ప్రతీకాత్మక చిత్రం
గుణదల(విజయవాడ తూర్పు): పలువురు యువతుల సహకారంతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మాచవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచవరం శాంతినగర్‌కు చెందిన వేముల రమణమ్మ తాను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది.
నివాసాల మధ్య అసభ్యకరంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా ఏర్పాటు చేసిన మాచవరం పోలీసులు దాడులు నిర్వహించగా ముగ్గురు యువతులతో పాటు బి.రాజు అనే విటుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రమణమ్మను అరెస్ట్ చేశారు.


