v 📺#SCOvOMA 📝: https://t.co/woV3zYu9sG | 📸: @CricketScotland pic.twitter.com/iGeeVoyvTc— ICC (@ICC) July 22, 2024 -
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం
ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిని ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ట్యాగ్ సురక్షింతగా బయటకు తీసుకువచ్చింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు. ఈ ప్రమాదంలో మునిగిన ఒక శ్రీలంక పౌరుడిని కూడా ఇండియన్ నేవీ రక్షించింది. మరో శ్రీలంక పౌరుని మృతదేహాన్ని వెలికితీసింది.ఒమన్ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్‌ను గుర్తించడానికి భారత్‌కు చెందిన యుద్ధనౌక ఐఎస్ఎస్ టెగ్ను రెస్క్యూ ఆపరేషన్‌కు పంపారు. ఒమన్‌లోని రాస్ మద్రాక్కు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో జులై 15న ఈ నౌక మునిగిపోయింది. ఒమన్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే కార్గో నౌకలో 13 మంది భారతీయులు,ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమన్ మారిటైమ్ సేఫ్టీ సెంటర్ (ఎంఎస్సీ)పేర్కొంది. -
ఒమన్ సమీపంలో సరుకు రవాణా నౌక మునక
దుబాయ్: ఒమన్ సమీప సముద్రజలాల్లో సరకు మూడు రోజుల క్రితం రవాణా నౌక మునిగిపోయిన ఘటనలో ఐదుగురు భారత, ముగ్గురు శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. మూడ్రోజుల అన్వేషణ తర్వాత 8 మంది భారతీయులను, ఒక శ్రీలంక వ్యక్తిని కాపాడ గలిగారు. మిగతా వారికోసం అన్వేషణ సాగుతోంది. దుబాయ్ నుంచి బయలుదేరిన నౌక దుక్మ్ పట్టణం సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. కొమొరోస్ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్టు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒమన్‌లోని ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు దుక్మ్ పోర్ట్ ప్రధాన కేంద్రంగా ఉంది. 117 మీటర్ల పొడవైన ఫాల్కన్ నౌకను 2007లో నిర్మించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులే. -
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్లో తెలిపింది. A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024 -
ఒమన్‌లో కాల్పుల కలకలం
మస్కట్: ఒమన్‌లోని వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం(జులై 16) తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పులువురికి గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పోలీసులు సంతాపం ప్రకటించారు. మసీదు దగ్గర భద్రత పెంచామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
T20 WC 2024: 47 పరుగులకే ఆలౌట్.. వరల్డ్‌కప్‌లోనే అతిపెద్ద విజయం
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.కాగా వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్‌తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్లోనే ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc)టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది. అలా అయితేనే సూపర్-8కుకాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక ఓడిపోవాలి.లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్‌రన్‌రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది. చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ పడింది. మెగా టోర్నీ నుంచి ఓ జట్టు నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి ఒమన్ తదుపరి దశకు చేరకుండా ఎలిమినేట్ అయ్యింది. నిన్న (జూన్ 9) స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన అనంతరం ఒమన్ అధికారికంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ సూపర్-8కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టనుంది. ఈ టోర్నీలో ఒమన్ మరో మ్యాచ్ (జూన్ 13న ఇంగ్లండ్‌తో) ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండానే ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.కాగా, ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రతిక్ అథవాలే (54) అర్ద సెంచరీతో రాణించగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయాన్ ఖాన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్క్ వాట్, వీల్, క్రిస్టఫర్ సోల్, క్రిస్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (31 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జార్జ్ మున్సే (20 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఆకిబ్ ఇలియాస్, మెహ్రన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో స్కాట్లాండ్ రన్‌రేట్‌ను బాగా మెరుగుపర్చుకుని టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన స్టోయినిస్.. బోణీ కొట్టిన ఆసీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 జర్నీని ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-బిలో పసికూన ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో (67 నాటౌట్, 3/19) ఇరగదీసి ఆసీస్‌ను గెలిపించాడు. స్టోయినిస్ దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఒమన్ విలవిలలాడిపోయింది.వివరాల్లోకి వెళితే.. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ (12), మిచెల్ మార్ష్ (14), మ్యాక్స్‌వెల్ (0) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. మెహ్రాన్ ఖాన్ 2, బిలాల్ ఖాన్, కలీముల్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ టాప్ స్కోరర్‌గా నిలువగా..మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
T20 World Cup 2024: ఉత్కం‘టై’న పోరులో నమీబియా ‘సూపర్’ గెలుపు
సూపర్ ఓవర్‌కు ముందు... నమీబియా గెలిచేందుకు 6 బంతుల్లో 5 పరుగులు కావాలి. క్రీజులో పాతుకుపోయిన ఫ్రయ్‌లింక్ (48 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఉండటంతో నమీబియా గెలుపు లాంఛనం. కానీ మెహ్రాన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వల్ల ఆఖరి బంతి బౌల్ అయ్యేసరికి ఒమన్ గెలవాలి! ఫ్రయ్‌లింక్, గ్రీన్ వికెట్లు తీసిన మెహ్రాన్ 4 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి 2 పరుగులపుడు మెహ్రాన్ చక్కని బంతి వేయగా... వికెట్ కీపర్ మిస్ ఫీల్డింగ్, మిస్ త్రో వల్ల ఒక పరుగు వచ్చి స్కోరు ‘టై’ అయింది. తుది ఫలితం కోసం మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో... ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నమీబియా బ్యాటర్లు డేవిడ్ వీస్ తొలి నాలుగు బంతుల్లో 4, 6, 2, 1 కొట్టగా... చివరి రెండు బంతులు ఆడిన ఎరాస్మస్ 4, 4 బాదడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. విజయం సాధించేందుకు 22 పరుగులు చేయాల్సిన ఒమన్ జట్టు నసీమ్ (2) వికెట్ కోల్పోయి 10 పరుగులే చేయడంతో నమీబియా ‘సూపర్’ విక్టరీ నమోదు చేసింది. బ్రిడ్జ్‌టౌన్: లాంఛనమైన (ఆఖరి ఓవర్ 6 బంతుల్లో 5 పరుగులు) విజయానికి దూరమైన నమీబియా ‘సూపర్ ఓవర్’తో చేజారిన విజయాన్ని చేజిక్కించుకుంది. ఒమన్ పేసర్ మెహ్రాన్ (3–1–7–3) అసాధారణ బౌలింగ్‌ను... డేవిడ్ వీస్ ‘షో’ సూపర్ ఓవర్లో మాయం చేసింది. ‘సూపర్ ఓవర్’లో 13 పరుగులు చేసిన వీస్ వెంటనే బౌలింగ్‌కు దిగి వికెట్ కూడా తీసి 10 పరుగులిచ్చాడు. 20 జట్లు బరిలో ఉన్న ఈ టి20 ప్రపంచకప్‌లో ‘బోర్’ మ్యాచ్‌లే బోలెడనుకున్న క్రికెట్ ప్రేక్షకులు, విశ్లేషకుల అంచనాల్ని గ్రూప్ ‘బి’లోని ఈ మ్యాచ్ తారుమారు చేసింది. ఔరా అనిపించేలా ఈ కూనల తక్కువ స్కోర్ల మ్యాచ్ వరల్డ్‌కప్‌కే వన్నె తెచ్చింది. సూపర్ ఓవర్లో నమీబియా గెలిచినా... మ్యాచ్ చూసిన ప్రతి మదిని ఒమన్ పోరాటం తాకింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖాలిద్ కైల్ (39 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్), జీషాన్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్మన్ (4/21), వీస్ (3/28), కెపె్టన్ గెరార్డ్ ఎరాస్మస్ (2/20) అదరగొట్టారు. తర్వాత నమీబియా కూడా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. జాన్ ఫ్రయ్లింక్తో పాటు నికోలస్ డేవిన్ (31 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 3: టి20 ప్రపంచకప్ చరిత్రలో ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలిన మ్యాచ్‌లు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచకప్‌లో సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు.. అక్టోబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించాయి. -
T20 World Cup 2024: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న వీస్
నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ (39) లేటు వయసులో అదిరిపోయే ప్రదర్శనలతో ఇరదీస్తున్నాడు. గత కొంతకాలంగా నమీబియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వీస్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లోనూ చెలరేగిపోతున్నాడు. వరల్డ్‌కప్ గ్రూప్-బి పోటీల్లో భాగంగా ఒమన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో వీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి నమీబియాను గెలిపించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. రెగ్యులర్ మ్యాచ్‌లో బ్యాట్‌తో బంతితో సత్తా చాటిన వీస్.. సూపర్ ఓవర్లోనూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.రెగ్యులర్ మ్యాచ్‌లో తొలుత బంతితో (3.4-0-28-3) రాణించిన వీస్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ (8 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్) పర్వాలేదనిపించాడు. అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్లోనూ వీస్ ఇరగదీశాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాట్‌తో (4 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) చెలరేగిన వీస్.. ఆతర్వాత బంతితోనూ (1-0-10-1) రాణించి నమీబియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు గాను వీస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో వీస్‌తో పాటు ట్రంపెల్మన్ (4-0-21-4), ఎరాస్మస్ (4-0-20-2), స్కోల్జ్ (4-0-20-1) సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఖలీద్ కైల్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఒమన్ చేసినన్ని పరుగులే (109) చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ (3-1-7-3), కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ (4-1-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బిలాల్ ఖాన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. నమీబియాను విజయతీరాలకు చేర్చేందుకు ఫ్రైలింక్ (45) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.సూపర్ ఓవర్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా వీస్, ఎరాస్మస్ (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. వీస్ ధాటికి 10 పరుగలకే పరిమితమై ఓటమిపాలైంది. -
చెలరేగిన నమీబియా బౌలర్లు.. 109 పరుగులకే ఒమన్ ఆలౌట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. మరి 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒమన్ బౌలర్లు కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. -
మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు
ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. 'రాయల్ కింగ్ హోల్డింగ్'తోపాటు 'చిరు మెగా యూత్ ఫోర్స్' సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్ఎస్ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైబ్రాంట్ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్‌ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్ కింగ్ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్ అండ్ టీం) అభినందనలు తెలిపారు. -
India-Oman Relations: సరికొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత్–ఒమన్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో మరో ముందడుగు పడింది. సుమారు 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రూపొందించిన దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాల సంబంధాల్లో ఇది సరికొత్త మలుపు కానుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే రెండు దేశాల మధ్య కుదిరే సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)కి ఇది దోహదప డుతుందని భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత్‌లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చలు జరిపారు. పాలస్తీనా సమస్యకు పరిష్కారమైన రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగించాలని వారు అభిప్రాయపడినట్లు విదేశాంత శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అదేవిధంగా, ఇద్దరు నేతలు ఒమన్–భారత్ సంయుక్త పెట్టుబడి నిధికి మూడో విడతగా రూ.2,500 కోట్లు సమకూర్చుతామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి నమోదు చేసుకున్న రంగాల్లో పెట్టుబడులుగా వినియోగిస్తారు. భారత్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కింద ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై పోరు, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఒమన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ కార్యాలయంలో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్‌లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్‌లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్‌లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. -
T20 WC Qualifier: థ్రిల్లింగ్ మ్యాచ్.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఊహించని ఫలితం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌తో క్రికెట్ ప్రపంచం మొత్తం బిజీగా ఉంటే.. నేపాల్‌లోని ఖాట్మండులో ఓ అద్భుతం జరిగింది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్లో ఒమన్.. తమకంటే పటిష్టమైన నేపాల్‌ను సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి సమానమైన స్కోర్లు (184 పరుగులు) చేయడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేయగా.. నేపాల్ కేవలం 10 పరుగులకు (వికెట్ కోల్పోయి) మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో ఒమన్ 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. కిక్కిరిసిపోయిన స్టేడియం.. ఇసుకేస్తే రాలనంత జనం నేపాల్‌లో క్రికెట్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా వేల సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. సొంత జట్టు మ్యాచ్ అయితే అభిమానులను కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. స్టేడియంలో నిలబడేందుకు కూడా ప్లేస్ దొరక్క జనాలు చెట్లు, టవర్లు ఎక్కుతున్నారు. ఇక్కడ క్రికెట్ క్రేజ్ ప్రమాదకర స్థాయికి చేరింది. నిన్న కిరిటీపూర్లో జరిగిన నేపాల్-ఒమన్ 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు జనాలు తండోపతండాలుగా స్టేడియంకు వచ్చారు. స్టేడియంలో వాతావరణం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. A cacophony of noise and a full house again here well before the start of play in Kathmandu as Nepal's anthem provides the goosebumps with the 30,000 or so in & around the TU singing in unison It's Nepal🇳🇵 v Oman🇴🇲 for the title with both teams guaranteed to the #T20WorldCup pic.twitter.com/CWDIQYLfMh — Andrew Leonard (@CricketBadge) November 5, 2023 ఇది చాలదనట్లు జనాలు స్టేడియం బయట ఉన్న చెట్లు, ఎత్తైన హోర్డింగ్‌లు ఎక్కి మ్యాచ్ వీక్షించారు. క్రికెట్ మ్యాచ్‌ల కోసం జనాలు స్టేడియానికి రావడం మంచిగానే అనిపిస్తున్నప్పటికీ, జరగరానిది ఏదైన జరిగితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. It's an electrifying atmosphere here at T.U Ground as always.#NEPvOMAN pic.twitter.com/5BJv1RAQud — Samraat Maharjan (@MaharjanSamraat) November 5, 2023 ఇదిలా ఉంటే, నేపాల్ ఫ్యాన్స్ తమ జట్టు టైటిల్ సాధిస్తుందేమోనని కిరీటీపూర్ స్టేడియానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆ జట్టు అనూహ్యంగా సూపర్ ఓవర్లో ఓటమిపాలై, వారిని నిరాశపరిచింది. -
T20 WC 2024: టి20 ప్రపంచకప్.. తొలిసారి 20 జట్లు బరిలోకి
కీర్తిపూర్ (నేపాల్): వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 పురుషుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు నేపాల్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. ఇక్కడ జరుగుతున్న ఆసియా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి టి20 ప్రపంచకప్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఒమన్ జట్టు 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్ జట్టును ఓడించగా... నేపాల్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై గెలిచింది. టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించడం ఇది రెండోసారి కాగా... ఒమన్ జట్టు మూడోసారి ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది. నేపాల్ 2014లో, ఒమన్ 2016, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్నాయి. మరో రెండు బెర్త్‌ల కోసం... వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు వెస్టిండీస్–అమెరికాలలో జరిగే తొమ్మిదో టి20 ప్రపంచకప్‌లో తొలిసారి 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికి 18 జట్లు అర్హత పొందాయి. ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా నేరుగా అర్హత సంపాదించాయి. 2022 ప్రపంచకప్ ద్వారా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు బెర్త్‌లు లభించాయి. ర్యాంకింగ్ ఆధారంగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు బెర్త్‌లు దక్కాయి. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా నేపాల్, ఒమన్... యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా స్కాట్లాండ్, ఐర్లాండ్... తూర్పు ఆసియా–పసిఫిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా పాపువా న్యూగినీ... అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా కెనడా అర్హత సాధించాయి. ఈనెల 22 నుంచి 30 వరకు నమీబియాలో ఏడు దేశాల మధ్య (జింబాబ్వే, కెన్యా, నమీబియా, నైజీరియా, రువాండా, టాంజానియా, ఉగాండా) జరిగే ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు బెర్త్‌లు ఖరారవుతాయి. -
నెదర్లాండ్స్ ఆశలు సజీవం
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ నిలిచింది. సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు. తర్వాత మళ్లీ వానతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్ ఖాన్ (92 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు. నేడు జింబాబ్వే గెలిస్తే... ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారుకాగా... రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్తో తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది. -
CWC Qualifier 2023: సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు, తదుపరి షెడ్యూల్ వివరాలు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. నేపాల్, యూఎస్ఏ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. ఐర్లాండ్, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లు జూన్ 29 నుంచి ప్రారంభమవుతాయి. సూపర్ సిక్స్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు జరుగనుండగా.. ఓ గ్రూప్‌లోని మూడు జట్లు మరో గ్రూప్‌లోని మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టోర్నీలో మరో నాలుగు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఏ పొజిషన్లో ఉంటుందో డిసైడ్ కాలేదు. గ్రూప్-ఏలో జింబాబ్వే తొలి స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకోగా.. వెస్టిండీస్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 26) విజేత రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రూప్-బి నుంచి శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 27) విజేత గ్రూప్ టాపర్ నిలుస్తుంది. మరో జట్టు ఒమన్ తమ కోటా మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడంతో ఓడిన జట్టు రెండో స్థానంలో ఉంటుంది. సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే 2 పాయింట్లతో తదుపరి దశకు చేరతాయి. గ్రూప్-ఏలో జింబాబ్వే.. తమ గ్రూప్‌లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్‌లపై విజయాలు సాధించడంతో సూపర్ సిక్స్ దశకు రెండు పాయింట్లతో అడుగుపెడుతుంది. అలాగే గ్రూప్-బిలో శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది. సూపర్ సిక్స్ షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి).. జూన్ 29: ఏ2 వర్సెస్ బి2 జూన్ 30: ఏ3 వర్సెస్ బి1 జులై 1: ఏ1 వర్సెస్ బి3 జులై 2: ఏ2 వర్సెస్ బి1 జులై 3: ఏ3 వర్సెస్ బి2 జులై 4: ఏ2 వర్సెస్ బి3 జులై 5: ఏ1 వర్సెస్ బి2 జులై 6: ఏ3 వర్సెస్ బి3 జులై 7: ఏ1 వర్సెస్ బి1 సూపర్ సిక్స్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు జులై 9న జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఫైనల్లో తలపడటంతో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
శ్రీలంకకు ధీటుగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన స్కాట్లాండ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్-బిలో శ్రీలంకకు ధీటుగా చిన్న జట్టు స్కాట్లాండ్ వరుస విజయాలు సాధిస్తుంది. ఇవాళ (జూన్ 25) ఒమన్‌పై విజయం సాధించడంతో ఆ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తద్వారా గ్రూప్-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్కాట్లాండ్ చేతిలో ఓడినా ఒమన్ ఈ గ్రూప్ నుంచి మూడో జట్టుగా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్-బిలో మరో జట్టైన యూఏఈ 3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు సూపర్ సిక్స్ దశకు చేరగా.. నేపాల్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఫలితంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఏ దశలోనూ విజయం సాధించేట్టు కనపడలేదు. ఆ జట్టు తొలి 6 వికెట్లు క్రమ అంతరాల్లో పోగొట్టుకుంది. అయితే వికెట్ కీపర్ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖర్లో స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ చెలరేగి 5 వికెట్లు పడగొట్టడంతో ఒమన్ కథ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడు.. శతక్కొట్టి చుక్కలు చూపించాడు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో స్కాట్లాండ్ యువ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్‌ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ పేరు హిట్టింగ్ దిగ్గజం, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్కల్లమ్ తరహాలో మెక్‌ముల్లెన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్ హిట్టర్‌ను మెక్కల్లమ్తో పోలుస్తున్నారు. ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్‌ముల్లెన్.. స్కాట్లాండ్ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్‌లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
ఐర్లాండ్‌కు బిగ్ షాకిచ్చిన ఒమన్.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బోణీ
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో ఒమన్ బోణీ కొట్టింది. బులవాయో అథ్లెటిక్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఒమన్ అద్భుతమైన విజయం సాధించింది. 282 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఒమన్ ఛేదించింది. ఒమన్ విజయంలో ఓపెనర్ ప్రజాపతి(72) కెప్టెన్ జీషన్ మక్సూద్ కీలక(59) కీలక పాత్ర పోషించారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్, అడైర్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో డాక్రెల్(91), హ్యరీ టెక్టార్(52) పరుగులతో రాణించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఫయ్యాజ్ భట్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయాన్ ఖాన్, ఒడేరా, మక్సూద్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. చదవండి: #CWCQualifiers2023: చెలరేగిన హసరంగా.. ICC CWC Qualifiersలో లంక శుభారంభం -
ఉండలేక.. తిరిగి రాలేక...
మోర్తాడ్ (బాల్కొండ): పొరుగు దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలను వృద్ధి చేయడానికి ఒమన్ ప్రభుత్వం విరివిగా జారీ చేసిన విజిట్ వీసాలను కొందరు దళారులు పక్కదారి పట్టించారు. ఒమన్ లో వ్యాపారం చేయడానికి విదేశీయులకు జారీ చేసిన విజిట్ వీసాలను నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. ఫలితంగా ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లిన వందలాది మంది తెలంగాణ వలస కార్మికులు ఆ దేశంలో ఇరుక్కుపోయారు. విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో అక్కడ ఉండలేక, ఇంటికి చేరాలంటే రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో మగ్గుతున్నారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఒమన్ విదేశీ వ్యాపారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టింది. ఇలా ఐదు నెలల కింద విజిట్ వీసాలను ఎక్కువగా జారీ చేసింది. ఒకసారి జారీ చేసిన విజిట్ వీసాను రెండుమార్లు గడువు పొడిగించుకోవడానికి ఒమన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ఔత్సాహికులను నకిలీ ఏజెంట్లు ఆకర్షించారు. ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లి వర్క్ వీసా పొందవచ్చని నమ్మించారు. 300 మంది తెలంగాణ వలస కార్మికులు ఉచితంగా జారీ చేసిన విజిట్ వీసాలను రూ.80 వేలకు ఒకటి చొప్పున విక్రయించి దాదాపు 300 మంది తెలంగాణ వలస కార్మికులను తరలించారు. విజిట్ వీసాలపై వచ్చినవారికి ఒమన్‌లోని కంపెనీలు పనులు ఇవ్వడానికి నిరాకరించాయి. ఒక నెల విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో మరో నెల రోజులకు పొడిగించుకుని ఉపాధి అవకాశాల కోసం కార్మికులు ప్రయత్నించారు. కంపెనీలలో ఉన్నవారికే సరైన పని లేకపోవడంతో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు ఇచ్చే అవకాశం అసలే లేకపోయింది. కొందరు వలస కార్మికులు తమ చేతిలో డబ్బు లేకపోవడంతో వీసా గడువు పొడిగించుకోలేక రహస్యంగా అక్కడే ఉండిపోయారు. పార్కులు, స్నేహితుల గదుల్లో కార్మికులు తలదాచుకుంటున్నారు. వీసా రెన్యూవల్, జరిమానా చెల్లించేందుకు డబ్బుల్లేకపోవడంతో వలస కార్మికులు స్వదేశం తిరిగి రావడానికి అవస్థలు పడుతున్నారు. వీసా ఉంటేనే రావాలి: గుండేటి గణేశ్ ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ ప్రతినిధి గుండేటి గణేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ దేశానికి విజిట్ వీసాపై వచ్చిన వారికి పనులు ఇవ్వడం లేదన్నారు. కంపెనీ వీసా ఉంటేనే ఒమన్‌కు రావాలని సూచించారు. చిక్కుకుపోయిన వలస కార్మికులను మాతృభూమికి పంపించడానికి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని గణేశ్ వివరించారు. -
వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో..
అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు బాలురను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని అనుకున్నారు. కానీ ఓ సాధరణ వ్యక్తి అని తెలిశాక అభినందించారు. పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు. He is a hero! 💞pic.twitter.com/wKcUKVQpmH — Figen (@TheFigen_) December 21, 2022 చదవండి: గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..! -
దళారుల చేతిలో మోసం
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎనిమిది మంది దళారుల చేతిలో మోసపోయారు. వారి మాటలు విని ఓ కంపెనీలో వెల్డింగ్ పనులు చేసే నిమిత్తం ఒమన్ దేశానికి వెళ్లారు.. అక్కడకు వెళ్లాక అసలు అలాంటి కంపెనీయే లేదని తెలియడంతో లబోదిబోమంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం(గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్, గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు(బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు(గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం(బాలాజీపురం)లు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్‌కు వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులుంటాయని చెప్పారని, మంచి జీతాలొస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరూ రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ చెల్లించారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక, కడుపు నిండా తిండి లేక ఇబ్బందిపడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న పాస్ పోర్టు, వీసాలు నకిలీవంటూ అక్కడి పోలీసులు తీసుకెళ్లారని అక్కడ నుంచి బంధువులకు సమాచారం అందజేశారు. క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం..: మంత్రి అప్పలరాజు ఉపాధి కోసం వెళ్లి ఒమన్ దేశంలో చిక్కుకుపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. జరిగిన విషయాన్ని బాధితుల బంధువులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం పలాసలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బాధితులతో ఫోన్లో మాట్లాడారు. ఒమన్‌లో వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఇండియన్ ఎంబసీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. చదవండి:గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు -
ఒమెన్‌లో చిక్కుకున్న సిక్కోలు యువకులు.. మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో
వజ్రపుకొత్తూరు రూరల్/కంచిలి/సంతబొమ్మాళి: దేశం కాని దేశంలో సిక్కోలు యువకులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలో సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన 8 మంది యువకులు ఒమెన్ దేశంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఇక్కడి వారితో సంప్రదించి తమ బాధలు చెప్పుకున్నారు. వీరు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్ దేశం వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులు ఉంటాయని చెప్పారని, మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరం రూ. 90 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లించామని తెలిపారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక కడుపు నిండా తినేందుకు తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్డు, వీసాలు నకిలీవని పోలీసులు తీసుకెళ్లారని, భారత రాయబారి కార్యాలయానికి సంప్రదించేందుకు అవకాశం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ఒమెన్‌లో చిక్కుకున్న వారిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం (గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్ (పెద్దపాలేరు), గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు (బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు (గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం (బాలాజీపురం)లు ఉన్నారు. -
ఇంకా నయం.. గ్లోవ్స్, బ్యాట్ మాత్రమే విసిరాడు!
మ్యాచ్ గెలిస్తే సెలబ్రేషన్ చేసుకోవడం సహజం. కానీ ఒక్కోసారి అలాంటి సెలబ్రేషన్స్ హద్దులు దాటిపోతాయి. చూడడానికి కాస్త ఓవర్‌గా కూడా అనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2022లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం ఒమన్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కష్యప్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మహ్మద్ నదీమ్ 53 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి విజయాన్ని అందుకుంది. రిచీ బెరింగ్టన్(73), జార్జ్ మున్సీ(43), మైకెల్ లీస్క్(21) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివర్లో రిచీ బెరింగ్టన్ ఔట్ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రధాన బ్యాటర్స్ అంతా వెనుదిరగడంతో భారం అంతా మార్క్ వాట్పై పడింది. చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో ఓవర్ తొలి బంతిని మార్క్ వాట్ ఫోర్ తరలించాడు. ఆ తర్వాత మూడు బంతులకు నాలుగు పరుగుల వచ్చాయి. ఇక ఐదో బంతిని ఫోర్ కొట్టి జట్టను గెలిపించాడు మార్క్ వాట్. 37 పరుగులతో అజేయంగా నిలిచిన మార్క్ వాట్ తన సహచర బ్యాటర్ వద్దకు పరిగెత్తుకొచ్చి గ్లోవ్స్, బ్యాట్‌ను గాల్లోకి విసిరేసి.. హెల్మెట్‌కు ముద్దులు పెట్టాడు. దీంతో ఇదేం వింత సెలబ్రేషన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ODI World Cup Qualifiers: వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు Mark Watt finished the game for Scotland with a ball in hand. He scored an unbeaten 37 in 35 balls. The celebration from him says it all about the importance of the win. pic.twitter.com/bgCzpEcrvL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2022 -
మోసం చేసిన ఏజెంట్! ఒమన్‌లో చిక్కుల్లో పడ్డ భారతీయ మహిళ !
ట్రావెల్ ఏజెంట్లు చేసిన మోసంతో ఓ మహిళ దేశం కాని దేశంలో ఇక్కట్ల పాలైంది. చేతిలో డబ్బులు లేక అక్కడ యజమాని పెట్టే కష్టాలు భరించలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూసింది. చివరకు విదేశాంగ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ మహిళకు అండగా నిలిచారు. మారుమూల ప్రాంతానికి మస్కట్‌లో ఉద్యోగం ఉందంటూ మాయమాటలు చెప్పిన ఓ ట్రావెల్ ఏజెంట్ రంగారెడ్డి జిల్లాలోని షహీన్ నగర్‌కి చెందిన ఓ మహిళను విమానం ఎక్కించాడు. మస్కట్‌కి కాకుండా ఒమన్‌లోని మారుమూల ప్రాంతమైన సిర్కి ఆ మహిళను పంపాడు. అక్కడ ఉద్యోగం బదులు ఒకరి ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు. ఈ ఘటన 2021 నవంబరులో జరిగింది. నిత్యం హింసే రోజుకు 18 గంటల పాటు పని చేసినా యజమాని సంతృప్తి చెందకపోవడంతో నిత్యం ఆమెను హింస పెట్టేవాడు. దీంతో తనను ఇండియా పంపివ్వాలంటూ ఆ మహిళ వేడుకోగా.. తనకు రెండు లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తే తప్ప విముక్తి లేదంటూ ఖరాఖండీగా ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఫోన్ ద్వారా జరిగిన మోసం కుటుంబ సభ్యులకు తెలిపింది. నిఘా పెట్టాలి ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థల ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మస్కట్, ఒమన్లలో ఉన్న భారత అధికారులు.. సదరు యజమానితో మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపారు. చివరకు 2022 జనవరి 18న ఆ మహిళ సురక్షితంగా ఇండియా చేరుకుంది. ట్రావెల్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీసారి సరైన సమయంలో సహాయం అందకపోవచ్చని.. కాబట్టి చిక్కుల్లో పడవద్దంటూ సూచించారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో హుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టు డ్రోన్ ఎటాక్.. యూఏఈ స్పందన -
T20 World Cup 2021: ఒమన్‌పై స్కాట్లాండ్ ఘన విజయం.. సూపర్ 12కు అర్హత
ఒమన్‌పై స్కాట్లాండ్ ఘన విజయం.. గ్రూప్ బీ టాపర్‌గా సూపర్ 12కు అర్హత ఒమన్ నిర్ధేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ సునాయాస విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసి, గ్రూప్ బీ టాపర్‌గా సూపర్ 12కు అర్హత సాధించింది. కెప్టెన్ కైల్ కొయెట్జర్(28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు మున్సే(19 బంతుల్లో 20; 4 ఫోర్లు), మాథ్యూ క్రాస్(35 బంతుల్లో 26 నాటౌట్ ), రిచీ బెర్రింగ్టన్(21 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్, ఖవర్ అలీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన స్కాట్లాండ్.. సూపర్ 12లో భారత్ ఉండే గ్రూప్(గ్రూప్ 2)లో చేరింది. జోష్ డేవీకి ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ అవార్డుయ లభించింది. లక్ష్యం దిశగా సాగుతున్న స్కాట్లాండ్ ఒమన్ నిర్ధేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్ జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. 8 ఓవర్ల తర్వాత మున్సే(19 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది. క్రీజ్‌లో కైల్ కొయెట్జర్(22 బంతుల్లో 33), మాథ్యూ క్రాస్(6) ఉన్నారు. మున్సే వికెట్ ఫయాజ్ బట్కు దక్కింది. ఒమన్ 122 ఆలౌట్.. స్కాట్లాండ్ టార్గెట్ 123 స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒమన్ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో కేవలం 122 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఆకిబ్ ఇలియాస్(37), మహ్మద్ నదీమ్(25), కెప్టెన్ జీషన్ మక్సూద్(34) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 3 వికెట్లతో చెలరేగగా.. సాఫ్యాన్ షరీఫ్, మైఖేల్ లీస్క్ చెరో 2 వికెట్లు.. మార్క్ వాట్ ఓ వికెట్ దక్కించుకున్నారు. 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఒమన్ స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఒమన్ జట్టు 15 ఓవర్లలో 94 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. స్కాట్లాండ్ బౌలర్లు సాఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ లీస్క్, మార్క్ వాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. క్రీజ్‌లో కెప్టెన్ జీషన్ మక్సూద్(19), నసీం ఖుషి(1) ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 31/2 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్.. ఇన్నింగ్స్ రెండో బంతికే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ జతిందర్ సింగ్(0) రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో ఆ జట్టు మరో వికెట్ కోల్పోయింది. సాఫ్యాన్ షరీఫ్ బౌలింగ్‌లో మున్సేకు క్యాచ్ ఇచ్చి కశ్యప్ ప్రజాపతి(8 బంతుల్లో 3) వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 31/2. క్రీజ్‌లో ఆకిబ్ ఇలియాస్(18 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు), మహ్మద్ నదీమ్(3) ఉన్నారు. అల్ అమీరట్: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా గురువారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-బీ మ్యాచ్‌లో ఒమన్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: ఒమన్: జతిందర్ సింగ్, ఆకిబ్ ఇలియాస్, కశ్యప్ ప్రజాపతి, జీషన్ మక్సూద్(కెప్టెన్), ఖవర్ అలీ, నసీం ఖుషి(వికెట్ కీపర్), సూరజ్ కుమార్, మహ్మద్ నదీం, సందీప్ గౌడ్, బిలాల్ ఖాన్, ఫయాజ్ బట్ స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోట్జెర్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), రిచీ బెర్రింగ్టన్, కాలమ్ మాక్లీడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవి, బ్రాడ్లీ వీల్, సాఫ్యాన్ షరీఫ్ -
T20 WC 2021: ఒమన్ బౌలర్ అద్బుతం.. సింగిల్ హ్యాండ్‌తో
Oman Bowler Fayyaz Butt Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్ ఫయాజ్ భట్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. తన బౌలింగ్‌లోనే ఒకవైపుగా డైవ్ చేస్తూ మెహదీ హసన్‌ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతిని ఫయాజ్ భట్ ఫుల్‌టాస్ వేయగా.. మెహదీ బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. వెంటనే భట్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకొని ఆ తర్వాత రెండు చేతులతో బంతిని బాలెన్స్ చేశాడు. దీంతో మెహదీ అసన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: Oman Vs BAN: చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం PC: ICC T20.Com కాగా మెహదీ అసన్ను డకౌట్ చేసిన భట్ మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 26 పరుగుల తేడాతో ఒమన్‌పై విజయం సాధించింది. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్‌లో 42 పరుగులు.. అనంతరం బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: T20 WC 2021: మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్.. కలిసిరాని పుట్టినరోజు View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2021: చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆరంభంలో నిలకడగా ఆడినప్పటికీ, చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 26 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లా బౌలర్లు ముస్తాఫిజుర్, షకీబ్ ధాటికి ఒమన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో బంగ్లాదేశ్‌కు మరో ఓటమి ఖాయమయ్యేలా కనిపించినా, బంగ్లా బౌలర్లు తేరుకుని ఒమన్‌ను కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లతో చెలరేగగా, షకీబ్ 3, సైఫుద్దీన్, మెహిదీ హసన్ తలో వికెట్ పడగొట్టారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో జతిందర్ సింగ్(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యం దిశగా సాగుతున్న ఒమన్.. 15 ఓవర్ల తర్వాత 100/4 ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లా జట్టుకు మరో పరాభవం తప్పేలా లేదు. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. లక్ష్యం దిశగా సాగుతుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/4. క్రీజ్‌లో అయాన్ ఖాన్(11 బంతుల్లో ), సందీప్ గౌడ్(6 బంతుల్లో 4) ఉన్నారు. ఒమన్ గెలవాలంటే 30 బంతుల్లో 54 పరుగులు చేయాలి. 10 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 70/2 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి నరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి కశ్యప్ ప్రజాపతి(18 బంతుల్లో 21) ఔట్ కాగా.. జతిందర్(25 బంతుల్లో 30), జీషన్ మక్సూద్(4) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్ స్కోర్ 70/2గా ఉంది. ధాటిగా ఆడుతున్న ఒమన్.. 5 ఓవర్ల తర్వాత 40/1 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. 2వ ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగా ఆడుతుంది. ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి ఒమన్ ఓపెనర్ ఆకిబ్ ఇలియాస్(6 బంతుల్లో 6) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగగా.. కశ్యప్ ప్రజాపతి(15 బంతుల్లో 15), జతిందర్(9 బంతుల్లో 10) ధాటిగా ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 40/1. ఒమన్ బౌలర్ల విజృంభన.. బంగ్లాదేశ్ 153 ఆలౌట్ ఆఖరి 5 ఓవర్లలో ఒమన్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. 17వ ఓవర్లో కలీముల్లా.. అఫీఫ్ హోసేన్(5 బంతుల్లో 1), మహ్మద్ నయీమ్(50 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)ల వికెట్లు పడగొట్టగా.. 19వ ఓవర్లో ఫయాజ్ బట్ వరుస బంతుల్లో.. ముష్ఫికర్(4 బంతుల్లో 6), సైఫుద్దీన్(0)లను ఔట్ చేసి బంగ్లా భారీ స్కోర్ ఆశలకు గండికొట్టాడు. ఆఖరి ఓవర్ బౌల్ చేసిన బిలాల్ ఖాన్.. మహ్మదుల్లా(10 బంతుల్లో 17), ముస్తాఫిజుర్(2)లకు ఔట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ 153 పరుగుల వద్ద ముగిసింది. ఒమన్ బౌలర్లు ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్ తలో 3 వికెట్లు సాధించగా.. కలీముల్లా 2, జీషన్ మక్సూద్ ఓ వికెట్ పడగొట్టారు. గేర్ మార్చిన బంగ్లా బ్యాటర్లు.. 15 ఓవర్ల తర్వాత 112/4 మొదటి 10 ఓవర్లలో ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు ఆ తర్వాత గేర్ మార్చారు. 10కిపైగా సగటుతో పరుగులు స్కోర్ చేస్తున్నారు. 13.3 ఓవర్లో షకీబ్(29 బంతుల్లో 42; 6 ఫోర్లు) రనౌట్ కాగా, 15వ ఓవర్ ఆఖరి బంతికి జీషన్ మక్సూద్ బౌలింగ్‌లో సందీప్ గౌడ్‌కు క్యాచ్ ఇచ్చి నరుల్ హసన్(4 బంతుల్లో 3) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 112/4. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(46 బంతుల్లో 56), అఫీఫ్ హోసేన్ ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 63/2 తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన బంగ్లా జట్టు ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపిస్తోంది. 5 నుంచి 10 ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా 38 పరుగులు జోడించింది. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 63/2. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(31 బంతుల్లో 32), షకీబ్ అల్ హసన్(18 బంతుల్లో 22) ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 25/2 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ మరోసారి చెత్త బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగిస్తుంది. తొలి 5 ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు (లిటన్ దాస్(6), మెహిదీ హసన్(0)) కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 5 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(13), షకీబ్ అల్ హసన్(4) ఉన్నారు. ఒమన్ బౌలర్లు ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి మ్యాచ్‌లో బంగ్లా జట్టు పసికూన స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసినా సంగతి తెలిసిందే. అల్ అమీరట్: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-బీ మ్యాచ్‌లో ఒమన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: ఒమన్: జతిందర్ సింగ్, ఆకిబ్ ఇలియాస్, కశ్యప్ ప్రజాపతి, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్, ఫయాజ్ బట్ బంగ్లాదేశ్: లిటన్ దాస్, మహ్మద్ నయీమ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మహ్మదుల్లా(కెప్టెన్), అఫిఫ్ హోసేన్, నరుల్ హసన్, మెహిదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. -
T20 World Cup 2021: తొలి వికెట్, తొలి హాఫ్ సెంచరీ.. ఎవరిదో తెలుసా?!
T20 World Cup 2021 Match 1 Interesting Facts: క్రికెట్ ప్రేమికులకు మజాను అందించేందుకు పొట్టి ప్రపంచకప్ టోర్నీ మొదలైపోయింది. ఆదివారం(అక్టోబరు 17) ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్ జరిగింది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా(రౌండ్ 1) గ్రూపు-బిలోని ఒమన్- పపువా న్యూగినియా మధ్య మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమైంది. మెగా ఈవెంట్‌లోని మొదటి మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు.. టీ20 వరల్డ్‌కప్-2021: ►టాస్ గెలిచిన జట్టు- ఒమన్ ►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు- పపువా న్యూగినియా ►తొలి వికెట్- బిలాల్ ఖాన్(ఒమన్)- టోనీ ఉరాను అవుట్ చేశాడు ►తొలి అర్ధ సెంచరీ- అసద్ వాలా(పపువా కెప్టెన్) ►తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- జీషన్ మక్సూద్(ఒమన్ సారథి) 4/20 in four overs 👏 Zeeshan Maqsood, take a bow 🙇#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Y3LidFsqdl — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►తొలి బౌండరీ- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) ►తొలి సిక్సర్-చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) What a shot to hit the first six of the ICC Men's #T20WorldCup 💥 Charles Amini, you beauty 👏https://t.co/SoC9rvdqTu — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►తొలి రనౌట్- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) ►తొలి విజయం సాధించిన జట్టు- ఒమన్ ►అత్యధిక వికెట్లు తీసిన బౌలర్- జీషన్ మక్సూద్(4/20) ►అత్యధిక పరుగులు- జతీందర్ సింగ్(73 నాటౌట్), 7 ఫోర్లు, 4 సిక్సర్లు) Jatinder Singh brings up an explosive half-century 💪#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/ekRVqdiTzz — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన ఆటగాళ్లు- టోనీ ఉరా(0), లెగా సియాకా(0)(పపువా) ►తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించిన పపువాపై 10 వికెట్ల తేడాతో ఒమన్ విజయం. తుది జట్లు: పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా. ఒమన్: జతీందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్ The first wicket of the ICC Men's #T20WorldCup 2021 belonged to Bilal Khan 🔥https://t.co/nA12nCeZkj — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 -
T20 WC: కల నెరవేరింది... భావోద్వేగానికి గురైన ఆటగాళ్లు...
PNG cricketers, support staff break down; ప్రపంచ వేదికపై మెరిసే అద్భుత క్షణాల కోసం ఎదురుచూసిన ఆ జట్టుకు ఎట్టకేలకు అవకాశం లభించింది... ఏళ్ల నాటి కల నేటితో నెరవేరింది. అందుకే మెగా టోర్నీలో తమ జాతీయ గీతం వినిపించగానే భావోద్వేగంతో అందరి కళ్లు చెమర్చాయి. క్రికెట్ పండుగ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగా... ఈ ఈవెంట్‌కు తొలిసారిగా అర్హత సాధించిన పపువా న్యూగినియా జట్టు, సిబ్బంది గురించే ఈ ప్రస్తావన. గ్రూపు-బీలో ఉన్న పపువా న్యూగినియా.. ఆదివారం మొదలైన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఒమన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలుత పపువా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. దీంతో... ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్... పపువాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కెప్టెన్ అసద్ వాలా(56) టోర్నీలో మొదటి అర్ధ శతకం సాధించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 : ఒమన్ జట్టులో హైదరాబాదీ క్రికెటర్.. -
T20 WC Oman Vs PNG: 10 వికెట్ల తేడాతో ఒమన్ ఘన విజయం
T20 World Cup 2021 Oman vs Papua New Guinea: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలోని ఆరంభ మ్యాచ్‌లో ఒమన్ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్ ఇలియాస్ (50), జితేందర్ సింగ్(73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచి వరుస ఓవర్లలో వికెట్లు తీసిన ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్(4)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ►స్కోర్లు: పపువా న్యూగినియా129/9 (20) ఒమన్ 131/0 (13.4) ►ఒమన్ ఓపెనర్లు అర్ధ సెంచరీ దిశగా కొనసాగుతున్నారు. అకిబ్ ఇలియాస్(42), జితేందర్ సింగ్(42) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్ స్కోరు: 88-0. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు ►పపువా న్యూ గినియా విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ ఓపెనర్లు అకిబ్ ఇలియాస్, జితేందర్ సింగ్ మెరుగ్గా ఆడుతున్నారు. ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేయగలిగింది. A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ఒమన్ టార్గెట్ 130 ►టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్‌లో ఒమన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు టోని ఉరా, లెగా సియాకా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రపంచ వేదికపై తొలిసారిగా ఆడే అవకాశం దక్కించుకున్న జట్టు కెప్టెన్ అసద్ (56) అర్ధ సెంచరీతో మెరిశాడు. పపువా ఇన్నింగ్స్‌లో అతడిదే టాప్ స్కోర్. ►పపువా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతోంది. కెప్టెన్ అసద్(56) అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నార్మన్ వనువా(1), ఆ వెంటనే సెసె బా(13)ను ఒమన్ కెప్టెన్ జీషన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఆ తర్వాత కిప్లిన్ డోరిగాను కూడా జీషన్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలో 113 పరుగులు చేసిన పపువా 7 వికెట్లు కోల్పోయింది. ►కొరకాని కొయ్యగా తయారైన అసద్ వాలాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. అసద్ షాట్ ఆడే క్రమంలో జితేందర్ సింగ్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను అవుట్ చేసిన తర్వాత ఒమన్ ప్లేయర్ జితేందర్... టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ►పపువా కెప్టెన్ అసద్ వాలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒమన్ సారథి జీషన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఈ టోర్నీలో మొదటి అర్ధ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఆడే అర్హత సాధించిన పపువా న్యూ గినియాకు మధుర జ్ఞాపకాన్ని మిగిల్చాడు. ►నాలుగు ఫోర్లు, సిక్సర్ బాది 37 పరుగులతో జోరు మీదున్న పపువా బ్యాటర్ అమినీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒమన్ బౌలర్ మహ్మద్ నదీం బౌలింగ్‌లో అసద్ వాలాతో సమన్వయ లోపం కారణంగా వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో పపువా మూడో వికెట కోల్పోయింది. ప్రస్తుతం అసద్ వాలా, సెసె బా క్రీజులో ఉన్నారు. ►ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డా పపువా బ్యాటర్లు అసద్ వాలా, చార్లెస్ అమిని వరుస షాట్లతో అలరిస్తున్నారు. అసద్ 26, అమిని 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►ఆతిథ్య ఒమన్ జట్టుకు శుభారంభం లభించింది. తొలి ఓవర్లోనే ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వికెట్ పడగొట్టాడు. పపువా ఓపెనర్ టోనీ ఉరాను బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ లెగా సియాకాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పపువా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ అమిని క్రీజులో ఉన్నారు. Updates: పపువా న్యూగినియా జాతీయ గీతాలాపన అనంతరం... ఆతిథ్య ఒమన్ గీతాలాపన. తుది జట్లు: పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా. ఒమన్: జితేందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్ మస్కట్: మరో మహా క్రికెట్ సంగ్రామానికి తెర లేచింది. ఐదేళ్ల విరామం తర్వాత ఒమన్ వేదికగా పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఆరంభమైంది. గ్రూప్- బీలోని ఆతిథ్య ఒమన్- పపువా న్యూగినియా మధ్య తొలి మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
T20 World Cup 2021: పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్.. ఇతర వివరాలు
ICC T20 World Cup 2021: మరికొన్ని గంటల్లో మరో క్రికెట్ పండుగ మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్లోని మజా పంచేందుకు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ మన ముందుకు రానుంది. అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్, జట్లు, సమయ పట్టిక, వేదిక తదితర అంశాల గురించి పరిశీలిద్దాం. 16 జట్లు టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాలాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఒమన్, పపువా న్యూ గినియా, నమీబియా మెగా టోర్నీలో భాగం కానున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 4 స్థానాల కోసం పోటీ ►సూపర్ 12లో భాగంగా ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల కోసం 8 జట్లు పోటీపడనున్నాయి. ►గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. ప్రతి గ్రూపులో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. సూపర్ 12లో ఉన్న జట్లు ►గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్- ఏ(A1) టాపర్, గ్రూప్-బీ(B2)లోని రెండో జట్టు ఉంటాయి. ►గ్రూప్-2లో టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, A2, B1 ఉంటాయి. ►ప్లేఆఫ్ చేరుకున్న ఇరు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్లో తలపడతాయి. ►మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలు, రాత్రి 7:30 నిమిషాలకు మొదలవుతాయి. మ్యాచ్ నెంబర్ తేదీ మ్యాచ్ సమయం వేదిక స్టేజ్ 1, అక్టోబరు 17 ఒమన్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 2 అక్టోబరు 17 బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్- 1 3 అక్టోబరు 18 ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్- 1 4 అక్టోబరు 18 శ్రీలంక వర్సెస్ నమీబియా 07:30 అబుదాబిi రౌండ్- 1 5 అక్టోబరు 19 స్కాట్లాండ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 6 అక్టోబరు 19 ఒమన్ వర్సెస్ బంగ్లాదేశ్ 07:30 మస్కట్ రౌండ్- 1 7 అక్టోబరు 20 నమీబియా వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్ 1 8 అక్టోబరు 20 శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ 07:30 అబుదాబి రౌండ్ 1 9 అక్టోబరు 21 బంగ్లాదేశ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్ 1 10 అక్టోబరు 21 ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్ 1 11 అక్టోబరు 22 నమీబియా వర్సెస్ ఐర్లాండ్ 03:30 అబుదాబి రౌండ్ 1 12 అక్టోబరు 22 శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ 07: 30 అబుదాబి రౌండ్ 1 13 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా 03: 30 అబుదాబి సూపర్ 12 14 అక్టోబరు 23 ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ 07:30 అబుదాబి సూపర్ 12 15 అక్టోబరు 24 A1 vs B2 03:30 షార్జా సూపర్ 12 16 అక్టోబరు 24 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 17 అక్టోబరు 25 అఫ్గనిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 18 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ 03:30 దుబాయ్ సూపర్ 12 19 అక్టోబరు 26 పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ 07:30 షార్జా సూపర్ 12 20 అక్టోబరు 27 ఇంగ్లండ్ వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 21 అక్టోబరు 27 B1 వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 22 అక్టోబరు 28 ఆస్ట్రేలియా వర్సెస్ A1 07:30 దుబాయ్ సూపర్ 12 23 అక్టోబరు 29 వెస్టిండీస్ వర్సెస్ B2 03:30 షార్జా సూపర్ 12 24 అక్టోబరు 29 అఫ్గనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 25 అక్టోబరు 30 సౌతాఫ్రికా వర్సెస్ A1 03:30 షార్జా సూపర్ 12 26 అక్టోబరు 30 ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, 07:30 దుబాయ్ సూపర్ 12 27 అక్టోబరు 31 అఫ్గనిస్తాన్ వర్సెస్ A2 03:30 అబుదాబి సూపర్ 12 28 అక్టోబరు 31 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 07:30 దుబాయ్ సూపర్ 12 29 నవంబరు 1 ఇంగ్లండ్ వర్సెస్ A1 07:30 షార్జా సూపర్ 12 30 నవంబరు 2 సౌతాఫ్రికా వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 31 నవంబరు 2 పాకిస్తాన్ వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 32 నవంబరు 3 న్యూజిలాండ్ వర్సెస్ B1 03:30 దుబాయ్ సూపర్ 12 33 నవంబరు 3 ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ 07:30 అబుదాబి సూపర్ 12 34 నవంబరు 4 ఆస్ట్రేలియా వర్సెస్ B2 03:30 దుబాయ్ సూపర్ 12 35 నవంబరు 4 వెస్టిండీస్ వర్సెస్ A1 07:30 అబుదాబి సూపర్ 12 36 నవంబరు 5 న్యూజిలాండ్ వర్సెస్ A2 03:30 షార్జా సూపర్ 12 37 నవంబరు 5 ఇండియా వర్సెస్ B1 07:30 దుబాయ్ సూపర్ 12 38 నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ 03:30 అబుదాబి సూపర్ 12 39 నవంబరు 6 ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా 07:30 షార్జా సూపర్ 12 40 నవంబరు 7 న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ 03:30 అబుదాబి సూపర్ 12 41 నవంబరు 7 పాకిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 42 నవంబరు 8 ఇండియా వర్సెస్ A2 07:30 దుబాయ్ సూపర్ 12 43 నవంబరు 10 సెమీ ఫైనల్-1 07:30 అబుదాబి ప్లే ఆఫ్ 44 నవంబరు 11 సెమీఫైనల్-2 07:30 దుబాయ్ ప్లేఆఫ్ 45 నవంబరు 14 ఫైనల్ 07:30 దుబాయ్ ఫైనల్ చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
ICC Announces T20 World Cup Prize Money: యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) ఆదివారం ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు 12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీ రూపంలో లభిస్తుంది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకి రూ.6 కోట్లు ప్రైజ్‌మనీ అందుతుంది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో రూ.3 కోట్లు(నాలుగు లక్షల డాలర్లు) వరకు వస్తుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్న మొత్తం 16 జట్లు 5.6 మిలియన్ డాలర్లను పంచుకోనున్నాయి. 2016 వరల్డ్‌కప్ వలె సూపర్ 12 దశలో జట్లు గెలిచిన ప్రతి మ్యాచ్‌కు బోనస్ రూపంలో కొంత మొత్తాన్ని ఐసీసీ ఇవ్వనుంది. సూపర్ 12 దశలో మొత్తం 30 మ్యాచులు జరుగుతాయి. గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు రూ.30 లక్షల (40 వేల డాలర్లు) వరకు దక్కనుంది. ఈ రౌండ్ కోసం మొత్తం 12 లక్షల డాలర్లను ఖర్చు పెట్టనున్నట్లు ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. సూపర్ 12 నుంచి ఇంటిముఖం పట్టే జట్లకు 70వేల డాలర్లను ఐసీసీ అందజేయనుంది. దీని కోసం ఐసీసీ మొత్తంగా 560000 డాలర్లను ఖర్చు చేయనుంది. ఇక రౌండ్ వన్‌లో గెలిచిన ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు) దక్కుతాయి. ఇందుకు గాను మొత్తం 4,80,000 డాలర్లను ఐసీసీ కేటాయించింది. ఇదే రౌండ్లో వెనుదిరిగిన ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందజేస్తారు. నమీబియా, నెదర్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఓమన్, పపువా న్యూ గియా, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు రౌండ్ వన్‌లో పోటీ పడబోతున్నాయి. ఇక సూపర్ 12లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడనున్నాయి. చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే... -
ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..!
