టైబ్రేక్ పోరుకు హరికృష్ణ
పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు ప్రపంచకప్ విజేత, అమెరికా గ్రాండ్‌మాస్టర్ లెవోన్ అరోనియన్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో అర్జున్ 1.5–0.5తో గెలుపొందాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ అరోనియన్‌తో శుక్రవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ప్రపంచ ఆరో ర్యాంకర్ అర్జున్... శనివారం జరిగిన ఏడో గేమ్‌లో నల్లపావులతో ఆడుతూ అర్జున్ 38 ఎత్తుల్లో విజయం సాధించి ముందంజ వేశాడు.
మరోవైపు భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ భవితవ్యం టైబ్రేక్‌లో తేలనుంది. హరికృష్ణ, జోస్ ఎడువార్డో మారి్టనెజ్ అల్కంటారా (రొమేనియా) మధ్య జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ 1–1తో సమంగా ముగిసింది. వీరిద్దరి మధ్య రెండో గేమ్ కూడా 35 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. సిందరోవ్ జవోఖిర్ (ఉజ్బెకిస్తాన్), నొదిర్‌బెక్ యాకు»ొయెవ్ (ఉజ్బెకిస్తాన్), వె యి (చైనా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.


