మస్కట్: ఒమన్ నివాసితులకు ఈద్ అల్ ఫితర్ (బక్రీద్) సందర్భంగా ఈసారి సుదీర్ఘ సెలవులు లభించే అవకాశం ఉంది. ఈ పండుగను పురస్కరించుకుని దేశంలో వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వచ్చే వారం విడుదల చేయనుంది.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. 'అరాఫా డే' మే 26 (మంగళవారం) వచ్చే అవకాశం ఉంది. దీంతో మే 26 నుండి మే 31 (ఆదివారం) వరకు సెలవులను పొడిగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, దుల్ హజ్ మాసపు చంద్రదర్శనం ఆధారంగానే ఈ సెలవుల తుది తేదీలపై స్పష్టత రానుంది.
పర్యాటక రంగానికి ఊపు..
వరుస సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో ఒమన్‌లోని స్థానికులు, ప్రవాసీయులు ఇప్పటికే తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దేశీయంగా ఉండే పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ఈ లాంగ్ వీకెండ్ ఎంతగానో ఉపయోగపడనుంది. సాధారణంగానే ఈద్ పండుగ రోజుల్లో ఒమన్‌లోని తీరప్రాంతాలు, పర్వత ప్రాంత పర్యాటక స్థలాలు సందర్శకులతో కిక్కిరిసిపోతాయి.
చంద్రదర్శనం ఆధారంగా తేదీలను ఖరారు చేసిన వెంటనే, కార్మిక మంత్రిత్వ శాఖ సెలవులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది.


