పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ఆట తీరును భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. నమీబియాతో మ్యాచ్‌లో ఫర్హాన్ సెంచరీ మార్కు అందుకున్న తీరు తనకు అంతగా నచ్చలేదని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2026లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆఫ్రికా పసికూన నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు
తద్వారా ఈ టోర్నీలో మూడో గెలుపుతో పాకిస్తాన్ ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచి ‘సూపర్–8’ దశకు చేరుకుంది. కొలంబో వేదికగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
సింగిల్ తీసి
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్ తీసి ఫర్హాన్ శతక మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరిదైన ఆరో బంతిని ఎదుర్కొని పరుగులేమీ తీయలేకపోయాడు.
Huge six from Farhan and a brilliant catch in the stands! 🚀🙌
The opener is shifting gears to set up a massive total for Pakistan.
ICC Men’s #T20WorldCup | #PAKvNAM | LIVE NOW ➡️https://t.co/tEqcKQXZLa pic.twitter.com/ydvDhSHCt0— Star Sports (@StarSportsIndia) February 18, 2026
సెంచరీ కోసం డిఫెన్సివ్ షాట్
ఈ నేపథ్యంలో కామెంటేటర్, టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫర్హాన్‌ను విమర్శించాడు. కాస్త ధైర్యంగా షాట్లు బాది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు సెంచరీ చేశాడని ఒప్పుకంటాను. కానీ సింగిల్ తీసి వంద పరుగుల మార్కు అందుకుంటాడా?.. ఇదేమీ అంత బాగా లేదు.
నువ్వు సెంచరీ పూర్తి చేసుకుంటే సంతోషంగా ఉంటావా? లేదంటే పాకిస్తాన్ 199 పరుగుల వద్దే ఆగిపోతే ఆనందంగా ఉంటావా? ఆఖరి ఓవర్లో సెంచరీ కోసం డిఫెన్సివ్ షాట్ ఆడావు!
ఇక చివరి బంతినైతే ఏకంగా అలా వదిలేశావు. సూపర్ నువ్వు’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన షాదాబ్ ఖాన్ ఫర్హాన్ కంటే బెటర్ అంటూ ఘాటుగా విమర్శించాడు.
కాగా పాక్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 17.3 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ఫలితంగా 102 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు అర్హత సాధించింది.
చదవండి: T20 WC 2026: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?