Cyclone Shaheen Almost Forced Oman To Wave Goodbye To T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌కు ఆతిధ్య దేశమైన ఒమన్‌లో షహీన్ తుఫాను బీభత్సం సృష్టించింది. వేగవంతమైన గాలులు, అతి భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని మస్కట్ సహా చుట్టు పక్క ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఈ ప్రభావం ఇక్కడ జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్‌లపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాను నేపథ్యంలో క్వాలిఫయర్స్ (శ్రీలంక, ఐర్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్, బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్) జట్ల మధ్య జరగాల్సిన 6 రౌండ్-1 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ తాత్కాలికంగా నిలిపేసింది. మరోవైపు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకం యధావిధిగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, క్వాలిఫయర్స్ జట్ల మధ్య రౌండ్-1 మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీలంక, ఐర్లాండ్ జట్లు టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కరోనా నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం 70 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే స్టేడియాల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌తో రసవత్తర పోరు మొదలవుతుంది. ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: ధోని ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఫేర్వెల్ గేమ్ అక్కడే..! -
టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ దూరం
ఢాకా: వచ్చే నెలలో ఒమన్, యూఏఈలలో జరిగే టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో తాను పాల్గొనడంలేదని బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా గత ఐదు నెలలుగా తమీమ్ ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా సీరిస్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మార్గదర్శకాల ప్రకారం, సెప్టెంబర్ 10 లోపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలి. కొన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమీమ్ ఇక్బాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. టి20 ప్రపంచ కప్ జట్టులో నేను ఉండాలని అనుకోవడం లేదని..నా స్థానంలో ఎవరు వచ్చినా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌గా తమీమ్ పేరిట రికార్డు ఉంది. ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్‌లు ఆడి 1,701 పరుగులు చేశాడు. కాగా బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో సూపర్12 కు అర్హత సాధించడానికి గ్రూప్ B లో స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ తో తలపడనుంది. చదవండి: పాల్ స్టిర్లింగ్ మెరుపు సెంచరీ.. ఐర్లాండ్ ఘనవిజయం -
ఒమన్ పొమ్మంటోంది!
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికులకు అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించిన ఒమన్ దేశం.. ఇప్పుడు వారిని వదిలించుకుంటోంది. స్వదే శీయులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బయటవారిని సాగనంపుతోంది. దీంతో వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టా డుతోంది. దీంతో అక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి, వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని ఒమన్ నిర్ణయించింది. ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో ఒమనీయులకు పెద్దపీట వేశారు. అలాగే, చిన్న, మధ్య తరహా వాహనాల డ్రైవింగ్‌లోనూ తమ ప్రజలకు అవకాశం కల్పిస్తూ, విదేశీ డ్రైవర్ల లైసెన్స్‌ల రెన్యూవల్‌ను నిలిపి వేశారు. దీనికి తోడు ప్రైవేటు రంగంలోనూ ఒమన్ పౌరులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణ కార్మికులకు పెద్ద దెబ్బ.. ఒమన్ నిర్ణయం తెలంగాణ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒమన్‌లో ఇప్పటివరకు ఉపాధి పొందిన విదేశీ వలస కార్మికులలో భారత్‌కు చెందిన వలసదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండగా, ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 1.25 లక్షల మంది ఉంటారని అంచనా. తాజా నిర్ణయంతో 80 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని అంచనా. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం .ఒమన్‌లో కొన్ని నెలల నుంచి భారతీయులే కాకుండా ఇతర దేశాల వ్యాపారులు, ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులకు కష్టకాలం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఒమన్‌లో బతకడం కష్టమే. –నరేంద్ర పన్నీరు, ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఒమన్ నుంచి ముగ్గురు మహిళలు రాక
గన్నవరం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు. వీరి విమాన టిక్కెట్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి, కడపకు చెందిన ఒకరికి ప్రయాణం, భోజనం ఖర్చులను కూడా అందించింది. గన్నవరం విమానాశ్రయంలో వీరికి ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఒమన్ వెళ్లి చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించడంతో తొలి విడత ఈ నెల 14న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు ఆస్ట్రేలియా నుంచి రప్పించి మరీ ఎన్నారై అరెస్టు -
వారికి ఒమన్ ప్రభుత్వం శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): ఒమన్ దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీయులు స్వచ్ఛందంగా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి ప్రకటించిన క్షమాభిక్ష గడువును ఆ దేశ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2020 డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల నిలుపుదల నేపథ్యంలో మొదటిసారి ఈ నెల 15 వరకు పొడిగించింది. క్షమాభిక్ష పొందేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరోసారి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ డైరెక్టర్ జనరల్ సేలం బిన్ సయీద్ అల్‌బాడి వెల్లడించారు. గడిచిన నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన క్షమాభిక్షతో ఇప్పటివరకు 12,378 మంది విదేశీయులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.(చదవండి: వీసా లేకుండానే ఒమన్ వెళ్లొచ్చు) ఇదిలా ఉండగా మరో 57,847 మంది క్షమాభిక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు గడువు పెంచడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒమన్‌లో అమలవుతున్న క్షమాభిక్ష వల్ల లబ్ధిపొందే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్షమాభిక్ష పొందిన వారికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి విమాన టికెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు తెలిపారు. -
ఒమన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
సాక్షి, మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ పర్యాటకులకు ఒమన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విజిట్ వీసాతో సంబంధం లేకుండానే ఒమన్‌లో పది రోజులపాటు పర్యటించడానికి అవకాశం కల్పించింది. భారత్‌సహా 103 దేశాల పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో ఒమన్‌లో పర్యటిం చాలంటే నెల లేదా 3 నెలల కాలపరిమితి గల విజిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. విజిట్ వీసా కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అయ్యేది. ఎవరైనా స్పాన్సర్లు ఉంటే విజిట్ వీసా ఉచితంగానే లభించేది. తాజా వెసులుబాటు నేపథ్యంలో ఒమన్‌లో పర్యటించే పర్యాటకులు అక్కడి రాయల్ పోలీసు నిబంధనలను అనుసరించాలి. ఆరోగ్య బీమా, ఒమన్ వచ్చి వెళ్లడానికి విమాన టికెట్లు, బస చేసే హోటల్ వివరాలను ఒమన్ రాయల్ పోలీసులకు అందించాలి. పర్యటన ఆసాంతం పోలీసుల నిఘా ఉంటుంది. -
ఒమన్‌లో వలస కార్మికులకు క్షమాభిక్ష
సాక్షి, జగిత్యాల: ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ఒమన్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది కార్మికులకు ఊరట లభించనుంది. వీసా గడువు ముగిసిన కార్మికులు తమ స్వదేశానికి వెళ్లేందుకు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసి, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారంతా అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించి, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారితో తమ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒమన్ ప్రభు త్వం భావిస్తోంది. దీంతో అలాంటి వారందరికి క్షమాభిక్ష ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. 25 లక్షల మంది వలసదారులు ఒమన్ దేశంలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 25 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. క్షమాభిక్ష ద్వారా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, స్వస్థలాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు అందించి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాలని భారత కార్మికులు కోరుతున్నారు. ఉచిత విమాన సదుపాయం కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఒమన్–తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ సభ్యుడు నరేంద్ర పన్నీర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్లైన్ ఫారం నింపాలి
మస్కట్ : ఒమన్ నుండి భారత్‌కు ప్రయాణించేవారికి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ ప్రకటన జారీ చేసింది. భారత్‌కు విమానాలు తిరిగి ప్రారంభించడం లేదా భారతదేశానికి అత్యవసరంగా ప్రయాణించడానికి ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ ఒమన్‌లోని ప్రవాస భారతీయులు చాలామంది కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. కోవిడ్-19 పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి 14 ఏప్రిల్ 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయులు ఒమన్‌లో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుందని, విమానాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఒమన్ నుండి భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్‌సైట్‌లోని ఈ లింకు ను క్లిక్ చేయాలని పేర్కొంది. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం డేటా (సమాచార) సేకరణ కోసం మాత్రమే అని రాయబార కార్యాలయం తెలిపింది. https://docs.google.com/forms/d/e/1FAIpQLSe5f6iMNMfovllq_6q0BRao8MAXKzcnzCfCnWc9ZVLtvBLfKA/viewform భారత్‌కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ ఎయిర్ పోర్టులో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుందని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు భారత్‌కు చేరుకున్నాక, వారిని నేరుగా వారివారి ఇళ్లకు పంపి 'సెల్ఫ్ క్వారంటైన్' (స్వీయ నిర్బంధం) చేయడమా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడమా అనే దానిపై భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు. 'గల్ఫ్ తదితర దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది చిన్న ఇండ్లు కలిగిన పేద, దిగువ మధ్యతరగతి వారే. తమ ఇండ్లలో 'సెల్ఫ్ క్వారంటైన్' కొరకు ప్రత్యేకంగా విడిగా ఉండటానికి సరైన గదులు, వసతి సౌకర్యాలు లేవు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రాలలో తగినన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండవచ్చని' భీరెడ్డి అన్నారు. ఆర్ధిక మాంద్యం వలన భవిష్యత్తులో లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ నుండి స్వరాష్ట్రం తెలంగాణాకు వాపస్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రవాసుల పునరావాసం, పునరేకీకరణ కొరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా "గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ" కి రూపకల్పన చేయాలని మంద భీరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్ హౌస్’
మస్కట్ : ఓమాన్లో మస్కట్ లోని ఇండియన్ ఎంబసీలో శుక్రవారం 'ఓపెన్ హౌజ్' అనే అనే బహిరంగ సామాజిక సమావేశం (ప్రవాసి ప్రజావాణి) నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఓమాన్ లో నివసించే ప్రవాస భారతీయులు మధ్యాహ్నం గం. 2 నుండి గం. 3.30 ని.ల వరకు ఫోన్ నెంబర్ +968 2469 5981 కు కాల్ చేసి ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు ఢిల్లీలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 కు కాల్ చేయవచ్చు. హాట్ లైన్ నెంబర్ +91 11 4050 3090, +91 11 2688 5021, ఢిల్లీలోని విదేశాంగ శాఖ ఈ-మెయిల్ helpline@mea.gov.in కు కూడా సంప్రదించవచ్చు. తెలంగాణకు చెందిన వారు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ +91 94916 13129, గల్ఫ్ వర్కర్స్ జేఏసీ +91 89783 73310 హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించవచ్చు. -
నిరీక్షణకు తెర...
మస్కట్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా పదేళ్ల నిరీక్షణకు భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ తెరదించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఒమన్ ఓపెన్ చాలెంజర్ ప్లస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో శరత్ కమల్ చాంపియన్ అయ్యాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 37 ఏళ్ల శరత్ కమల్ 6–11, 11–8, 12–10, 11–9, 3–11, 17–15తో టాప్ సీడ్ ఫ్రెటాస్ మార్కోస్ (పోర్చుగల్)ను బోల్తా కొట్టించాడు. ఏథెన్స్, బీజింగ్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్ చివరిసారి అంతర్జాతీయస్థాయిలో 2010లో ఈజిప్ట్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత అతను రెండు టోర్నమెంట్లలో (మొరాకో ఓపెన్–2011; ఇండియా ఓపెన్–2017) సెమీఫైనల్ చేరి ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శరత్ 11–13, 11–13, 13–11, 11–9, 13–11, 8–11, 11–7తో కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)పై గెలవగా... మరో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ 11–5, 9–11, 11–6, 11–6, 8–11, 11–13, 3–11తో మార్కోస్ చేతిలో ఓడాడు. -
అప్పులు తీర్చాలని విదేశాలకు వెళ్లాడు కానీ..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఒమన్ దేశంలో ఈ నెల 4న గుండెపోటుతో మృతి చెందిన యువకుడి మృతదేహం గురువారం స్వగ్రామం చేరింది. వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన బత్తుల లక్ష్మీ–రాజయ్య దంపతులకు సతీష్, సుమలత, సుజాత సంతానం. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ పోషణ భారం సతీష్(29)పై పడింది. రూ.5 లక్షలు అప్పు చేసి పెద్ద చెల్లెలు సుమలతకు పెండ్లి చేశాడు. రెండేళ్ల క్రితం రూ.2లక్షలు అప్పు చేసి గల్ఫ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఏడాదిన్నర పాటు పనులు చేయగా ఆరునెలల క్రితం అనారోగ్యానికి గుర రైయ్యాడు. చర్మవ్యాధితో బాధపడుతూ గల్ఫ్‌లో చికిత్స పొందుతున్నాడు. అప్పులు తీర్చలేక, స్వగ్రామానికి రాలేక, మానసికంగా కుంగిపోయిన సతీష్ రెండునెలలుగా రూంలోనే ఒంటరిగా ఉంటూ కాలం గడిపాడు. చర్మవ్యాధి తీవ్రరూపం దాల్చడం, అప్పులతో మానసిక వేదనకు లోనయ్యాడు. ఈ నెల 4న రూంలోనే గుండెనొప్పి రావడంతో మిత్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి మిత్రులు చందాలు పోగుచేసి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. శవపేటిక గ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఒమాన్ ప్రభుత్వం షాక్.. ఉద్యోగాలకు కోత
ఎన్.చంద్రశేఖర్,మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): బల్దియా(మున్సిపాలిటీ)ల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులకు ఒమాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేరుగా నియమించుకున్న కార్మికులను క్రమంగా తొలగిస్తోంది. వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు ఇప్పటికే ఇళ్లకు చేరుకోగా.. దశల వారీగా ఈ ఏడాది చివరి వరకు మరికొందరు ఇంటిముఖం పట్టనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో చేపట్టే పనులను కాంట్రాక్టు కంపెనీలకు అప్పగించాలని ఒమాన్ ప్రభుత్వం మూడేళ్ల కిందనే నిర్ణయించింది. ఇటీవల ఒమాన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన స్థానంలో హైతమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం బల్దియా ప్రైవేటీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బల్దియా పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించగా.. ఆ ఏజెన్సీలు తక్కువ వేతనంపై పనిచేసేవారిని నియమించుకుంటున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కార్మికులు తక్కువ వేతనానికి పని చేసేందుకు ముందుకు రావడంతో వారినే పనుల్లోకి తీసుకుంటున్నారు. బల్దియాలో ఇది వరకు పనిచేసిన మన కార్మికులు కాంట్రాక్టు ఏజెన్సీలను ఆశ్రయిస్తే.. తాము ఇచ్చే వేతనానికి అంగీకరిస్తేనే పనిలో చేర్చుకుంటామని చెబుతున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీల కింద పనిచేస్తే శ్రమ దోపిడీకి గురికావాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. ఒమాన్ దేశంలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేసే విదేశీ కార్మికుల్లో 60 శాతం మంది కార్మికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం విశేషం. బల్దియాల ప్రైవేటీకరణతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల సంఖ్య దాదాపు లక్షకు మించి ఉంటుందని అంచనా. ఇందులో బల్దియాల్లో పని చేసే కార్మికులు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వారి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం.. వేతనం కూడా ఆశించిన విధంగా ఉండటంతో మన రాష్ట్రానికి చెందిన ఎంతో మంది ఈ ఉద్యోగాలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. సుమారు 40 ఏళ్ల నుంచి బల్దియా ఉద్యోగాలకు వలసలు కొనసాగుతున్నాయి. కార్మికులు చేసే పనులు ఇవే... మస్కట్‌తో పాటు ఇతర పట్టణాల్లోని మున్సిపాలిటీల్లో మన కార్మికులు గార్డెనింగ్, క్లీనింగ్, విద్యుదీM్దý రణ, రోడ్ల పక్కన ఉన్న చెత్తా చెదారం ఏరివేయడం తదితర పనులను చేసేవారు. అలాగే కార్మికులను వారి నివాసం నుంచి మున్సిపాలిటీల్లోని వివిధ ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేసిన వాహనాలను నడిపే డ్రైవర్లు కూడా మనవారే ఉన్నారు. నిర్ణీత పనివేళలు ఉండటంతో పాటు నెలకు మన కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు వేతనం లభించడంతో ఒమాన్ బల్దియాల్లో పనులకు డిమాండ్ ఏర్పడింది. ఒమాన్ ప్రభుత్వంలోని మున్సిపల్ వ్యవహారాల శాఖనే నేరుగా రిక్రూట్మెంట్ చేయడంతో.. కార్మికులు ఉద్యోగం మానివేస్తే గ్రాట్యూటీ కూడా ఎక్కువగా లభించేది. అలాగే ఏడాదికి నెల రోజులు వేతనంతో కూడిన సెలవులు లభించేవి. ఈ సమయంలో కార్మికులు ఇంటికి వచ్చి వారి కుటుంబాలతో గడిపి వెళ్లేవారు. కొందరు కార్మికులు తమ పనివేళలు ముగిసిన తరువాత ఇతర పనులు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం దక్కేది. ఒమాన్ బల్దియాల్లో వివిధ పనులు చేసే కార్మికులను ఎన్నో ఏళ్ల నుంచి నేరుగా నియమించుకుంటున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికిన అక్కడి ప్రభుత్వం అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి ప్రైవేటీకరణను ముమ్మరం చేసింది. పెరిగిన పనివేళలు బల్దియాల్లో ప్రభుత్వం ద్వారా నియమించబడిన కార్మికులు రోజుకు 8 గంటల పాటు పనిచేసేవారు. కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పుడు పనివేళలను పెంచాయి. ఒక్కో కార్మికుడు రోజుకు 12 గంటల పాటు పనిచేయాలని నిబంధన విధించాయి. గతంలో ఒక్కో కార్మికునికి భారత కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వేతనం లభించగా ఇప్పుడు రూ.20వేలకు మించి చెల్లించడం లేదు. పని వేళలు పెరగడంతో పాటు వేతనం తగ్గడం వల్ల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. స్వరాష్ట్రంలో ఉపాధి చూపాలంటున్న కార్మికులు ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగాలను కోల్పోయి ఇంటి బాట పట్టిన తెలంగాణ వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలోనే ఉపాధి మార్గాలను చూపాలని పలువురు కోరుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బల్దియా వీసాలపై ఉపాధి పొందిన కార్మికులు ఒమాన్ ప్రభుత్వ నిర్ణయంతో ఇంటికి చేరుకుంటుండగా వారికి పునరావాసం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. మూడు రకాల వీసాలు రద్దు.. మున్సిపాలిటీల్లో మన కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒమాన్ ప్రభుత్వం గతంలో జారీచేసిన మూడు రకాల వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా, సెవెన్ బల్దియా వీసా, దివాన్ బల్దియా వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా అంటే పట్టణం పరిధిలోనే పని చేయడం. సెవెన్ బల్దియా అంటే పట్టణ ప్రాంతానికి శివారుల్లో పనిచేయడం. దివాన్ బల్దియా వీసాలు ఉన్నవారు రాజు, మంత్రుల నివాసాల వద్ద పనిచేసేవారు. ఈ మూడు రకాల వీసాలను రద్దు చేసి.. అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంతో కార్మికులకు ఉపాధి దక్కకుండా పోతోంది. ఎనిమిదేళ్లు పనిచేశాను.. మస్కట్ బల్దియాలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశాను. గార్డెనింగ్ పనులను కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పగించడంతో మా వీసాలను రద్దుచేశారు. ఇప్పుడు ఇంటికి చేరుకున్నాం. ఉపాధి కోసం మరో గల్ఫ్ దేశానికి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒమాన్‌లో బల్దియా ప్రైవేటీకరణ కంటే ముందుగానే పరిస్థితి బాగుంది. కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పగించిన తరువాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.