ఫౌజి షూటింగ్‌లో.. | Prabhas Fauji Movie Latest Update | Sakshi
Sakshi News home page

ఫౌజి షూటింగ్‌లో..

Feb 17 2026 12:09 AM | Updated on Feb 17 2026 12:09 AM

Prabhas Fauji Movie Latest Update

వరుస పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌తో ఫుల్‌ స్వింగ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ఫౌజి’ ఒకటి. ‘సీతా రామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌. జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భాను చందర్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్  డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజి’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ సీన్స్‌ తెరకెక్కిస్తుండగా అదుపు తప్పి ప్రభాస్‌ కింద పడటంతో చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయట. ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ఈ వార్తలపై ప్రభాస్‌ టీమ్‌ స్పందించింది. ‘‘ఏదైనా సినిమా షూటింగ్స్‌లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమే. ప్రభాస్‌కి పెద్ద గాయాలు కాలేదు.

ఆయన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడింది. అది కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. అభిమానులు కంగారుపడొద్దు’’ అంటూ పేర్కొనడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజి’ విడుదల కానుంది. కాగా ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం ‘స్పిరిట్, కల్కి 2898 ఏడీ 2’ వంటి సినిమాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement