ఢిల్లీ: చైనా విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చే ఉక్కు(స్టీల్) ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించింది. మూడేళ్ల పాటు ఈ సుంకాలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. అయితే, చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే, చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన, నాసిరకం ఉత్పత్తులను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో(సేఫ్ గార్డు డ్యూటీ) భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా భారత్.. చైనాపై మొదటి సంవత్సరంలో సుంకాన్ని 12 శాతంగా నిర్ణయించగా.. రెండో సంవత్సరంలో 11.5 శాతానికి తగ్గించనున్నారు. అలాగే, మూడో సంవత్సరంలో 11%కి తగ్గిస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో భారత్ (India) రెండో స్థానంలో ఉంది. చైనా (China) నుంచి నాసిరకం ఉక్కు తక్కువ ధరలకే వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల దేశీయ ఉక్కు తయారీదారులపై కూడా ప్రభావం పడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు దీనినుంచి ఉపశమనం కల్పించింది. చైనా, వియత్నాం, నేపాల్ దేశాలకు ఈ సుంకాలు వర్తించనున్నాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుంది.
Big relief for domestic steel manufacturers
Govt imposes safeguard duty on imports of certain steel products
Safeguard duty imposed for three years in a staggered manner
Duty will be imposed at 12% in the first year, 11.5% in the second year, followed by 11% in the third year pic.twitter.com/ehH2CPqYb2— Prakash Priyadarshi (@priyadarshi108) December 30, 2025
ఇదిలా ఉండగా.. చౌక దిగుమతులు, నాసిరకం ఉత్పత్తుల కారణంగా దేశీయ ఉక్కు పరిశ్రమ దెబ్బతినకూడదని మంత్రిత్వ శాఖ పదేపదే చెబుతోంది. ఇటీవల, దిగుమత్తుల్లో గణనీయమైన పెరుగుదల ఉండటం దేశీయ కంపెనీలపై ప్రభావం చూపించింది. దీంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) మూడేళ్ల సుంకాన్ని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో సుంకాలను విధించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, ఇండియన్ స్టెయిన్‌లెస్ స్టీల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఈ సమస్యను ముందుగానే ఎత్తి చూపింది. ఆగస్టు 2025లో చౌక ఉక్కు దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్‌కు ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లోనే భారత్‌కు విదేశాల నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 12 శాతం తాత్కాలిక సుంకం విధించింది. 200 రోజులకు గాను విధించిన ఈ సుంకాలు గత నెలలోనే ముగిశాయి.


