వరుస విజయాలతో జోరు మీదున్నాడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయవంతమైన సారథిగా కొనసాగుతున్న ఈ ముంబైకర్.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీ కానున్నాడు.
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా సాగే ఈ సిరీస్‌లో బ్యాటర్‌గానూ సత్తా చాటి విమర్శలకు చెక్ పెట్టాలని సూర్యకుమార్ పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిశా శెట్టితో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.
అదే సమయంలో సూర్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అయింది. బాలీవుడ్, టీవీ నటి ఖుషి ముఖర్జీ.. సూర్యకుమార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. కానీ నాకు క్రికెటర్‌తో డేటింగ్ చేసే ఉద్దేశం లేదు.
సూర్యకుమార్ యాదవ్ తరచూ మెసేజ్‌లు చేసేవాడు. అయితే, మా ఇద్దరి మధ్య ఎక్కువగా సంభాషణ జరుగలేదు. నా పేరు వేరొకరితో ముడిపడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు’’ అని ఖుషి ముఖర్జీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సూర్యపై కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. భార్య దేవిశానే ప్రపంచంగా బతికినట్లు కనిపించే సూర్య ఇలాంటి వాడని అనుకోలేదంటూ కామెంట్లు చేశారు.
తన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఖుషి ముఖర్జీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్‌తో తనకు ఎలాంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్ లేదని స్పష్టం చేసింది. తన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. తమకు నచ్చిన రీతిలో వాటిని వ్యాప్తి చేశారని పేర్కొంది.
అంతేకాదు.. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందన్న ఖుషి.. సూర్యతో తాను ఓ ఫ్రెండ్‌గా మాట్లాడి ఉంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. గతంలో తమ మధ్య స్నేహ బంధం ఉండేదని.. అయితే ఇప్పుడు టచ్‌లో లేమని తెలిపింది.