– డి.శ్రీకాంత్, మెండోరా,భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) ఉపాధి కోల్పోవడంబాధగా ఉంది.. ఒమాన్ బల్దియాలో పనిచేస్తున్న మాకు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడం బాధగా ఉంది. ఎనిమిది సంవత్సరాలు బల్దియాలో పనిచేశాను. ఇప్పుడు వీసా రద్దుచేసి ఇంటికిపంపించారు. ఇక్కడ ఉపాధి లేకనే గల్ఫ్‌కు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.– రాజేష్, వేంపేట్, మెట్పల్లిమండలం(జగిత్యాల జిల్లా) ప్రభుత్వాలు స్పందించాలి.. ఒమాన్‌లో బల్దియాలో పనిచేసిన కార్మికులు వందల సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణించడంతో కొత్త రాజు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దేశంలో ప్రైవేటీకరణ ఊపందుకుంది.– జి.కృష్ణ, తిప్పాపూర్, వేములవాడమండలం(రాజన్న సిరిసిల్ల జిల్లా) ఏం చేయాలోఅర్థంకావడం లేదు.. స్థానికంగా పని లేకపోవడంతోనే మేము గల్ఫ్ దేశానికి వలస వెళ్లాం. అక్కడ కూడా ప్రైవేటీకరణ వల్ల ఉపాధి కోల్పోయి ఇంటికి చేరుకున్నాం. ఇక్కడ ఏమి చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వం స్పందించి మా పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఏదైనా ఉపాధి చూపాలి. లేకుంటే మరో గల్ఫ్ దేశానికి వెళ్లక తప్పని పరిస్థితి.– ప్రశాంత్, మెండోరా, భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) -
ఒమన్ రాజు మరణం తీరని లోటు..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): అందరికీ మిత్రులమే ఎవరికీ శత్రువులం కాదు అనే నినాదంతో జనరంజక పాలన అందించిన ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్(79) మరణం తమకు తీరనిలోటని ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసులు అభిప్రాయపడ్డారు. ఖబూస్ బిన్ అల్ సయీద్ తమ గుండెల్లో గూడుకట్టుకున్నాడని అతడు మరణించినా జ్ఞాపకాలు మాత్రం తమ మదిలో నిలచిపోతాయని పలువురు తెలంగాణవాసులు చెబుతున్నారు. ఈ నెల 10న ఖబూస్ మరణించగా 11న అధికారిక ప్రకటన వెలువడింది. ఇదేరోజున అతడి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఖబూస్ మరణించిన నుంచి ఒమన్‌లోని ఎంతో మంది తెలంగాణ వలసదారులు ఖబూస్ను కొలుస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానం చాటుకుంటున్నారు. ఖబూస్ చిత్రాలు, పలు సందర్భాల్లో తీసిన వీడియోలుమ వారికి మెసెజ్‌రూపంలో పంపిస్తున్నారు. మన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న సంతాపదినంగా పాటించింది. ఆ రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు మన ప్రభుత్వాలు నిర్వహించలేదు. ముంబై, పుణేలో తన విద్యాభ్యాసం కొనసాగించిన ఖబూస్ బిన్ అల్ సయీద్ 1970లో ఒమన్ పగ్గాలు చేపట్టిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని వలసదారులు వివరించారు. గల్ఫ్ దేశాల్లో వలసదారులను కట్టు బానిసలుగా చూసే దుస్థితి కొనసాగుతోంది. ఒమన్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వలసదారులను తమ సొంత మనుషులుగా చూసే గొప్ప సంప్రదాయానికి బాటలు వేసిన దార్శనికుడు ఖబూస్ బిన్ అల్ సయీద్ అని తెలంగాణవాసులు కీర్తిస్తున్నారు. తాము ఉపాధి కోసం ఇంటికి దూరంగా ఉన్నా సొంత ఇంటిలోనే ఉన్నామనే భావన కలిగిందని, ఇందుకు ఖబూస్ మంచితనం, మానవత్వమే కారణమంటున్నారు. ప్రస్తుతం ఒమాన్‌లో వలస కార్మికులు 1.35 లక్షల మంది ఉంటారని అంచనా.వారికి కష్టంకలగకుండా చూసిన ఖబూస్ లేని లోటు తీరనిదని ప్రవాసులు ఆవేదనవ్యక్తం చేశారు. తట్టుకోలేక పోతున్నాం నేను 25 ఏళ్ల నుంచి ఒమన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తు న్నా. ఒమన్‌లో ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారి సమస్య ఇట్టే పరిష్కారం అయ్యేది. ఖబూస్ మరణించిన వార్త విని తిండి కడుపులోకి పోవడం లేదు. ఖబూస్ మరణించిన రెండో రోజు నుంచి జోరు వర్షం కురుస్తోంది. అంటే ఆకాశం అతడి మృతి పట్ల దుఖిఃస్తుందని అనిపిస్తుంది. ఇలాంటి గొప్ప మానవత్వవాది మరణించడం మాకు మింగుడుపడడం లేదు. ఈ బాధ నుంచి ఎలా బయటపడతామో అర్థం కావడం లేదు. – రిటా, ప్రొఫెసర్, ఒమన్ సొంత మనిషిని కోల్పోయినట్లు ఉంది ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణిస్తే అందరికీ సొంత మనిషిని కోల్పోయినట్లు బాధ కలుగుతోంది. ఇలాంటి మానవతావాది, గొప్ప దార్శనికుడిని కోల్పోవడం ప్రధానంగా వలసదారులకు తీరని లోటు. ఒమన్ పాలనను అభివృద్ధి పథంలో నడిపించడమే కాదు ప్రజలను సొంత బిడ్డలుగా చూసుకున్న రాజు మరణించడం తీరని లోటు. ఖబూస్ మరణించినా అతడి జ్ఞాపకాలు మాత్రం అందరి మదిలో నిలిచిపోతాయి – నరేంద్ర పన్నీరు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఒమన్ గొప్ప నాయకుడిని కోల్పోయాం ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణం ఒక్క ఒమన్‌కే కాదు ఎన్నో దేశాలకు తీరని లోటు. గొప్ప నాయకుడిని కోల్పోయాం. వలసదారులకు ప్రధానంగా భారతీయులకు ఖబూస్ ఎంతో అభిమాన నాయకుడు. ఒమన్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత ఖబూస్‌కు దక్కుతుంది. ఖబూస్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం. ఇలాంటి పాలకుడు మళ్లీ పుడుతాడా అనిపిస్తుంది. – గణేశ్ గుండేటి, ఒమన్ తెలంగాణ సమితి కన్వీనర్ -
ఒమన్ సుల్తాన్ కన్నుమూత
-
ఒమన్ సుల్తాన్ కన్నుమూత
దుబాయ్: మధ్య ప్రాచ్యంలో కీలక నేతగా ఎదిగిన ఒమన్ సుల్తాన్ ఖాబూస్ బిన్ సైద్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా బెల్జియంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించినట్లు తెలిపింది. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా బ్రిటీష్ పాలన నుంచి శాంతియుతంగా అధికారం చేపట్టిన ఖాబూస్.. దాదాపు 50 ఏళ్ల పాటు దేశ పాలకుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1970 నుంచి మరణించే వరకు సుదీర్ఘ కాలంపాటు సుల్తాన్‌గా వ్యవహరించారు. అయితే ఆయనకు సంతానం లేకపోవడంతో ప్రస్తుత పాలకుడిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో ఖాబూస్ వారసుడి ప్రకటనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒమన్ సైన్యాధికారులు.. ఆయన కుటుంబానికి విఙ్ఞప్తి చేశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత.. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా... పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సింహాసనాన్ని అధిష్టంచబోయే వ్యక్తి గురించి ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా రాచ కుటుంబం ఈ బాధ్యతను తీసుకోనట్లయితే.. ఒమన్ నిబంధనల ప్రకారం... మిలిటరీ, భద్రతా అధికారులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలిసి పాలకుడిగా తమకు నచ్చిన వ్యక్తిని రహస్య పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఖాబూస్ ముగ్గురు కజిన్లు.. అసద్, షీహాబ్, హైతం బిన్ తారిఖ్ అల్- సైద్లలో ఎవరో ఒకరికి సింహాసనం దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 2017లో ఉప ప్రధానిగా అసద్ బిన్ తారీఖ్‌ను ఎంపిక చేస్తూ.. అతడి పేరిట ఖాబూస్ రాయల్ డిక్రీపై సంతకం చేసినందున ఆయననే వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని సీటెల్‌కు చెందిన రచయిత(గల్ఫ్ రాజ్యాల రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారు)క్రిస్టేన్ ఉల్రిచ్సేన్ అన్నారు. నలభైతొమ్మిదిన్నరేళ్ల ఖాబూస్ పాలనను కొనసాగించే సత్తా అసద్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఒమన్ పాలకుడు మరణించడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఖాబూస్.. అమెరికా- ఇరాన్‌లతో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదరడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇరు దేశాల అధినేతలతో మైత్రితో మెలిగేవారు. (అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు) -
జీతం అడిగితే.. గెంటేశారు!
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా): ఇప్పటి వరకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించిన ఆ కంపెనీ ఇప్పుడు కార్మికుల తగ్గిం పు చర్యలు చేపడుతోంది. ఒమాన్ రాజధాని మస్కట్‌లో రేడియేటర్లు తయారు చేసే డాల్ఫిన్ కంపెనీ ఎంతో మంది విదేశీయులకు వీసాలు జారీచేసి ఉపాధి కల్పించింది. కార్మికులకు, ఉద్యోగులకు వారి పనినిబట్టి నెలకు 150 రియాళ్ల నుంచి 450 రియాళ్ల వరకు వేతనం చెల్లించడానికి అంగీకరించింది. దీంతో తెలం గాణ జిల్లాలకు చెందిన కొందరు టెక్నీషియన్లు రూ.60 వేల నుంచి రూ.70 వేలను వీసాల కోసం చెల్లించారు. ఒమాన్‌లో వాడీకబీర్, గాలా శాఖలలో పని కల్పించింది. మొదట్లో సక్రమంగా వేతనం.. కంపెనీలో పనికి కుదిరిన తరువాత ప్రతి నెలా సక్రమంగా వేతనం ఇచ్చిన యాజమాన్యం ఆ తరువాత మూడు, నాలుగు నెలకు ఒకసారి వేతనం ఇచ్చింది. దీనిపై ప్రశ్నించిన కార్మికులను ఇబ్బందులకు గురిచేసిందని పలువురు ఆరోపించారు. అలాగే కార్మికులకు ఉన్న వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూలీలు చేసే పనిని కూడా తమకు అప్పగిస్తున్నారని పలువురు తెలంగాణకు చెందిన కార్మికులు చెప్పారు. కంపెనీ నిర్వహణ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. సరిగా పనిలేకపోవడం, వేతనం ఆశించిన విధంగా చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్తామని అంటే.. మొదటగా వీసాకు చెల్లించిన ఖర్చులన్నీ తిరిగి చెల్లించి వెళ్లిపోవాలని చెప్పారని వెల్లడించారు. వీసా ఒప్పందం ప్రకారం ఇంటికి వెళ్లే సమయంలో ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా కంపెనీ యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో తాము ఆర్థిక భారం భరించామని కార్మికులు తెలిపారు. కంపెనీ నుంచి ఇంటికి వచ్చినందుకు డాల్ఫిన్ కంపెనీ యాజమాన్యానికి రూ.60వేల వరకు జరిమానా చెల్లించడంతో పాటు విమాన చార్జీలు సొంతంగానే పెట్టుకున్నామన్నారు. ఇప్పటికి కొంత మంది కార్మికులు కంపెనీ యాజమాన్యం సరైన వసతి, భోజనం అందించక పోవడంతో కార్మికులు ఎంతో అవస్థలు పడుతున్నారని వివరించారు. కాగా గడు వుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం కాగా గడువుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం రెండు సంవత్స రాల పాటు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉండదు. బలవంతంగా పంపించారు ఒమాన్‌లోని డాల్ఫిన్ కంపెనీ యాజమాన్యం మమ్మల్ని బలవంతంగా గెంటేసింది. టెక్నికల్‌గా ఎంతో అనుభవం ఉన్న వారిని సాంకేతిక పనులపై వినియోగించుకోకుండా కార్మికులుగా ఉపయోగించుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇంటికి వెళ్లిపోవాలన్నారు. అంతేకాకుండా మా నుంచి బలవంతంగా జరిమానా వసూలు చేశారు. కంపెనీ యాజమాన్యంపై ఇండియన్ ఎంబసీలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. కంపెనీపై ఒమాన్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా మన విదేశాంగ శాఖ ఒత్తిడి తీసుకురావాలి. – మల్లూరి భూమన్న,పాలెం (నిజామాబాద్ జిల్లా) మాకు అన్యాయం చేశారు.. ఒమాన్‌లోని డాల్ఫిన్ కంపెనీ మాకు అన్యాయం చేసింది. కంపెనీ తీరు సరిగా లేదు. కంపెనీపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జిల్లాల కార్మికులను వంచించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇళ్లకు చేరుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.– ద్యావల లింగన్న,కొత్తపేట్ (జగిత్యాల జిల్లా) -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతీవారం ‘సాక్షి’ జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన ఈ పేజీ 22 నెలలుగా.. ఈ సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 15 జూన్ 2018 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలపై, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమన్ రాజధాని మస్కట్‌లో 4 అక్టోబర్ 2019న నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా 83 వారాల పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం సంతోషం. ‘మైగ్రేంట్ ఫోరం ఇన్ ఏసియా’ సభ్య సంస్థ అయిన ‘ఎమిగ్రేంట్స్ వెల్ఫేర్ ఫోరం’ తెలంగాణ వలసల చరిత్రలతో ఈ ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం గుర్తుండిపోయే ఘట్టం అని చెప్పవచ్చు. -
గల్ఫ్‌లో శ్రమ దోపిడీ
సాక్షి, కామారెడ్డి: నాలుగురాళ్లు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆశతో గల్ఫ్‌బాట పట్టారు. కంపెనీ వీసా పేరుమీద పని దొరుకుతుందని తెలియడంతో రూ.లక్షలు పోసి దేశం కాని దేశానికి వెళ్లారు. మొదట్లో అక్కడ అంతా బాగానే గడిచింది. కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా పెరిగిపోయి జీతాలు పెరిగిపోయాయి. ఏడాదికిపైగా జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిలువునా దోపిడీకి గురైన తర్వాత చేసేదేమి లేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుప్పెడు దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని ఇళ్లకు తిరిగివచ్చారు. ఒమన్ దేశం నుంచి మొత్తం 13 మంది గల్ఫ్ కార్మికులు గురువారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో దిగారు. వీరిలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్మికులు. వీరిలో ఐదుగురు కామారెడ్డి జిల్లాకు చెందినవారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బుర్రస్వామిగౌడ్, గంగావత్ చందర్, మాచారెడ్డి మండలం ఫరీదుపేటకు చెందిన అబ్దూల్ మాజీద్, కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన రవి, చిన్నమల్లారెడ్డికి చెందిన పంపరి గోపాల్ ఉన్నారు. రూ.లక్షల్లో నష్టపోయారు.. జిల్లాకు చెందిన కార్మికులు కంపెనీ వీసాపై ఓమన్ దేశంలోని మస్కట్‌లో హసన్ జుమాబాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో పని చేసేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లారు. ఆ సమయంలో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు వీసాలు, టిక్కెట్ల పేరిట చెల్లించుకున్నారు. మొదట కొంతకాలం జీతాలు సక్రమంగానే ఇచ్చిన కంపెనీ ఏడాది కాలంగా జీతాలు సక్రమంగా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష 50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు రావాల్సి ఉంది. జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లాయర్‌ను సంప్రదించి కంపెనీ మీద కేసు వేశారు. ఇండియన్ ఎంబసిని కూడా ఆశ్రయించారు. ఎవరూ సరిగ్గా పట్టించుకోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీ ప్రతినిధులను గట్టిగా నిలదీస్తే బెదిరింపులు, జైల్లో పెట్టిస్తామని భయపెట్టేవారని తెలిపారు. గత ఫిబ్రవరి నుంచి పనులకు హాజరుకాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేక తిండికి కూడా కష్టంగా మారింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారు నివాసం ఉండే క్యాంపుల వద్దకు భోజనం తీసుకువచ్చి పెట్టేవారని బాధితులు చెబుతున్నారు. దాతల సహకారంతో స్వదేశానికి.. కంపెనీ మోసంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించారు. వారు సహకారం అందించి అక్కడి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి స్వస్థలాలు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఓమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సామాజిక సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని అక్కడి క్యాంపులో కలుసుకుని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.500 అందజేసినట్లు స్వస్థలాలకు చేరిన కార్మికులు తెలిపారు. మస్కట్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 13 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ విభాగం పక్షాన ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్ సిబ్బంది సహాయం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల సంఘం ప్రతినిధులు కోటపాటి నర్సింహానాయుడు, సురేందర్సింగ్ ఠాకూర్ బాధితులను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అష్టకష్టాలు పడ్డాం... మొత్తం 45 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు మా కంపెనీలో పనిచేసేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 2.50 లక్షల వరకు సదరు కంపెనీ నుంచి జీతాలు రావాల్సి ఉంది. ఏడాదిగా ఇవ్వలేదు. అడిగితే జైల్లో పెడుతా మన్నారు. పని మానేశాక ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంబసి వారు కూడా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి వచ్చాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. –అబ్దుల్ మాజిద్, ఫరీదుపేట, మాచారెడ్డి మండలం. -
ఒమాన్‌లో ఏడాదిగా జీతాలు ఇవ్వని కంపెనీ
ఒమాన్‌లోని మస్కట్‌లో హాసన్ జుమా బాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో తెలంగాణకు చెందిన కార్మికులకు ఏడాదికాలంగా వేతనాలు ఇవ్వనందున ఎడారిలో అష్టకష్టాలు పడుతున్నారు. వీరు ఆర్థిక ఇబ్బందులతోనే మస్కట్ నుండి హైదరాబాద్‌కు బయలు దేరుతున్న విషయం తెలుసుకున్న 'ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్' అనే సామాజిక సేవా సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని లేబర్ క్యాంపులో కలుసుకొని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ. 500 నగదు సహాయం అందజేశారు. వీరిలో 11 మంది తెలంగాణ వారు కాగా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ విమానాశ్రయానికి గురువారం చేరుకున్నారు. ఈ సందర్బంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ... వేతన బకాయిల కోసం న్యాయపోరాటానికి ఇండియన్ ఎంబసీ కృషి చేస్తుందని, కార్మికులు అధైర్య పడవద్దని అన్నారు. గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చిన కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్రతో పాటు సంస్థ సభ్యులు మంచికట్ల కుమార్, వడ్ల గంగాధర్, బొక్కెన దేవేందర్ లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన గనిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒక్కొక్క కార్మికునికి రూ.1 లక్షా 50 వేల నుండి రూ. 2 లక్షల 50 వేల వరకు జీతం బకాయిలు రావాల్సి ఉన్నాయని, తెలంగాణకు చెందిన 45 మంది కార్మికులకు కంపెనీ యాజమాన్యం రూ. ఒక కోటి వరకు బాకీ పడిందని అన్నారు. ఎడారిలో ఒక్కొక్క చెమటచుక్క ఒక్క రూపాయితో సమానమని, తమ కష్టార్జితాన్ని మన భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...
