
నేడు ఒమన్‌తో భారత్ ఢీ
రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో వరుసగా రెండు విజయాలతో తమ స్థాయిని ప్రదర్శిస్తూ అలవోకగా ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన భారత జట్టు తమ సాధనకు పదును పెడుతోంది. ఈ క్రమంలో గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమన్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో యూఏఈని 57కు ఆలౌట్ చేసిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 130 పరుగులకే పరిమితం చేసింది. ఏకపక్షంగా సాధించిన ఈ విజయాల కారణంగా మన బ్యాటర్లందరికీ బరిలోకి దిగే అవకాశమే పెద్దగా రాలేదు.
ఈ రెండు మ్యాచ్‌లు కలిపి అభిõÙక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. సామ్సన్, హార్దిక్ పాండ్యాలకు ఏమాత్రం బ్యాటింగ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. దాంతో ఒమన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిస్తే జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మన దుర్బేధ్యమైన టీమ్‌ను నిలువరించడం ఒమన్‌కు సాధ్యం కాదు. భారత బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది.
అయితే అందరూ ‘సూపర్–4’కు ముందు తగిన ప్రాక్టీస్‌ను ఆశిస్తున్నారు. ఈ టోర్నీలో ఏకైక మ్యాచ్‌లో అబుదాబిలో ఆడుతున్న సూర్యకుమార్ బృందం... ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో సాధన చేసే అవకాశం లేదు. అందుకే ఈ మ్యాచ్ జట్టుకు కావాల్సిన ప్రాక్టీస్‌ను అందించవచ్చు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందేమో చూడాలి.
చిన్న జట్టు కాబట్టి బుమ్రాకు విశ్రాంతినిచ్చి అర్ష్ దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరిని ఆడించే అవకాశం కూడా ఉంది. మరోవైపు తొలిసారి ఆసియా కప్‌లో ఆడుతున్న ఒమన్ నుంచి ఆశించేదేమీ లేదు. పాకిస్తాన్, యూఏఈలతో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కూడా ఒక్కరూ లేరు.