Pakistan vs Namibia
-
నువ్వు సూపర్: పాక్ ఓపెనర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు
పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఆట తీరును భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. నమీబియాతో మ్యాచ్‌లో ఫర్హాన్ సెంచరీ మార్కు అందుకున్న తీరు తనకు అంతగా నచ్చలేదని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆఫ్రికా పసికూన నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.3 వికెట్లు కోల్పోయి 199 పరుగులుతద్వారా ఈ టోర్నీలో మూడో గెలుపుతో పాకిస్తాన్ ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచి ‘సూపర్–8’ దశకు చేరుకుంది. కొలంబో వేదికగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.సింగిల్ తీసిఈ మ్యాచ్‌లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్ తీసి ఫర్హాన్ శతక మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరిదైన ఆరో బంతిని ఎదుర్కొని పరుగులేమీ తీయలేకపోయాడు.Huge six from Farhan and a brilliant catch in the stands! 🚀🙌The opener is shifting gears to set up a massive total for Pakistan.ICC Men’s #T20WorldCup | #PAKvNAM | LIVE NOW ➡️https://t.co/tEqcKQXZLa pic.twitter.com/ydvDhSHCt0— Star Sports (@StarSportsIndia) February 18, 2026సెంచరీ కోసం డిఫెన్సివ్ షాట్ఈ నేపథ్యంలో కామెంటేటర్, టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫర్హాన్‌ను విమర్శించాడు. కాస్త ధైర్యంగా షాట్లు బాది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు సెంచరీ చేశాడని ఒప్పుకంటాను. కానీ సింగిల్ తీసి వంద పరుగుల మార్కు అందుకుంటాడా?.. ఇదేమీ అంత బాగా లేదు.నువ్వు సెంచరీ పూర్తి చేసుకుంటే సంతోషంగా ఉంటావా? లేదంటే పాకిస్తాన్ 199 పరుగుల వద్దే ఆగిపోతే ఆనందంగా ఉంటావా? ఆఖరి ఓవర్లో సెంచరీ కోసం డిఫెన్సివ్ షాట్ ఆడావు!ఇక చివరి బంతినైతే ఏకంగా అలా వదిలేశావు. సూపర్ నువ్వు’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన షాదాబ్ ఖాన్ ఫర్హాన్ కంటే బెటర్ అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా పాక్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 17.3 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ఫలితంగా 102 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 WC 2026: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ? -
PAK Vs NAM: పాకిస్తాన్‌కు శుభవార్త!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటికే ఏడు జట్లు సూపర్-8 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8లో అడుగుపెట్టగా.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి.పోటీలో అమెరికా, పాక్ ఇక గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య భారత్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకోగా.. ఇదే గ్రూపు నుంచి రెండో బెర్తు కోసం అమెరికా, పాకిస్తాన్ పోటీలో ఉన్నాయి. గ్రూప్-ఎ టాపర్ టీమిండియా ఖాతాలో ఆరు పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేటు (+3.050).రెండో స్థానంలో ఉన్న అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని రెండు గెలిచి 4 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.787). ఇక నమీబియా ఆడిన మూడింటికి మూడు ఓడి ఎలిమినేట్ కాగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లు సాధించిది. అమెరికాతో సమానంగా పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు (-0.403) పరంగా వెనుకబడి ప్రస్తుతానికి మూడో స్థానంలో నిలిచింది.వర్షం పడితే.. ఈ క్రమంలో గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం నమీబియాతో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.పల్లెకెలెలో వాన వల్ల జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో జింబాబ్వే సూపర్-8కు చేరగా.. ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇక పాక్- నమీబియా మ్యాచ్‌కు కూడా వాన ముప్పు పొంచి ఉంది.ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో బుధవారం వర్షం పడేందుకు 67 శాతం అవకాశాలు ఉన్నాయి. రాత్రికి 55 శాతం వాన పడే అవకాశాలు తగ్గినా.. పాక్- నమీబియా మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకే మొదలుకావాల్సి ఉంది.సంతోషంలో పాక్ జట్టు అభిమానులుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ గనుక రద్దైతే పాకిస్తాన్‌కు పండుగే. వాన వల్ల మ్యాచ్ సాగకపోతే పాక్, నమీబియాలకు చెరో పాయింట్ వస్తుంది. తద్వారా పాక్ ఖాతాలోని పాయింట్ల సంఖ్య ఐదుకు చేరి.. సూపర్-8కు నేరుగా అర్హత సాధిస్తుంది. దీంతో అమెరికా నిష్క్రమించాల్సి ఉంటుంది.ఒకవేళ మ్యాచ్ జరిగినా పాక్ నమీబియాపై తప్పక గెలవాలి. నమీబియా పసికూనే అయినా పాక్ నిలకడలేమితనం ఆ జట్టు అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. అయితే, మ్యాచ్‌కు వాన ముప్పు ఉందని తెలిసి వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.చదవండి: కెప్టెన్ నిర్ణయం... జట్టు పాలిట శాపం! -
పటిష్ట స్థితిలో అమెరికా.. పాక్ సూపర్-8 చేరాలంటే?
టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్‌పై తమదే పైచేయి అని టీమిండియా మరోసారి నిరూపించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సల్మాన్ ఆఘా బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తాజా ఎడిషన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసిన టీమిండియా.. గ్రూప్-ఎ నుంచి సూపర్-8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.తదుపరి నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా తలపడుతుంది. మరోవైపు.. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్‌తో అమెరికా పోటీ పడుతోంది. కాగా లీగ్ దశలో అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.పటిష్ట స్థితిలో అమెరికాఇందులో భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా జట్టు.. నెదర్లాండ్స్, నమీబియా జట్లపై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లు సాధించింది. నెట్‌రన్‌రేటు +0.787గా ఉంది. ఇక టీమిండియా చేతిలో భారీ తేడాతో పాక్ ఓడిపోవడంతో అమెరికా సూపర్-8 ఆశలు సజీవమయ్యాయి.ఈ నేపథ్యంలో అమెరికాను దాటి సూపర్-8కు చేరాలంటే పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కొలంబో వేదికగా నమీబియాపై పాక్ గెలిస్తేనే సూపర్-8కు చేరుతుంది. అయితే, ఇరుజట్లలో పాక్ పటిష్టమైనదే అయినా.. అత్యంత నిలకడలేని జట్టుగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు ఉంది.పాక్ సూపర్-8 చేరాలంటే?మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికా, జింబాబ్వే, ఇటలీ, నేపాల్ వంటి పసికూన జట్లు పటిష్ట జట్లకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అమెరికా టీమిండియాకు గట్టి పోటీనివ్వగా.. జింబాబ్వే మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. నేపాల్.. రెండుసార్లు చాంపియన్ అయిన ఇంగ్లండ్‌ను వణికించగా.. తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న ఇటలీ నేపాల్‌ను చిత్తు చేసింది.కాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో పాక్ జాగ్రత్తగా ఆడితేనే సజావుగా సూపర్-8కు చేరుతుంది. లేదంటే.. గత ఎడిషన్ మాదిరే ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కాగా పాక్ తమ తొలి రెండు మ్యాచ్‌లలో నెదర్లాండ్స్, అమెరికాలను ఓడించి నాలుగు పాయింట్లు సంపాదించింది. నెట్‌రన్‌రేటు -0.403.నెట్‌రన్‌రేటు పరంగాకాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఆరు పాయింట్లతో పాక్ అమెరికాను దాటి సూపర్-8లో అడుగుపెట్టగలదు. ఒకవేళ నమీబియా చేతిలో ఓడితే గనుక అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు పరంగా యూఎస్ మెరుగ్గా ఉంది. కాబట్టి అక్కడా పాకిస్తాన్‌కు ప్రమాదమే పొంచి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి వెస్టిండీస్, టీమిండియా మాత్రమే సూపర్-8 బెర్తులను అధికారికంగా ఖరారు చేసుకున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు -
T20 WC: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్‌రన్‌రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు


