గుకేశ్‌కు రెండో పరాజయం... దివ్య ఖాతాలో తొలి విజయం | gukesh second defeat tournament | Sakshi
Sakshi News home page

గుకేశ్‌కు రెండో పరాజయం... దివ్య ఖాతాలో తొలి విజయం

Mar 3 2026 7:56 AM | Updated on Mar 3 2026 11:30 AM

gukesh second defeat tournament

ప్రాగ్‌ చెస్‌ ఫెస్టివల్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ రెండో ఓటమి చవిచూశాడు. మాస్టర్స్‌ కేటగిరీలో 
భాగంగా నొదిర్‌బెక్‌ అబ్దుసత్తోరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో నల్లపావులతో ఆడిన గుకేశ్‌ 69 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. 

ఐదో రౌండ్‌ తర్వాత గుకేశ్‌ 1.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం ఖాతాలో మూడో ఓటమి చేరింది. డేవిడ్‌ ఆంటోన్‌ (స్పెయిన్‌)తో జరిగిన ఐదో రౌండ్‌లో అరవింద్‌ 40 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఇదే టోరీ్నలో చాలెంజర్స్‌ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ తొలి విజయం నమోదు చేసింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ సూర్యశేఖర గంగూలీతో జరిగిన ఐదో రౌండ్‌లో దివ్య 35 ఎత్తుల్లో గెలిచింది.    

Advertisement
 
Advertisement
Advertisement