టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 40 రోజుల్లో భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఛాంపియన్స్‌గా నిలస్తుందని భజ్జీ జోస్యం చెప్పాడు.
"టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు టీమిండియాకు ఎక్కువగా ఉన్నాయి. మన ఆటగాళ్లకు ఉపఖండ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇది భారత జట్టుకు బాగా కలిసొస్తోంది. అయితే టోర్నీలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి కూడా భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది.
ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనైనా ఆస్ట్రేలియా కచ్చితంగా టైటిల్ రేసులో ఉంటుంది. కాబట్టి కంగారూలను తక్కువగా అంచనా వేయకూడదు. సౌతాఫ్రికా కూడా గత కొంత కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అఫ్గానిస్తాన్ జట్టు కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు.
భారత్ వంటి ఉపఖండ పిచ్‌లలో వారు ఎవరినైనా ఓడించగలరు. నా వరకు అయితే .. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గాన్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయని అనుకుంటున్నాను"అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) సీజన్ 4 ప్రారంభోత్సవంలో భజ్జీ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ పటేల్, వాషింగ్టన్ సందర్.
చదవండి: రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. మెల్‌బోర్న్ పిచ్‌పై ఐసీసీ ఆగ్రహం


