ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గ్రేట్ న్యూస్ అందుతుంది. ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పోలిస్తే బంతితో మెరుగ్గా రాణించే కృనాల్.. విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్‌తోనూ చెలరేగుతున్నాడు.
ఈ టోర్నీలో వరుసగా బెంగాల్ (63 బంతుల్లో 57), ఉత్తర్‌ప్రదేశ్‌పై (77 బంతుల్లో 82) అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌పై మరింత రెచ్చిపోయి విధ్వంసకర శతకం బాదాడు.
కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 109 పరుగులు చేశాడు. కృనాల్‌కు ఓపెనర్లు నిత్యా పాండ్యా (122), అమిత్ పాసి (127) సెంచరీలు కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కృనాల్ జట్టు బరోడా భారీ స్కోర్ (417-4) చేసింది.
ఇదే బరోడా జట్టులో సభ్యుడైన టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. నిత్యా, పాసి, కృనాల్ మెరుపు శతకాలతో కదంతొక్కడంతో హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ మిలింద్ 2, త్యాగరాజన్, వరుణ్ గౌడ్ తలో వికెట్ తీశారు.


