'ఈజీగా ఔట్ చేయ‌వ‌చ్చు'.. అభిషేక్‌ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆట‌గాడు | Mohammad Amir's Insulting Remark At World No. 1 Abhishek Sharma Leaves Fans Fuming | Sakshi
Sakshi News home page

IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయ‌వ‌చ్చు'.. అభిషేక్‌ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆట‌గాడు

Feb 13 2026 2:45 PM | Updated on Feb 13 2026 3:55 PM

Mohammad Amir's Insulting Remark At World No. 1 Abhishek Sharma Leaves Fans Fuming

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో అస‌లు సిస‌లైన స‌మ‌రానికి స‌మ‌యం అస‌న్న‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా విధ్వంస‌క‌ర బ్యాటర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి  పాక్ మాజీ పేస‌ర్ మహ్మద్‌ ఆమిర్‌ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. అభిషేక్ కేవ‌లం ఒక 'స్లాగర్' (బంతిని బలంగా బాద‌డం) అని, బ్యాటింగ్ టెక్నిక్ లేద‌ని అత‌డు విమ‌ర్శించాడు.

"అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అత‌డు ఒక స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. ప్రతీ బంతిని బలంగా కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇటువంటి ఆట తీరు ఉన్న‌వాళ్లు ఎప్పుడో ఒక్క‌సారి మాత్ర‌మే అత‌డు స‌క్సెస్ అవుతారు. విఫ‌ల‌మ‌య్యేందుకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. అభిషేక్ దగ్గర సరైన టెక్నిక్ లేదు.

ప్ర‌తీ 8 ఇన్నింగ్స్‌లలో ఒకసారి మాత్రమే అత‌డు రాణిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల‌లో త‌క్కువే ప‌రుగుల‌కే అవుట్ అవుతున్నాడు. అత‌డు ఒక చోట నిల‌బ‌డి అన్ని బంతులను ఒకే ఏరియాలో వేయాలని కోరుకుంటాడు. బంతిని బాడీ లైన్ వేస్తే అతను ఇబ్బంది ప‌డ‌తాడు. అదేవిధంగా బంతి కొంచెం స్వింగ్ అయినా అతను ఆడలేడు.

అయితే అభిషేక్‌ను నేనేమి త‌క్కువ చేసి మాట్ల‌డడం లేదు. అత‌డి ఆట‌లో చాలా రిస్క్ ఉంద‌ని చెబుతున్నా. త‌న‌దైన ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును ముప్పు తిప్ప‌లు పెట్ట‌గ‌ల‌డు అని ఓ టీవీ ఛాన‌ల్ డిబేట్‌లో అమీర్ పేర్కొన్నాడు. 

అయితే ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మను 'స్లాగర్' అని పిలవడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ లాంటి ఒక్క ప్లేయ‌ర్ అయినా మీ జ‌ట్టులో ఉన్నారా? అంటూ నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా కడుపు ఇన్ఫెక్షన్ వల్ల న‌మీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ దూర‌మయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌కు ఈ పంజాబీ బ్యాట‌ర్ అందుబాటులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement