వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది.
జనవరి 8వ తేదీ రాత్రి 12గంటల వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది.


