జమ్ము అండ్ కశ్మీర్‌లో ఓ స్థానిక వ్యక్తి హెల్మెట్‌పై పాలస్తీనా జెండా ధరించి క్రికెట్ మ్యాచ్ ఆడటం వివాదాస్పదంగా మారింది. జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ పేరిట జరుగుతున్న క్రికెట్ టోర్నీలో ఫుర్కాన్ భట్ అనే ప్లేయర్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫుర్కాన్తో పాటు టోర్నీ నిర్వాహకుడు జాహిద్ భట్‌కు సమన్లు జారీ చేశారు.
ఈ వివాదంపై జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) స్పందించింది. జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ JKCA గుర్తింపు పొందింది కాదని స్పష్టం చేసింది. ఫుర్కాన్ అనే ఆటగాడు JKCA లేదా దాని అనుబంధ సంస్థల్లో ఎక్కడా నమోదు కాలేదని తేల్చి చెప్పింది. కాగా, భారత పౌరసత్వం కలిగిన ఏ వ్యక్తి అయినా పరాయి దేశ జెండాలను వాడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.
ఇదే నేరం ఏదైనా రాష్ట్రానికి చెందిన క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన వ్యక్తి చేస్తే మరింత తీవ్రమైందిగా పరిగణించడబడుతుంది. ఫుర్కాన్ అనే వ్యక్తి స్థానిక క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కావడంతో వివాదం పెద్దది కాలేదు.
ఇదిలా ఉంటే, జమ్ము అండ్ కశ్మీర్‌లో ఇటీవలికాలంలో అనధికారిక క్రికెట్ లీగ్‌లు ఎక్కువయ్యాయి. ఇదే ఏడాది ఇక్కడ జరిగిన ఇండియన్ హెవెన్ ప్రీమియర్ లీగ్ (IHPL) వివాదాస్పదంగా మారింది. ఈ టోర్నీలో చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొన్నారు.
ఈ లీగ్ నిర్వాహకులు ఆటగాళ్లు, హోటల్ యజమానులను మోసం చేసి మధ్యలోనే పరారయ్యారు. ఈ లీగ్‌లో క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ లాంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొన్నారు.