గువాహటి: చివరి నిమిషాల్లో అలసత్వం ప్రదర్శించిన భారత డిఫెండర్లు భారత్‌కు అద్భుత విజయాన్ని దూరం చేశారు. 81వ నిమిషం వరకు 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి 9 నిమిషాల్లో ప్రత్యర్థి ముందు తలవంచింది. దీంతో ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో గురువారం జరిగిన ‘ఫిఫా’ వరల్డ్ కప్–2022 రెండో అంచె అర్హత మ్యాచ్‌లో భారత్ 1–2తో ఒమన్ చేతిలో ఓడింది. ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ రెండు గోల్స్ (82, 90వ నిమిషాల్లో) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్ తరఫున సారథి సునీల్ ఛెత్రీ 24వ నిమిషంలో గోల్ చేశాడు. ఆరంభంలో మెరిశారు... చివర్లోతలవంచారు ర్యాంకింగ్స్‌లో తన కంటే మెరుగైన దేశంతో ఆడుతున్నా భారత్ అది ఎక్కడా కనిపించకుండా ఆడింది. మొదటి నిమిషం నుంచే బంతిపై పూర్తి నియంత్రణతో... ప్రత్యర్థికి బంతిని చిక్కనివ్వకుండా కళాత్మక పాస్‌లతో అదరగొట్టింది. 15వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని భారత ఆటగాడు ఉదంత సింగ్ జారవిడిచాడు. సునీల్ ఛెత్రీ అందించిన పాస్‌ను అందుకున్న అతను ప్రత్యర్థి రక్షణశ్రేణిని, కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. కానీ అది గోల్‌పోస్టు బార్‌ను తగిలి దూరంగా పడటంతో భారత్ ఖాతా తెరవలేదు. అయితే 24వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా బ్రెండన్ ఫెర్నాండెజ్ అందించిన పాస్‌ను అందుకున్న ఛెత్రీ ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రత్యర్థి గోల్ పోస్టులోకి పంపి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో 22 వేల మంది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. అనంతరం దూకుడు పెంచిన ఒమన్ భారత గోల్ పోస్టుపైకి పదేపదే దాడులు చేసింది. 43వ నిమిషంలో ఒమన్ ఆటగాడు అహ్మద్ కనో కొట్టిన హెడర్‌ను భారత గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగం చివర్లో భారత ఢిపెండర్ల నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకున్న ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ 82వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మరో 7 నిమిషాల అనంతరం రబియా భారత గోల్ కీపర్‌కు దొరక్కుండా కళ్లు చెదిరే షాట్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపి ఒమన్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. -
ఉపాధి వేటలో విజేత
గల్ఫ్ డెస్క్: ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూనే సేవా రంగంలోనూ రాణిస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నరేంద్ర పన్నీరు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన తండ్రి ఎల్లయ్య బాటలోనే గల్ఫ్‌కు పయనమయ్యాడు. గల్ఫ్ దేశాల్లో టెలికం రంగం ప్రైవేటీకరణ ఆరంభమైన మొదట్లోనే సర్వీస్ ప్రొవైడర్‌గా సబ్ కాంట్రాక్టును దక్కించుకున్న ఎల్లయ్య తక్కువ సమయంలోనే ఖతార్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. టెలికం రంగంలో ఉపాధి పొందడానికి గల్ఫ్ దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఎల్లయ్య తన కుమారునికి అదే రంగంలో శిక్షణ ఇప్పించి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఖతార్ మంత్రితో తండ్రికి స్నేహం.. నరేందర్ తండ్రి ఎల్లయ్య ఉపాధి కోసం ఖతార్‌కు 1980లో వెళ్లాడు. అక్కడ ఆయన వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. బట్టలు కుట్టి అమ్ముతున్న ఎల్లయ్య వద్దకు అప్పట్లో ఖతార్ సమాచార శాఖ మంత్రి వచ్చి వెళ్లేవారు. 1984లో ఖతర్ టెలికం రంగాన్ని ప్రైవేటీకరించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో సర్వీస్ ప్రొవైడర్(కాంట్రాక్టర్)ల సేవలు అవసరం అయ్యాయి. మంత్రి ప్రోత్సాహంతో ఎల్లయ్య కొత్తగా టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆయన 2010 వరకు ఖతార్‌లో టెలికం వ్యాపారాన్ని కొనసాగించారు. ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం.. ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫైబర్ టెక్నాలజీని పూర్తిచేసిన నరేంద్ర మొదట ఉపాధి కోసం టెలికం రంగంలో పనిచేశారు. అయితే ఇక్కడ టెలికం రంగంలో పనిచేస్తే వేతనాలు తక్కువగా ఉండటంతో నరేందర్ ఖతార్‌లో ఉన్న తండ్రి వద్దకు 2002లో వెళ్లారు. తండ్రికి సొంతంగా వ్యాపారం ఉన్నా నరేందర్ మాత్రం ఖతార్‌లోని ఒరిడో అనే టెలికం కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 2012లో స్వదేశానికి తిరిగివచ్చిన నరేందర్.. ఖతార్ కంటే ఒమాన్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించి 2013లో ఒమాన్‌కు వెళ్లి అక్కడ టెలికం వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నరేందర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒమాన్‌లోని అల్ కువైర్ పట్టణంలో టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. సేవా కార్యక్రమాలు.. నరేంద్ర ఒమాన్‌లో వ్యాపారం నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి చేయూతనందిస్తున్నారు. ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సంస్థను ఆరంభించి ఆ సంస్థ ద్వారా ఖల్లివెల్లి కార్మికులకు స్వదేశానికి వెళ్లడానికి టిక్కెట్లను సమకూర్చడం, ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి పంపించడం, కంపెనీ యజమానుల చేతుల్లో మోసపోయిన వారికి న్యాయ సహాయం అందించడం తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒమాన్‌లోని అధికారులతో ఉన్న సంబంధాలతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకు సహాయ సహకారాలను నరేంద్ర అందిస్తున్నారు. కళలు, సాహస క్రీడలు.. ఒక వైపు వ్యాపారం, మరో వైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న నరేందర్ సమయం చిక్కినప్పుడు కళలు, సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ జానపద గాయకుడైన నరేంద్ర ఉత్సాహవంతులైన వారిని గుర్తించి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ జానపద గీతాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలపించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాలను, అంతర్జాతీయ యోగా దినోత్సవాలను కూడా ఒమాన్‌లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కళల పట్ల ఎంత మక్కువ చూపుతున్నాడో.. సాహస క్రీడల పట్ల అంతే ఆసక్తిని కనబరుస్తున్నారు. స్విమ్మింగ్‌తో పాటు పారాగ్లైడింగ్ లాంటి సాహస క్రీడలో నరేందర్ ప్రత్యేకతే వేరు. పారాగ్లైడింగ్‌లో కమర్షియల్ లైసెన్స్ పొంది ఇటీవలే 3,700 ఫీట్ల ఎత్తు నుంచి దూకి తన సాహసాన్ని చాటాడు. నాన్నే గురువు ఒమాన్‌లో సొంతంగా టెలికం వ్యాపారం నిర్వహించడానికి నాకు మా నాన్నే మార్గదర్శి. నాన్న చెప్పినట్లు టెలికం రంగాన్ని ఎంచుకున్నా. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా స్ఫూర్తి మా నాన్ననే. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మన సహాయం కోసం ఎదురు చూసేవారికి కచ్చితంగా తోడుగా ఉండాలని నాన్న ఎప్పుడు చెబుతుండేవారు. అందువల్లే సేవా కార్యక్రమాలను బాధ్యతగా కొనసాగిస్తున్నా.– నరేంద్ర పన్నీరు -
ఒమన్‌లో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
గల్ఫ్ డెస్క్: ఒమన్‌లో అంతర్జాతీయ ఐదవ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి మన రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మస్కట్‌లోని ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితమే. ఒమన్‌లో ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. యోగాకు ఉన్న ప్రత్యేకత వల్ల కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
ఒమన్ వైపు ‘వాయు’ గమనం
అహ్మదాబాద్: గుజరాత్‌ను భయపెట్టిన ‘వాయు’ తుపాను తన దిశను మార్చుకుంది. అరేబియా సముద్రంలో అల్లకల్లోలం రేపుతున్న ఈ తుపాను ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. అయినప్పటికీ, గుజరాత్ తీరం వెంబడి వర్షాలు, గాలుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ‘వాయు’ తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే మూడు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ‘వాయు’ గమనం మార్చుకున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపినప్పటికీ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించినట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పాఠశాలలు శుక్రవారం కూడా మూసే ఉంటాయని ప్రకటించారు. ‘వాయు’ దిశ మారినప్పటికీ సౌరాష్ట్ర తీరం వెంబడి రాగల 24 గంటల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వాయు తుపాను ప్రభావం తొలగిపోయినట్లు భావించలేమని అధికార వర్గాలు చెప్పాయి. వాయు ప్రభావంతో రాష్ట్రంలో ఎటువంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపాయి. పోర్బందర్లోని 150 ఏళ్ల నాటి భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం తీవ్ర గాలులు, భారీవర్షం ధాటికి కుప్పకూలిందని వెల్లడించాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ 86 రైళ్లను రద్దు చేసి, 37 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించింది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 12కు చేరిన భారత మృతులు
దుబాయి : దుబాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భారతీయుల సంఖ్య 12కు పెరిగింది. ఒమన్ నుంచి దుబాయికి వెళుతున్న బస్సు అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో 12 మంది భారతీయులేనని దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు. మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయ్శంకర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. Deeply grieved by the unfortunate bus accident in Dubai that has claimed 12 Indian lives. My sincere condolences to the families. Our Consulate @cgidubai is extending all help. https://t.co/wh2PV8sdMj — Dr. S. Jaishankar (@DrSJaishankar) June 7, 2019 -
దుబాయిలో 8 మంది భారతీయుల మృతి
దుబాయి: యూఏఈలోని దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి వస్తుంగడగా ఈ ఘటన చోటుచేసుకుంది. 1/2) We are sorry to inform that as per local authorities and relatives it is so far confirmed that 8 Indians have passed away in Dubai bus accident. Consulate is in touch with relatives of some of the deceased & awaits further details for others to inform their families. — India in Dubai (@cgidubai) June 6, 2019 2/2) The names of those who have passed away are: Mr. Rajagopalan, Mr. Feroz Khan Pathan, Mrs. Reshma Feroz Khan Pathan, Mr. Deepak Kumar, Mr. Jamaludeen Arakkaveettil, Mr. Kiran Johnny, Mr. Vasudev, Mr. Tilakram Jawahar Thakur. — India in Dubai (@cgidubai) June 6, 2019 అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బస్సు బోల్తాపడింది. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత్‌కు చెందిన రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీటిల్, కిరన్ జానీ, వాసుదేవ్, తిలక్‌రామ్ జవహార్ ఠాకూర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్ అధికారులు తెలిపారు. #هام | في تمام الساعة 5:40 من مساء اليوم، وقع #حادث مروري بليغ لباص مواصلات على متنه 31 راكب يحمل لوحة أرقام سلطنة عمان على شارع الشيخ محمد بن زايد وتحديدا (مخرج الراشدية) الى محطة المترو نتج عنه وفاة 15 راكب من جنسيات مختلفة وإصابة 5 أشخاص آخرون بإصابات بليغة. pic.twitter.com/ma5FRPW9OX — Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) June 6, 2019 -
ఒమన్ 24 ఆలౌట్
అల్ అమారత్: ఒమన్ క్రికెట్ జట్టు అరుదైన, చెత్త రికార్డును నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 17.1 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. ఖావర్ అలీ (15) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఆరుగురు బ్యాట్స్‌మెన్ అయితే ఖాతా తెరవలేదు. మిగతా బ్యాట్స్‌మెన్ 2, 2, 1, 1 చొప్పున పరుగులు చేశారు. అనంతరం స్కాట్లాండ్ 3.2 ఓవర్లలో 26 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ వన్డే హోదా లేదు. దీనిని దేశవాళీ వన్డే (లిస్ట్–ఎ) మ్యాచ్‌గానే పరిగణిస్తున్నారు. ఒమన్ చేసిన 24 పరుగులు ఓవరాల్‌గా లిస్ట్ ‘ఎ’లో నాలుగో అత్యల్ప స్కోరుగా నమోదైంది. గతంలో వెస్టిండీస్ అండర్–19 టీమ్ (18 పరుగులు), సరకెన్స్ సీసీ (19), మిడిల్‌ఎసెక్స్ (23) ఇంతకంటే తక్కువ స్కోర్లు చేశాయి. -
