వడోదర వేదికగా భారత్‌తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 27 ఏళ్ల కిందటి రికార్డు బద్దలు కొట్టారు.
భారత్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం విభాగంలో నికోల్స్-కాన్వే తాజా భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు నాథన్ ఆస్టల్-క్రెయిగ్ స్పియర్‌మన్ పేరిట ఉండేది.
1999లో రాజ్‌కోట్‌లో ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ భారత్‌పై 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ విభాగంలో టాప్ ప్లేస్‌లో ఆండ్రూ జోన్స్-జాన్ రైట్ జోడీ ఉంది. 1988లో ఈ కివీ ఓపెనింగ్ పెయిర్ ఇదే వడోదరలో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 43.3 ఓవర్ల అనంతరం 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో కివీస్ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా ఉంది.
డారిల్ మిచెల్ (56 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా క్రిస్టియన్ క్లార్క్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ తలో 2.. ప్రసిద్ద్, కుల్దీప్ చెరో వికెట్ తీసి న్యూజిలాండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (12), గ్లెన్ ఫిలిప్ (12), మిచెల్ హే (18), కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ (16) మంచి ఆరంభాలు లభించినా, పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. జకరీ ఫౌల్క్స్ 1 పరుగుకే ఔటయ్యాడు.
కాగా, న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తొలి వన్డే జరుగుతుంది.
తుది జట్లు..
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ


