పనాజీ: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, పెంటేల హరికృష్ణ ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించారు.
లెవోన్ అరోనియన్ (అమెరికా)తో జరిగిన తొలి గేమ్‌ను తెలంగాణ ప్లేయర్ అర్జున్ 41 ఎత్తుల్లో... అల్కంటారా మార్టినెజ్ (రొమేనియా)తో జరిగిన తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ హరికృష్ణ కూడా 41 ఎత్తుల్లోనే ‘డ్రా’ చేసుకున్నాడు. నేడు జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ రెండో గేమ్ ‘డ్రా’ అయితే... విజేతలను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు.