24 పరుగులకే ఆలౌట్
అల్ అమరాట్: లిస్ట్-ఎ క్రికెట్లో మరో చెత్త రికార్డు నమోదైంది. తాజాగా ఒమన్ క్రికెట్ జట్టు మూడు పదుల స్కోరు కూడా చేయకుండానే కుప్పకూలడంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్ జట్టు 17.1 ఓవర్లలోనే 24 పరుగులకు ఆలౌటైంది. ఇందులో ఓపెనర్లు టీకే భండారీ, జతీందర్ సింగ్‌లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరితే, మిగతా ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఖవర్ అలీ(15) ఒక్కడే రెండంకెల స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో రుద్రి స్మిత్, ఆడ్రియన్ నెయిల్‌లు తలో నాలుగు వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించారు. ఇది లిస్ట్-ఎ క్రికెట్లో నాల్గో అత్యల్ప స్కోరుగా రికార్డు అయ్యింది. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యల్ప స్కోరు రికార్దు వెస్టిండీస్ పేరిట ఉంది. 2007లో బార్బోడాస్తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అండర్-19 జట్టు 18 పరుగులకే ఆలౌటైంది. ఇదే నేటికీ లిస్ట్-ఎ క్రికెట్లో అత్యల్ప స్కోరు. తాజా మ్యాచ్‌లో 25 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్ వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలో ఛేదించింది. -
నేడు ఒమన్‌లో ఓపెన్ హౌస్
సాక్షి : ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. ఆ దేశంలో నివసించే ఎన్నారైలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఒమన్‌లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ హెల్పలైన్ నెంబర్ +968 2469 5981 టోల్‌ఫ్రీ నంబర్ 8007 1234కు సంప్రదించవచ్చు. ఎంబసీ ఇ-మెయిల్ cw.muscat@mea.gov.in మరియు inde mbassy.muscar@mea.gov.in ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. -
గల్ఫ్ గోస; ఓ భారతీయురాలి దీనగాథ
సాక్షి, న్యూఢిల్లీ : అరబ్ దేశమైన ఓమన్ రాజధాని మస్కట్ నగరంలో మే నాలుగవ తేదీన ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న 38 ఏళ్ల శీజా దాస్ తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రెండంతస్తుల మేడ మీది నుంచి దూకేశారు. దాంతో ఆమెకు వెన్నుముకతోపాటు రెండు కాళ్లు విరిగాయి. ఎడమ వైపు నడుము నుంచి పాదం వరకు శరీరం పూర్తిగా చచ్చుపడి పోయింది. ఓమన్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను మే 26వ తేదీన భారత్‌లోని కేరళకు పంపించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురం జిల్లా, చిరాయింకీజు గ్రామంలోని చిన్న ఇంటిలో జీవచ్చవంలా రోజులు లెక్కపెడుతోంది. కదలలేని మెదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెకు ఆమె భర్త బిజుమన్ సదాశివన్ సపర్యలు చేస్తున్నారు. శీజా దాస్ ఇంతటి దుస్థితికి కారణమైన ఆమె యజమానురాలి నుంచి మాత్రం ఆమెకు నష్టపరిహారంగా ఒక్క పైసా రాలేదు. అందుకు ప్రస్తుత భారత ప్రభుత్వం కారణమవడం బాధాకరం. నేడు శీజా దాస్‌కు జరిగిన అన్యాయం.. 2015లో తమిళనాడుకు చెందిన 58 ఏళ్ల కస్తూరి మునిరత్నంకు సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఎదురైన దారుణాన్ని గుర్తుచేస్తోంది. అతి తక్కువ డబ్బులకు తనతో అరవచాకిరి చేయిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు యజమాని ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినందుకు 2015, అక్టోబర్ 8వ తేదీన ఆమె కుడిచేతిని ఇంటి యజమాని నరికేశారు. ఈ సంఘటనపై నాడు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వార్త తెల్సిన మరుక్షణమే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆమె అక్టోబర్ 9వ తేదీన తొమ్మిది గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే: ‘గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ కంట్రీస్’గా పిలిచే ఓమన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు పని మనుషులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిలో శీజా దాస్, మునిరత్నంలాంటి బాధితులు కూడా వేలల్లో ఉంటారని అక్కడి భారతీయ సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని, ప్రాణాలకే ముప్పు ముంచు కొస్తోందనే భయంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయరని వారు చెబుతున్నారు. పస్తులు, వీపు దెబ్బలు శీజా దాస్ 2016వ సంవత్సరం నుంచి మస్కట్‌లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిచేస్తున్నారు. అదే యజమాని కింద 2013 నుంచి ఆమె భర్త శివదాసన్ పనిచేస్తుండడంతో తన జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని శీజా భావించారు. ఇద్దరి జీతాల నుంచి కూడ బెట్టుకున్న సొమ్ముతో ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకోవచ్చని వారు కలలుగన్నారు. గత వేసవి సెలవుల్లో వారు తమ ఇద్దరు పిల్లల (13 ఏళ్ల శ్రీరప్, రెండేళ్ల శోభిత్)ను తీసుకొని మస్కట్ వెళ్లారు. ఎంత పనిచేసినా సరిగ్గా పనిచేయడం లేదంటూ ఇంటి యజమానురాలు కర్రతో ఎప్పుడూ శీజా వీపుపై బాదేదట. పస్తులు ఉంచేదట. మే నాలుగవ తేదీన ఏదో సాకుతో చితకబాదడం మొదలు పెట్టిందట. ఎంత వేడుకున్నా వదిలి పెట్టలేదట. తరిమి తరిమి కొట్టిందట. ఆ దెబ్బలను తప్పించుకునేందుకు రెండో అంతస్తు మేడ మీదకు పరుగెత్తిందట. అయినా వెంటపడడంతో తప్పించుకునేందుకు మరో మార్గం లేక కిందకు దూకేసిందట. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మస్కట్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారట. మస్కట్‌కు రాకముందు తన భార్య శీజా 48 కిలోల బరువు ఉండేదని, ఆస్పత్రిలో చేరనాటికి ఆమె బరువు 30 కిలోలే ఉందని భర్త శివదాసన్ తెలిపారు. తన భార్యకు నెలకు 50 ఓమన్ రియల్స్ (8,750 రూపాయలు) ఇస్తానన్న హామీతో పనిమనిషిగా ఉద్యోగంలో పెట్టుకున్నారని, యజమాని ప్రతి నెల ఆమె బ్యాంక్ ఖాతాలో ఆ జీతం మొత్తాన్ని జమచేసి మళ్లీ అదే రోజు విత్‌డ్రా చేయించి తీసుకునే వారని ఆయన తెలిపారు (అక్కడ పని మనుషుల జీతాలను తప్పనిసరిగా బ్యాంకుల ద్వారానే చెల్లించాలి). అంతా కలిపి మళ్లీ భారత్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తానని చెప్పేవారని, అనుమానం ఉన్నా చేసేదేమీ లేక ఊరుకున్నామని ఆయన చెప్పారు. తనకు మాత్రం నెలకు 17,500 రూపాయలు వచ్చేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన తన భార్యకు నష్టపరిహారం చెల్లించకపోగా, జీతంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. భారత్‌కు పంపించేందుకు తన భార్య శీజాకు మాత్రమే తమ యజమాని విమాన టిక్కెట్టు కొన్నారని, తనకు, తమ పిల్లలకు కొనలేదని శివదాసన్ తెలిపారు. వీరి పరిస్థితి గురించి ఓమన్‌లో సామాజిక, సాంస్కతి సంస్థగా రిజిస్టర్ అయిన ‘ఇండియన్ సోషల్ క్లబ్’ అధ్యక్షుడు, ‘కేరళ నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డ్’ డైరెక్టరయిన పీఎం జబీర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. ఆమె ఆదేశం మేరకు మస్కట్‌లోని భారతీయ ఎంబసీ జోక్యం చేసుకొని బిజూమన్, ఇద్దరు పిల్లలకు కూడా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసి భారత్‌కు పంపించారు. ఒక్క నయాపైసా కూడా యజమాని నుంచి శీజాకు రాలేదు. చట్టాలు ఏమి చెబుతున్నాయి? విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం కోసం 2011లో విదేశాల్లో భారతీయుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో షరతులు, మార్గదర్శకాలు ఉన్నాయి. భారతీయులను పని మనిషిగా పెట్టుకునే విదేశీ యజమానికి నెలకు కనీసం 2,600 డాలర్ల ఆదాయం ఉండాలి. సదరు యజమాని ఒక్కో పని మనిషికి 2,850 డాలర్ల (దాదాపు రెండు లక్షల రూపాయలు) చొప్పున భారత అంబసీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. దీన్ని అంబసీ సెక్యూరిటీ డిపాజిట్‌గా పరిగణిస్తుంది. యజమాని జీతాలు చెల్లించనప్పుడు, న్యాయపరమైన పోరాటం అవసరమైనప్పుడు, నష్టపరిహారం కోసం బాధితుడికి అంబసీ ఈ సొమ్మును ఖర్చు పెడుతుంది. ఇక నెలకు కనీస జీతాన్ని 280 డాలర్లు (దాదాపు 18,800 రూపాయలు)గా నిర్దేశించింది. అంతేకాకుండా యజమాని ఉచిత భోజన సౌకర్యంతోపాటు ఉచిత వసతి కూడా కల్పించాలని షరతు విధించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుతో మొబైల్ ఫోన్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఏడాదికోసారి భారత్ వచ్చిపోయేందుకు ప్రయాణ ఖర్చులు భరించాలి. 2015లో భారత ప్రభుత్వం ఈమ్రైగ్రేషన్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. పని మనుషులకు సంబంధించిన అన్ని వీసా కార్యకలాపాలు ఈ వెబ్సైట్ ద్వారానే నిర్వహించాలి. నష్టపరిహారం ఎత్తివేశారు విదేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండంతో భారతీయ అంబసీ కోరుతున్న బ్యాంక్ గ్యారంటీ అందుకు కారణం అవుతుందని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో గల్ఫ్‌తోపాటు మొత్తం 18 దేశాల్లో ఈ షరతు ఎత్తివేసింది. పర్యవసానంగా నేడు శీజా దాస్‌కు నష్టపరిహారం అందకుండా పోయింది. ‘ఇంటి కల ఎలాగు చెదిరిపోయింది. నా వైద్యానికి ఉన్నదంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇక నేనా లేవలేను. నేను ఎప్పుడు కన్నుమూసినా ఫర్వాలేదు. కానీ ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత, బరువు నా భర్తపై పడింది. ఎలా నెట్టుకొస్తాడో ఏమో’ అంటూ ఆమె మీడియాతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారతీయ పని మనుషులకు సరైన భద్రత కల్పించాలి. లేకపోతే శీజా లాంటి కథలు వింటూనే ఉంటాం’ అని పీఎం జబీర్ వ్యాఖ్యానించారు. -
ఒమన్, యెమన్లను గడగడలాడిస్తున్న మెకును తుఫాను
-
మతం పేరు దుర్వినియోగాన్ని అరికట్టాలి..
మస్కట్: ఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. మతం పేరును దుర్వినియోగం చేస్తున్న వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఇరుదేశాధినేతలు నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ ఖబూస్ నిర్ణయించారు. ఒమన్ పర్యటనలో భాగంగా సుల్తాన్ ఖబూస్‌తో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్–ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో బలమైన పురోగతికి ఈ పర్యటన తోడ్పడిందని మోదీ పేర్కొన్నారు. అనంతరం మోదీ గల్ఫ్, పశ్చిమాసియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. అనంతరం మస్కట్‌లోని పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించారు. ఉగ్రవాదంపై ప్రత్యేకంగా.. ‘ఇరుదేశాలు ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో, అంతర్జాతీయంగా శాంతినెలకొల్పే ప్రయత్నాల్లో కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిని ఏకాకి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పరస్పర సహకారానికి అంగీకరించాం’ అని ఇరుదేశాధినేతల సంయుక్త ప్రకటన పేర్కొంది. ఒమన్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను సుల్తాన్ ఖబూస్ ప్రశంసించారు. వారి కష్టపడి పనిచేసేతత్వం, నిజాయితీని మరిచిపోలేమన్నారు. 8 ఒప్పందాలు: మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. పౌర, వాణిజ్యపరమైన అంశాల్లో న్యాయ సహకారంపైనా ఒప్పందాలు జరిగాయి. దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందం కూడా ఈ జాబితాలో ఉంది. వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. మధుర స్మృతి ‘భారత్–ఒమన్ దేశాల ప్రజల మధ్యనున్న శతాబ్దాల పురాతనమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన దోహదపడింది. వాణిజ్యం, పెట్టుబడుల బంధాలు సహా అన్నిరంగాల్లోనూ సహకారం మరింత వేగవంతమవనుంది. గౌరవనీయులైన సుల్తాన్ ఖబూస్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆతిథ్యం, స్నేహం.. నా ఒమన్ పర్యటనను మధురస్మృతిగా మార్చేశాయి’ అని పర్యటన ముగింపు సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అనంతరం మస్కట్‌లోని 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ ఖబూస్ మసీదునూ ప్రధాని సందర్శించారు. -
గల్ఫ్‌తో దశాబ్ధాల అనుబంధం
-
దోశ, బీట్రూట్ కబాబ్, పప్పు!
గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం యూఏఈ, ఒమన్లలో బిజీబిజీగా గడిపారు. ఉదయం దుబాయ్‌లోని ఒపెరా హౌజ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. భారత్–యూఏఈ మధ్య శతాబ్దాల నాటి బంధం దృఢమైనదన్నారు. ప్రవాసీల కలల సాకారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం అబుదాబిలో నిర్మించనున్న స్వామినారాయణ్ మందిరానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ప్రారంభోపన్యాసం చేశారు. సాంకేతికతను వికాసానికే వాడాలి తప్ప విధ్వంసానికి కాదని సూచించారు. దుబాయ్ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్‌తో సమావేశమై రక్షణ, వాణిజ్యరంగాల్లో ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై చర్చించారు. అక్కడినుంచి ఒమన్ చేరుకున్న ప్రధాని.. మస్కట్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఒమన్ పురోగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. దుబాయ్/మస్కట్ సైబర్ స్పేస్ దుర్వినియోగం కాకుండా, ఉగ్రవాదుల చేతిలో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించే ఓ నియంత్రణ వ్యవస్థగానే వినియోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో మోదీ ప్రసంగించారు. సైబర్‌స్పేస్‌ను ఉగ్రవాదులు, హ్యాకర్లు దుర్వినియోగం చేస్తున్నారని దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాలనకు సరైన సాంకేతికత తోడైతే సరైన అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత పురోగతిలో సాంకేతికత పాత్రను మోదీ తన ప్రసంగంలో వివరించారు. కృత్రిమ మేధస్సు, నానో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర రంగాల్లో భారత్ త్వరలోనే కీలకస్థానం అందుకోనుందన్నారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘6ఆర్’లు, ‘5ఈ’ల సూత్రంతోనే.. భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘సాంకేతికతతో ప్రకృతిపై పోరాటం చేయటం భవిష్యత్ మానవాళికి ప్రమాదకరం. ప్రకృతితో పోరాటం చేయవద్దు. దాంట్లో మమేకమయ్యే ప్రయత్నం చేయాలి’ అని మోదీ సూచించారు. ‘6ఆర్’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్), ‘5ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు. సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. గల్ఫ్ సహకార మండలి వ్యాపారవేత్తలతోనూ ప్రధాని సమావేశమై ‘నవభారతం’ విజన్‌ను వారితో పంచుకున్నారు. పెట్టుబడులతో భారత్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. ఫ్రెంచ్ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్పీ, కిర్గిజ్స్తాన్ ప్రధాని సపర్ ఇసాకోవ్లతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్–యూఏఈ బంధం దృఢమైంది యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న బంధం అమ్మకపుదారు–కొనుగోలుదారు పరిధికంటే లోతైనది, విస్తృతమైనదని, బలమైనదని మోదీ తెలిపారు. దుబాయ్ ఒపెరా హౌజ్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. దేశం, కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. 30 లక్షల మంది భారతీయులకు యూఏఈ సొంతింటిలా అక్కున చేర్చుకుందన్నారు. ప్రవాసీయుల కలలను నిజం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. ‘ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూల జాబితాలో భారత్ స్థానం చాలా మెరుగుపడింది. ఇంతటితో సంతృప్తి చెందాలనుకోవట్లేదు. దీన్ని మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’ అని అన్నారు. అబుదాబిలో దేవాలయ శంకుస్థాపన అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. బీఏపీఎస్ నారాయణ్ ఆలయానికి ఒపెరా హౌజ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘యూఏఈ పాలకులు భారత్‌పై, భారత సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే ఇక మన పాత్ర నిర్వహణలో ఎలాంటి పొరపాట్లూ ఉండకూడదని ఈ ఆలయ నిర్మాణంతో ముడిపడిఉన్న అందరికీ చెబుతున్నా. మనం ఎవరికీ ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దు. మీనుంచి ఇదే ఆశిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మందిర నిర్మాణానికి స్థలాన్నిచ్చిన అబుదాబి యువరాజుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దోశ, బీట్రూట్ కబాబ్, పప్పు! ప్రధాని నరేంద్ర మోదీ ఆహారంతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలను తినే వ్యక్తి కాదనీ, మాంసాహారాన్ని ముట్టని మోదీ ఎలాంటి శాకాహార వంటలనైనా ఆరగించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆయన ఆహారాన్ని సంజీవ్ కపూర్ తయారుచేస్తున్నారు. దోశ, బీట్రూట్తో చేసిన కబాబ్, పప్పు, అన్నం ఎప్పుడూ మోదీ ప్లేట్లో ఉంటాయని సంజీవ్ పేర్కొన్నారు. ఒక దేశం సంస్కృతీ సంప్రదాయాలను మరో దేశం సులభంగా తెలుసుకునేందుకు ఆహారాన్ని మంచి మార్గంగా మోదీ భావిస్తారన్నారు. వంటకు సంబంధించి మోదీ కొన్ని కొత్త విషయాలను తనకు నేర్పించారని సంజీవ్ చెప్పారు. ఒమన్.. మినీ ఇండియా! యూఏఈ నుంచి రెండ్రోజుల పర్యటనకోసం ప్రధాని ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లో మోదీకి ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ ఫహద్ బిన్ మహమ్మద్ ఘనస్వాగతం పలికారు. అనంతరం సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని ఒమన్ సుల్తాన్ ఖబూస్ స్టేడియంలోని రాయల్ బాక్స్ నుంచి వీక్షించారు. ‘ఒమన్‌లోని 8 లక్షల మంది భారతీయులు.. సౌహార్ద్ర రాయబారులే. ఒమన్ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించారు. అందుకే ఒమన్‌ను చూస్తుంటే మినీ భారత్‌లా అనిపిస్తోంది. ఇరుదేశాల్లో రాజకీయ మార్పులొచ్చినా.. భారత్–ఒమన్ సంబంధాల్లో మాత్రం ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదు’ అని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కుంభకోణాల కారణంగా భారత ప్రతిష్ట మసకబారిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేశారు. పశ్చిమాసియాతో భారత్ సంబంధాల్లో ఇదొక కొత్త శకమన్నారు. తమ ప్రభుత్వ పథకాలను మోదీ వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారందరితో వందేమాతరం అని నినాదాలు చేయించారు. దీంతో స్టేడియం మార్మోగిపోయింది. వాహనంలో తిరుగుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. మస్కట్‌లో మోదీకి స్వాగతం పలుకుతున్న ఒమన్ ఉపప్రధాని ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ -
‘మస్కట్’ ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: చదువు పూర్తయ్యాక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగం చేద్దామనుకున్నవారి ఆశలపై ఒమన్ (మస్కట్) ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, మార్కెటింగ్ తదితర రంగాల్లోని 87 రకాల ఉద్యోగాలకు వీసాలను నిలిపివేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. దీనిని ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చింది. విదేశాల నుంచి వలసలు పెరుగుతుండటం, స్వదేశంలో నిరుద్యోగులు పెరుగు తుండటంతో ఒమన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కున్నట్టు చెబుతున్నారు. దీనిపై మిగతా గల్ఫ్ దేశాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒమన్ నిర్ణయం ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగులకు ఆశనిపాతంగా మారుతోంది. ఉన్నత ఉద్యోగాల కోసం.. గల్ఫ్ దేశాల్లో దాదాపు ఇరవై లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన 4.75 లక్షల మంది గల్ఫ్‌కు వలస వెళ్లినట్లు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో వెల్లడైంది. తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–దుబాయి, అబుదాబీ, షార్జా, రస్ అల్ ఖైమా, అజ్మన్, ఫుజైరా, ఉమల్‌ఖివైన్ ప్రాంతాలు)లోనే రెండు లక్షల మంది తెలంగాణవారున్నారు. వారిలో చాలా మంది భవన నిర్మాణం, ఇతర రంగాల్లో కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. ఇక యూఏఈ తర్వాత ఒమన్ (మస్కట్)కు ఎక్కువ మంది తెలుగువారు ఉపాధి పొందుతున్నారు. అయితే ఒమన్ సంపన్న దేశం కావడం, పర్యాటక రంగం కీలకం కావడంతో హోటళ్లు, ఇంజనీరింగ్, మార్కెటింగ్, హెచ్ఆర్, సేల్స్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ. దీంతో గత పదేళ్లుగా తెలంగాణ యువత ఈ రంగాల్లో ఉద్యోగాల కోసం ఒమన్ బాట పట్టింది. స్వదేశీయులకు ప్రాధాన్యం కోసం విదేశాల నుంచి వలసలు పెరగటంతో ఒమన్‌లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. స్థానికులకు ఉద్యోగాలు అందని పరిస్థితి తలెత్తింది. దీంతో కీలకమైన ఉద్యోగాలు స్వదేశీయులకే చెందాలని ఒమన్ యువత డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీపై ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అన్ని కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు విధిగా స్థానిక నిరుద్యోగులతోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించింది. వీసాలు నిషేధించిన రంగాలివే.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, తమ దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఒమన్ ప్రభుత్వం వీసాలపై నిషేధం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యవృత్తి, మార్కెటింగ్–సేల్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా రంగాల్లోని 87 ఉద్యోగాలకు నిషేధం వర్తించనుంది. చిన్న కంపెనీ అయినా.. ఒమానీలే ‘‘గతంలో ఎక్కడ ఉద్యోగావకాశం ఉన్నా విదేశీయులా, స్వదేశీయులా అని పట్టించుకోకుండా ఒమన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చింది. కానీ కొంతకాలంగా కీలక రంగాల ఉద్యోగాల్లో ఒమనీలే ఉండాలనే డిమాండ్ తలెత్తింది. చిన్నా, పెద్దా అన్ని కంపెనీల్లో ఎక్కువ శాతం స్వదేశస్తులే ఉండేలా నిబంధనలను రూపొందించింది. పది మంది ఉద్యోగులుండే చిన్న హోటల్లో కూడా కనీసం ఆరుగురు స్వదేశస్తులు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తోంది..’’ – ఒమన్‌లో ప్రైవేటు జాబ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రకాశ్ -
ఒక్క సెల్ఫీతో ఇండియన్ సినిమా!
సాక్షి, సినిమా : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటుడిగానే కాదు.. బిజినెస్ మాన్‌గా కూడా సక్సెస్ అయ్యాడన్నది తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ, ఐపీఎల్ జట్టుతోపాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన సౌత్ స్టార్లతో కలిసి ఓ ఈవెంట్లో చేసిన సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ తమ కొత్త బ్రాంచ్‌లను మస్కట్(ఒమన్)లో ప్రారంభించింది. ఈ లాంఛింగ్ కార్యక్రమానికి తారా లోకం కదిలి వచ్చింది. సౌత్‌లో ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని(టాలీవుడ్), శివరాజ్‌కుమార్(శాండల్‌వుడ్), ప్రభు(కోలీవుడ్), మంజువారియర్(మాలీవుడ్)కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్లో ఈ సంస్థకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంబాసిడర్ అన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యకారణాలతో ఆయన ఈ కార్యక్రమానికి గైర్హాజరు కాగా, ఆ లోటును షారూఖ్ తీర్చినట్లయ్యింది. దీంతో సౌత్ స్టార్లు, కింగ్ ఖాన్‌తో దిగిన ఓ సెల్ఫీ వైరల్ అవుతోంది. ఒక్క ఫ్రేమ్‌లో టోటల్ ఇండియన్ సినిమాను చూపించారంటూ ఆ ఫోటో చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు. -
ఒమన్‌లో విషవాయువులతో ముగ్గురు మృతి
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఒమన్ దేశానికి వెళ్లిన ఇద్దరు తెలంగాణ కార్మికులు విషవాయువు ప్రభావంతో మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు కార్మికులు మరణించారు. అందులో ఒకరు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వాసి తిరుమలేశ్ కాగా, మరొకరు జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతానికి చెందిన రమేశ్ అని తెలిసింది. మరో వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిగా గుర్తించారు. ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లిన తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల కార్మికులు అక్కడి షిప్‌యార్డులో ఓడల నుంచి సరుకులను లోడింగ్, అన్లోడింగ్ చేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం ఒడ్డుకు చేరుకున్న షిప్ నుంచి సరుకులను దించేందుకు తిరుమలేశ్ కిందికి దిగగా, విషవాయువు ప్రభావంతో సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని రక్షించాలనే ఉద్దేశంతో రమేశ్ కార్గో షిప్‌లోకి దిగడంతో అతను కూడా సొమ్మసిల్లాడు. వీరిద్దరిని గమనించిన మణి అరుస్తూ కార్గో షిప్‌లోకి వేగంగా వెళ్లడంతో విషవాయువు గుప్పుమని అతనూ కింద పడిపోయాడు. ముగ్గురు కార్మికులు ఒకరి వెనుక మరొకరు సొమ్మసిల్లి పడిపోవడంతో మిగతా కార్మికులు, సేఫ్టీ బృందం గమనించి విషవాయువు వస్తున్న ప్రాంతంలో దాన్ని నిరోధించే మందును స్ప్రే చేశారు. కాగా, సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు కార్మికులను ఆస్పత్రిలోకి తీసుకెళ్లే క్రమంలోనే వారు మరణించారు. కార్గో షిప్ సముద్రంలో ప్రయాణించే సమయంలో ప్రాణాంతకమైన జలచరాలు వచ్చి చేరుతుంటాయి. వీటిని సంహరించడానికి రసాయనాలను షిప్లో చల్లుతారు. కార్గో షిప్ ఒడ్డుకు చేరుకున్న తరువాత రసాయనాలు నింపి ఉన్న అరల తలుపులను గంటపాటు తెరిచి ఉంచాలి. అయితే సేఫ్టీ బృందం ఇదేమీ పట్టించుకోక పోవడంతో కార్మికులు విషవాయువుల బారిన పడి మృత్యువాత పడినట్లు మృతుల సన్నిహితులు కుదురుపాక ప్రదీప్, నూగూరు రణధీర్ ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. తిరుమలేశ్ ఆరోగ్యం బాగాలేక పోవడంతో నెలరోజుల క్రితమే ఇంటికి వచ్చి చికిత్స చేయించుకుని ఒమన్ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొన్నిరోజులకే మృత్యువాత పడటాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమవారి మృతదేహాలను త్వరగా రప్పించాలని మృతుల కుటుంబీకులు కోరుతున్నారు. -
ఒమన్‌లో ప్రవాసుల బతుకమ్మ
మస్కట్: ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్, తెలంగాణ వింగ్ (ఒమన్ తెలంగాణ సమితి) ఆధ్వర్యంలో మస్కట్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మాతృభూమికి దూరంగా ఓమాన్లో ఉన్న రెండువేలకు పైగా తెలంగాణ ప్రవాసులు మస్కట్‌లోని వాది కబీర్లోని మస్కట్ క్లబ్లో ప్రవాసి బతుకమ్మ సంబరాలు సంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రముఖ గాయకులు తేలు విజయ, రాంపూర్ సాయి తమ పాటలతో మస్కట్ లోని ప్రవాసులను అలరించారు. తంగేడు తదితర పూలను ఇండియా నుండి తెప్పించుకుని పేర్చిన బతుకమ్మలు పూల జాతరను తలపించాయి. బతుకు తెరువు కోసం ఎడారి దేశం వచ్చిన తామందరం ఒకే దగ్గర చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, తమకు స్వదేశంలో ఉన్నఅనుభూతి కలిగిందని ఒమన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు ఖానాపూర్ కు చెందిన ప్రముఖ భారతీయుడు గుండేటి గణేష్ తెలిపారు. -
షేక్‌ను వదిలి రానంటున్న రుక్సా!
సాక్షి, హైదరాబాద్ : వృద్ధుడైన ఒమన్ షేక్‌ను వివాహం చేసుకున్న పాతబస్తీలోని ఫలక్‌నుమా బాలిక రుక్సా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బాలికను తిరిగి రప్పించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేదు. తాను షేక్‌ను వదిలి రానంటూ స్పష్టం చేసింది. పాతబస్తీలోని ఫలక్‌నుమా ఠాణా పరిధిలో ఉన్న నవాబ్సాబ్ కుంట ప్రాంతంలో గత నెల 17న వెలుగులోకి వచ్చిన రుక్సా ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒమన్‌కు చెందిన షేక్ అహ్మద్ అబ్దుల్లా అమూర్ అల్ రహ్బీ(61) పేదింటి మైనర్లను వివాహం చేసుకోవడం కోసం మే 12న హైదరాబాద్ వచ్చాడు. పాతబస్తీకి చెందిన బ్రోకర్లు అహ్మద్, సికిందర్ ఖాన్ (రుక్సా మేనమామ), గౌసున్నిసా బేగం (రుక్సా మేనత్త) సాయంతో రుక్సా తల్లిదండ్రులకు ఎరవేసి మే 16న ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం దళారులకు రూ.8 లక్షలు చెల్లించాడు. అయితే, బాలిక తండ్రికి ఓ మోపెడ్, కూలర్ మాత్రమే కొనిచ్చి మిగిలిన మొత్తం ఖాజీలతో కలసి వీరు కాజేశారు. ఎర్రగుంటకు చెందిన ఖాజీ హబీబ్ అలీ వీరి నిఖా జరిపించాడు. దౌత్యపరంగా ముందుకు... దాదాపు వారంపాటు పాతబస్తీలోని ఓ హోటల్లోనే బస చేసిన షేక్ ఇక్కడే రుక్సాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై అతడు తన స్వదేశానికి వెళ్లిపోయి రుక్సా పేరుతో వీసా పంపించాడు. ఆమె మైనర్ కావడంతో నకిలీ పత్రాల ఆధారంగా ముంబైకి చెందిన చీఫ్ ఖాజీ ఫరీద్ అహ్మద్ ఖాన్, మరో ఖాజీ మునావర్ అలీ సహకారంతో అక్కడే వివాహమైనట్లు నిఖానామా సృష్టించారు. వీటి ఆధారంగా రుక్సాకు వీసా సంపాదించి ఒమన్‌కు పంపారు. అక్కడకు వెళ్లిన రుక్సాపై షేక్‌తోపాటు అతడి బంధువులు సైతం లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాలను ఆమె ఫోన్ ద్వారా తన కుటుంబీకులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి సైదా ఉన్నీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తనను షేక్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయట్లేదని, తాను అతడిని వదిలిరానని రుక్సా స్పష్టం చేసింది. రుక్సా మైనర్ కావడం, షేక్‌తో జరిగిన వివాహం చెల్లుబాటు కాకపోవడంతో ఆమెను ఇక్కడికి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. రుక్సా వివాహం తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగినట్లు ఆధారాలుండడంతో వారిపైనా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. -
ప్రవాసీల కోసం 15న ఓమాన్ లో ఓపెన్ హౌజ్
♦ ప్రతినెల మూడవ శుక్రవారం మస్కట్ లో ప్రవాసి ప్రజావాణి ఓమాన్: సుల్తానేట్ ఆఫ్ ఓమాన్ దేశ రాజధాని మస్కట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఈనెల 15న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ హౌజ్ బహిరంగ సామాజిక సమావేశం జరగనుంది. ఓమాన్ దేశంలో నివసించే ప్రవాస భారతీయ భవననిర్మాణ కార్మికులు, ఇంటిపనిచేసే మహిళలు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ప్రతినెల మూడవ శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఓమాన్ లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ +968 2469 5981 లేదా మొబైల్ నెంబర్ +968 9276 9735 కు కాల్ చేయవచ్చు. వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు ఢిల్లీ లోని టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-3090, హాట్ లైన్ నెంబర్ +91-11-4050 3090, మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ హెల్ప్ లైన్ నెంబర్ +91 93944 22622 కు గాని కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు ఏపీ ఎన్నారై విభాగం నెంబర్ +91 97059 06976 కు, తెలంగాణ వారు టీ-ఎన్నారై విభాగం నెం. +91 94408 54433 కు కాల్ చేయవచ్చు. -
14 ఏళ్ల క్రితం వెళ్లాడు.. చివరికి శవమై
హైదరాబాద్: పొట్టకూటి కోసం 14 ఏళ్ల క్రితం ఎడారి దేశం వెళ్లాడు.. అక్కడ బాగా సంపాదించి సొంత ఊరికి వస్తాడనుకుంటే శవమై తిరిగి వచ్చాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ కు చెందిన పాలమాకుల సత్తయ్య రజక వృత్తి చేసుకునేవాడు. అయితే ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. దీంతో భార్య, పిల్లలను వదిలి 14 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఒమన్ లోని మస్కట్ వెళ్లాడు. ఈ క్రమంలో 2008 లో సత్తయ్య పాస్‌పోర్టు గడువు ముగియడంతో అక్కడ నిబంధనల ప్రకారం సత్తయ్య అక్రమ నివాసిగా మారాడు. క్షమాభిక్ష అవకాశమున్నా సత్తయ్య తిరిగి స్వగ్రామానికి రాలేకపోయాడు. సత్తయ్య కోసం గత 14 ఏళ్లుగా భార్య కనకమ్మ, కూతుళ్లు స్వప్న, శైలజ, కుమారుడు రమేష్ ఎదురుచూస్తునే ఉన్నారు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయిన సత్తయ్య అనారోగ్యంతో గతనెల జులై 31 న మృతి చెందాడు. పాస్ పోర్టు గడువు ముగిసి పోవడంతో అతని మృతదేహాన్ని ఇండియా పంపడానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో మస్కట్ లోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక వేత్త పోల్సాని లింగయ్య ఇండియన్ ఎంబసీ సహాయంతో కుటుంబసభ్యులకు మృతదేహాన్ని పంపేందుకు కృషి చేశారు. అంతేకాక సత్తయ్య మృత దేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు కావలసిన పత్రాలను సమకూర్చడంలో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి సహకరించారు. ఈ మేరకు ఆయన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్, మస్కట్ లోని ఇండియన్ ఎంబసీకి విజ్ఞప్తి చేశారు. దీంతో సత్తయ్య మృతదేహం గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేసి మృత దేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేసింది. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి గత మూడేళ్ళలో గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణ వలస కార్మికులకు చెందిన 600 కు పైగా మృతదేహాలు కలిగిన శవపేటికలు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్టు రిజిస్టర్ ప్రకారం తెలుస్తోందని దేవేందర్ రెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాలలో ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయం కోసం, సలహాల కోసం తమ హెల్ప్ లైన్ నెంబర్ 81435 88886 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.


