టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలో స్ట్రీమింగ్ | Tollywood director Movie 8 AM Metro Streaming In Another Ott | Sakshi
Sakshi News home page

8 AM Metro Ott: టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి..!

Feb 16 2026 10:10 PM | Updated on Feb 16 2026 10:15 PM

Tollywood director Movie 8 AM Metro Streaming In Another Ott

ఓటీటీల్లో సినిమాలు సడన్‌గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రోజుల్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుగానే డీల్స్ ఉండడంతో స్ట్రీమింగ్ చేసేస్తుంటారు. మరికొన్ని చిత్రాలు ఒకే ఫ్లాట్‌ఫామ్ కాకుండా రెండు, మూడింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా మూవీ విడుదలైన కొన్ని నెలలు, ఏడాదిలోపు రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ చిత్రం రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా?

బాలీవుడ్‌ మూవీ 8 ఏఎమ్ మెట్రో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023 మే 19న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.

తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరో ఓటీటీకి రావడం విశేషం. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement