ముగ్గురూ లెఫ్టాండర్లే.. మాకు కష్టమే: టీమిండియా కోచ్‌ | Team India Qualifies For Super-8 In T20 World Cup 2026, Faces Challenges Against Spin And Left Handed Batters | Sakshi
Sakshi News home page

మాకు ఎక్కువ ఆప్షన్లు లేవు.. సూపర్‌-8లో కఠిన సవాలు: టీమిండియా కోచ్‌

Feb 19 2026 1:43 PM | Updated on Feb 19 2026 1:55 PM

We Dont Have Many Options: India Coach On Major Concerns Super 8s

టీమిండియా అజేయంగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో సూపర్‌-8 దశకు చేరుకుంది. గ్రూప్‌-ఎలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా తదుపరి దశకు అర్హత సాధించింది.

అయితే, నమీబియా, పాకిస్తాన్‌లపై అలవోకగా విజయం సాధించిన సూర్యకుమార్‌ సేనకు.. పసికూనలు అమెరికా, నెదర్లాండ్స్‌ మాత్రం గట్టి సవాలు విసిరాయి. కష్టమ్మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్‌.. నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఏకపక్ష విజయాలు సాధిస్తుందనుకున్న మ్యాచ్‌లలోనే టీమిండియా తడబడటం గమనార్హం.

ముగ్గురూ లెఫ్టాండర్లే
ఇక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయ్యాడు. అతడికి తోడుగా ఉన్న మరో లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ అదరగొడుతుండటం సానుకూలాంశం కాగా.. మరో ఎడమ చేతి వాటం బ్యాటర్‌, వన్‌డౌన్‌లో వచ్చే తిలక్‌ వర్మ మాత్రం క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో సూపర్‌-8లో టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ డష్కాటే సైతం అంగీకరించాడు. టీమిండియా ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కోంటోందని తెలిపాడు.

ప్రధానంగా రెండు సమస్యలు
టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్టాండర్‌ బ్యాటర్లే ఉండటం ఒక సమస్య అయితే.. ఫింగర్‌ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటు మరో సమస్య అని డష్కాటే పేర్కొన్నాడు. ‘‘టాప్‌-3లో మాకు ఎక్కువగా ఆప్షన్లు లేవు. సంజూ బెంచ్‌ మీద ఉన్నాడు. కాబట్టి ముగ్గురూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కొనసాగుతున్నారు.

అయితే, మా బ్యాటర్లలో చాలా మంది ఫింగర్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్‌-8లో వెస్టిండీస్‌, సౌతాఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ప్రయోగించడం ఖాయమే. అయితే, మాకు అత్యుత్తమ బ్యాటర్లు ఉండటం కలిసి వచ్చే అంశం.

14 ఓవర్ల పాటు ఫింగర్‌ స్పిన్‌
పాకిస్తాన్‌ కూడా గత మ్యాచ్‌లో 14 ఓవర్ల పాటు ఫింగర్‌ స్పిన్‌ వేయించింది. ఆఫ్‌ స్పిన్‌ కంటే ఫింగర్‌ స్పిన్‌నే ఎక్కువగా వాళ్లు నమ్ముకున్నారని నేను అంటాను. కొలంబో వంటి స్లో పిచ్‌లపై ఇలాంటివి వర్కౌట్‌ అవుతాయి.

అయితే, మా వాళ్లు అలాంటి చోట సమస్యను అధిగమించారు. కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు.

కాగా ఆఫ్‌ స్పిన్నర్లు బంతిని టర్న్‌ చేసే క్రమంలో  మణికట్టు కదలికల (కుడి నుంచి ఎడమకు)పై ఆధారపడితే.. ఫింగర్‌ స్పిన్నర్లు చూపుడు లేదంటే మధ్యవేలును ఉపయోగించి బంతి దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ చిన్న తేడా తప్ప రెండు దాదాపుగా ఒకే విధమైన బౌలింగ్‌ శైలి అని చెప్పవచ్చు. కాగా సూపర్‌-8లో భారత్‌ వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడుతుంది.

చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement