‘సడన్‌డెత్‌’లో హారిక విజయం | Dronavalli Harika Enter Fourth In World Cup Chess Tournament | Sakshi
Sakshi News home page

‘సడన్‌డెత్‌’లో హారిక విజయం

Aug 8 2023 4:14 AM | Updated on Aug 8 2023 4:14 AM

Dronavalli Harika Enter Fourth In World Cup Chess Tournament - Sakshi

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక... ఓపెన్‌ విభాగంలో నిహాల్‌ సరీన్, విదిత్‌ సంతోష్‌ గుజరాతి నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మూడో రౌండ్‌ టైబ్రేక్‌ పోటీల్లో హారిక 5.5–4.5తో లెలా జవఖి‹Ùవిలి (జార్జియా)పై... నిహాల్‌ 2.5–1.5తో డేనియల్‌ బొగ్డాన్‌ (రొమేనియా)పై... విదిత్‌ 5–4తో మథియాస్‌ బ్లూ»ౌమ్‌ (జర్మనీ)పై విజయం సాధించారు. ఆదివారం రెండు క్లాసికల్‌ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో హారిక–లెలా మధ్య విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు.

వీరిద్దరు ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు ఆడారు. రెండూ ‘డ్రా’గా ముగియడంతో 2–2తో సమంగా నిలిచారు. దాంతో 10 నిమిషాలు నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు నిర్వహించారు. ఇందులో చెరో గేమ్‌లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. అనంతరం 5 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు ఆడించగా...రెండూ ‘డ్రా’ కావడంతో స్కోరు 4–4తో నిలిచింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆఖరుగా 3 నిమిషాల నిడివిగల ‘సడన్‌డెత్‌’ గేమ్‌లు మొదలయ్యాయి. ‘సడన్‌డెత్‌’లో ‘డ్రా’ అయితే విజేత తేలేవరకు గేమ్‌లు నిర్వహిస్తారు, గెలిస్తే మాత్రం వెంటనే ముగిస్తారు. ఇందులో హారిక, లెలా తొలి గేమ్‌ ‘డ్రా’కాగా... రెండో గేమ్‌లో హారిక 59 ఎత్తుల్లో నెగ్గి నాలుగో రౌండ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement