పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు పెంటేల హరికృష్ణ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రొమేనియాకు చెందిన మార్టీనెజ్ అల్‌కంటారా చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు. ఇద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో ఆదివారం ‘టైబ్రేక్’ నిర్వహించారు. 15 నిమిషాల వ్యవధి ఉన్న తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో 10 నిమిషాల మరో రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహించారు. ఇందులో తొలి గేమ్‌లో హరికృష్ణ ఒక దశలో మెరుగైన స్థితిలోనే ఉన్నా...తెల్ల పావులతో ఆడిన మార్టీనెజ్ చివరకు 59 ఎత్తుల్లో విజయం సాధించాడు.
తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హరికృష్ణ 30 ఎత్తున తర్వాత ‘డ్రా’ మాత్రమే చేయగలిగాడు. దాంతో అతను వరల్డ్ కప్‌నుంచి ని్రష్కమించాడు. క్వార్టర్ ఫైనల్లో జవోకిర్ సిందరోవ్‌ను మార్టీనెజ్ ఎదుర్కొంటాడు. ఇప్పుడు భారత్ ఆశలన్నీ అర్జున్ ఇరిగేశిపైనే ఉన్నాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో వె యి (చైనా)తో అర్జున్ తలపడతాడు. ఇతర గేమ్‌లలో డానిల్ దుబోవ్‌ను ఓడించి స్యామ్ శంక్‌లాండ్, అలెక్సీ గ్రెబ్‌నోవ్‌పై గెలిచి ఆండ్రీ ఎసిపెంకో, లీ క్వాంగ్ లీమ్‌పై విజయం సాధించి అలెగ్జాండర్ డోన్‌చెంకో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.


