breaking news
steel demand
-
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్‌లు
ఢిల్లీ: చైనా విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి వచ్చే ఉక్కు(స్టీల్) ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించింది. మూడేళ్ల పాటు ఈ సుంకాలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. అయితే, చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే, చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన, నాసిరకం ఉత్పత్తులను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి వచ్చే ఎగుమతుల పెరుగుదలను నియంత్రించే లక్ష్యంతో(సేఫ్ గార్డు డ్యూటీ) భారత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా భారత్.. చైనాపై మొదటి సంవత్సరంలో సుంకాన్ని 12 శాతంగా నిర్ణయించగా.. రెండో సంవత్సరంలో 11.5 శాతానికి తగ్గించనున్నారు. అలాగే, మూడో సంవత్సరంలో 11%కి తగ్గిస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో భారత్ (India) రెండో స్థానంలో ఉంది. చైనా (China) నుంచి నాసిరకం ఉక్కు తక్కువ ధరలకే వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల దేశీయ ఉక్కు తయారీదారులపై కూడా ప్రభావం పడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు దీనినుంచి ఉపశమనం కల్పించింది. చైనా, వియత్నాం, నేపాల్ దేశాలకు ఈ సుంకాలు వర్తించనున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుంది. Big relief for domestic steel manufacturersGovt imposes safeguard duty on imports of certain steel productsSafeguard duty imposed for three years in a staggered mannerDuty will be imposed at 12% in the first year, 11.5% in the second year, followed by 11% in the third year pic.twitter.com/ehH2CPqYb2— Prakash Priyadarshi (@priyadarshi108) December 30, 2025ఇదిలా ఉండగా.. చౌక దిగుమతులు, నాసిరకం ఉత్పత్తుల కారణంగా దేశీయ ఉక్కు పరిశ్రమ దెబ్బతినకూడదని మంత్రిత్వ శాఖ పదేపదే చెబుతోంది. ఇటీవల, దిగుమత్తుల్లో గణనీయమైన పెరుగుదల ఉండటం దేశీయ కంపెనీలపై ప్రభావం చూపించింది. దీంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) మూడేళ్ల సుంకాన్ని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో సుంకాలను విధించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఈ సమస్యను ముందుగానే ఎత్తి చూపింది. ఆగస్టు 2025లో చౌక ఉక్కు దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్‌కు ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లోనే భారత్‌కు విదేశాల నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 12 శాతం తాత్కాలిక సుంకం విధించింది. 200 రోజులకు గాను విధించిన ఈ సుంకాలు గత నెలలోనే ముగిశాయి. -
స్టీల్‌కు పెరగనున్న డిమాండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో స్టీల్‌కు డిమాండ్ 8 శాతం పుంజుకోనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా అంచనా వేసింది. అయితే పోటీధరల కారణంగా స్టీల్ తయారీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిళ్లకు అవకాశమున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. స్టీల్ పరిశ్రమ నిర్వహణలాభ మార్జిన్ నిలకడగా 12.5 శాతం స్థాయిలో నమోదుకావచ్చని అభిప్రాయపడింది. వెరసి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు గతంలో వేసిన అంచనాలను సవరించింది.కాగా.. ఈ ఏడాది స్టీల్ డిమాండ్ 8 శాతం స్థాయిలో పటిష్టంగా నమోదుకావచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా కార్పొరేట్ రంగ రేటింగ్స్ గ్రూప్ హెడ్ గిరీష్‌కుమార్ కడమ్ తెలియజేశారు. అయితే సరఫరాలు పెరగనుండటంతో తాత్కాలికంగా డిమాండును మించి సరఫరాకు వీలున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా స్టీల్ ధరలపై ఒత్తిళ్లు కొనసాగవచ్చని తెలియజేశారు. సేఫ్‌గార్డ్ డ్యూటీ రక్షణ ఇక్రా నివేదిక ప్రకారం దేశీయంగా హాట్రోల్డ్ కాయిల్(హెచ్ఆర్సీ) ధరలు 2025 ఏప్రిల్‌లో టన్నుకి రూ. 52,850కు ఎగశాయి. సేఫ్‌గార్డ్ డ్యూటీ విధింపు ఇందుకు సహకరించింది. ఆపై నవంబర్‌కల్లా టన్ను ధర తిరిగి రూ. 46,000కు దిగివచ్చింది. దిగుమతి ధరలకంటే దిగువకు చేరింది. వ్యవస్థాగత అంశాల కారణంగా ప్రస్తుత కేలండర్ ఏడాది(2025) తొలి 9 నెలల్లో చైనా స్టీల్ ఎగుమతులు 8.8 కోట్ల టన్నులను తాకాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. దీంతో ప్రపంచ స్టీల్ ధరలపై ప్రతికూల ప్రభావం పడింది.ఈ ఏప్రిల్–సెప్టెంబర్‌లో చైనా హెచ్ఆర్సీ ఎగుమతి ధరలు సగటున టన్నుకి 465 యూఎస్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం నమోదైన 496 డాలర్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఫినిష్డ్(తుది ఉత్పత్తి) స్టీల్ దిగుమతులు వార్షికంగా 33 శాతం క్షీణించాయి. దీంతో చౌక దిగుమతులను అడ్డుకునేందుకు సేఫ్‌గార్డ్ డ్యూటీ కొనసాగింపు కీలకమని ఇక్రా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం దేశీ హెచ్ఆర్సీ ధరలు 2026 మార్చివరకూ సగటున టన్నుకి రూ. 50,500గా కొనసాగే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా టన్ను స్టీల్ ఉత్పత్తిపై నిర్వహణ లాభం గతేడాది(2024–25)లో నమోదైన 110 డాలర్ల నుంచి 108 డాలర్లకు నీరసించవచ్చని తెలియజేసింది. వెరసి స్టీల్ రంగానికి నిలకడతోకూడిన ఔట్లుక్ ప్రకటించింది.సామర్థ్య విస్తరణ ఎఫెక్ట్ దేశీయంగా స్టీల్ పరిశ్రమలో భారీ సామర్థ్య విస్తరణ ప్రణాళికలు అమలవుతున్న కారణంగా రిసు్కలు పెరగవచ్చని ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం 2026–31 మధ్య కాలంలో దేశీ స్టీల్ పరిశ్రమలు 8–8.5 కోట్ల టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని అదనంగా జత కలుపుకునే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇందుకు 4.5–5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 45,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచనున్నాయి. అయితే తగినస్థాయిలో విక్రయాలు, ఆర్జన మెరుగుపడకపోతే భారీ పెట్టుబడుల కారణంగా మధ్యకాలానికి స్టీల్ పరిశ్రమ రుణభారం పెరిగిపోయే అవకాశముంది.ఇక మరోపక్క దేశీయంగా మొత్తం డిమాండ్‌లో గ్రీన్ స్టీల్ వాటా 2029–30 కల్లా 2 శాతానికి(4 మిలియన్ టన్నులు) బలపడవచ్చని గ్రీన్ స్టీల్‌పై గిరీ‹Ùకుమార్ స్పందించారు. ఈ బాటలో 2049–50కల్లా దాదాపు 40 శాతానికి(150 ఎంటీ)కి చేరవచ్చని అంచనా వేశారు. గ్రీన్ హైడ్రోజన్ ధరలు కేజీకి 1.5–1.6 డాలర్లకు క్షీణిస్తేనే గ్రీన్ స్టీల్ తయారీ ఊపందుకుంటుందని తెలియజేశారు. అయితే సమీప భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ ధరలు దిగిరాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. -
స్టీల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది
జమ్‌షేడ్‌పూర్: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ స్టీల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. వ్యయ నిర్వహణ, సామర్థ్యాలతో దీన్ని ఎదుర్కోవాలన్నారు. టాటా స్టీల్ వ్యవస్థాపకుడు జేఎన్ టాటా 186వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీని అందుపుచ్చుకునే విషయంలో ఉద్యోగులు, కార్మిక సంఘాలతోపాటు ప్రభుత్వం, విధానాల రూపంలో కంపెనీకి సాయం అవసరమన్నారు. ‘‘విస్తరణ విషయంలో సాహసోపేతంగా వ్యవహరించాలి. సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు కొనసాగించాలి. ఉత్పాదకతను పెంచుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు కొనసాగించాలి’’అని టాటా స్టీల్ విషయంలో కర్తవ్యబోధ చేశారు. టారిఫ్‌లపై కొనసాగుతున్న చర్చను ప్రస్తావించగా.. సుంకాల గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదంటూ, ఉత్పాదకతపై దృష్టి పెట్టాలని సూచించారు. టారిఫ్‌లు అన్నవి ప్రభుత్వం విధించే సుంకాలని, విదేశీ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేందుకు కంపెనీలు వీటిని చెల్లిస్తాయన్నారు. సెమీకండక్టర్ చిప్‌ల విషయంలో భారత్ స్వావలంబన సాధించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, హెల్త్‌కేర్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలు చిప్‌లపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ఇందుకోసమే అసోం, గుజరాత్లో టాటాగ్రూప్ సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తు చేశారు. -
ఐపీవో బాటలో మరో కంపెనీ
స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వాటిలోని వివరాల ప్రకారం ఐపీవో(IPO) కింద రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ.50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు సందీప్ కుమార్, సునీల్ జలాన్, క్రిషన్ కుమార్ జలన్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ.650 కోట్లు అందుకునే యోచనలో కంపెనీ ఉంది.ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 85.56 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ అనుబంధ సంస్థ వినయ స్టీల్స్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. సంస్థ విస్తరణకు వీలైన మెషీనరీ కొనుగోలు, సొంత అవసరాల కోసం సోలార్ ఎనర్జీ(Solar Energy)ని సమకూర్చుకోవడం తదితరాలు చేపట్టనుంది. దాంతోపాటు మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: 1,673 కోట్ల యూపీఐ లావాదేవీలుఆంధ్రప్రదేశ్లోనూ..బెంగళూరు కంపెనీ ఏవన్ స్టీల్స్ ఇండియా విభిన్న ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ముడిస్టీల్ సామర్థ్యంరీత్యా దక్షిణాదిలోని టాప్–5 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని యూనిట్‌తోపాటు కర్ణాటకలో మరో 5 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ తయారీలో వినియోగించే లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టులుసహా ఇండ్రస్టియల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2024 జూన్30కల్లా వార్షికంగా 14.97 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ప్రొడక్టుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఎస్పీ స్టీల్ అండ్ పవర్, బాలాజీ ఇండస్ట్రీస్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీతో పోటీ పడుతోంది. -
ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 12-30% మధ్య సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా, వియత్నాం ఎగుమతి చేసే వెల్డెడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్‌లకు ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ పన్ను నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది. దేశీయ స్టీల్ కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దిగుమతి సుంకం అధికంగా ఉంటే ఖర్చులు పెరిగి విదేశాల నుంచి కొనుగోలు చేసే ఉక్కును తగ్గిస్తారని ప్రభుత్వ ఉద్దేశమని తెలిపాయి.ఇదీ చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీఇండియా ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 12.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 2024లో అది 14.4 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2029 నాటికి దీని ఉత్పత్తి 20.9 కోట్ల టన్నులు అవుతుందని మార్కెట్ భావిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ ఏటా 9.18 శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. -
ఇకపై వాటి దిగుమతులకు ఆమోదం తప్పనిసరి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది. -
స్టీల్ డిమాండ్ వృద్ధి అంచనా 5.4 శాతం
న్యూఢిల్లీ: భారత్‌లో స్టీల్ డిమాండ్ పుంజుకోనుంది. ఇది ఈ ఏడాది 5.4 శాతం వృద్ధితో 83.8 మిలియన్ టన్నులకు (ఎంటీ) పెరగొచ్చని వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) అంచనా వేసింది. 2017లోనూ డిమాండ్ ఇదే వృద్ధితో 88.3 ఎంటీలకు చేరుతుందని అభిప్రాయపడింది. తక్కువ ముడి చమురు ధరలు సహా ఇన్ఫ్రా వృద్ధికి, దేశీ త యారీ సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడతాయని వివరించింది. కాగా అంతర్జాతీయంగా స్టీల్ డిమాండ్ ఈ ఏడాది 0.8% క్షీణతతో 1,488 ఎంటీలకు తగ్గొచ్చని అంచనా వేసింది. ఇక 2017లో ఈ డిమాండ్ మళ్లీ పుంజుకొని 0.4% వృద్ధితో 1,494 ఎంటీలకు పెరగొచ్చని తెలిపింది.


