చరిత్ర సృష్టించిన డెవాన్‌ కాన్వే.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా | Devon Conway Makes History, Becomes 1st New Zealand Batter To Achieve This Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన డెవాన్‌ కాన్వే.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా

Dec 21 2025 12:42 PM | Updated on Dec 21 2025 12:48 PM

Devon Conway Makes History, Becomes 1st New Zealand Batter To Achieve This Feat

మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దుమ్ములేపాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్‌లో ద్విశతకం, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కాన్వే చరిత్ర సృష్టించారు.

ఇప్పటివరకు ఏ కివీ ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 10వ బ్యాటర్‌గా కాన్వే నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 367 బంతుల్లో 31 ఫోర్లతో 227 పరుగులు చేసిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగులు చేశాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కాన్వే ఈ ఏడాది మాత్రం అదరగొట్టాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో 87.12 సగటుతో 697 పరుగులు సాధించారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 452 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కరేబియన్ జట్టు విజయానికి ఇంకా 419 పరుగులు కావాలి. 

క్రీజులో బ్రాండెన్ కింగ్‌(37), క్యాంప్‌బెల్‌(2) ఉన్నారు. అంతకుముందు కివీస్ తమ సెకెండ్ ఇన్నిం‍గ్స్‌ను 306/2 వ‌ద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో కాన్వేతో పాటు టామ్ లాథ‌మ్ కూడా శ‌త‌క్కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్‌ ముందు 452 లక్ష్యాన్ని బ్లాక్‌ క్యాప్స్‌ ఉంచింది.

ఇక విండీస్‌ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా..  కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. అదేవిధంగా న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 575 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.
చదవండి: చాలా చాలా బాధ‌గా ఉంది.. మా క‌ల చెదిరిపోయింది: బెన్‌ స్టోక్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement