breaking news
Gulshan Devaiah
-
అంతా ఓకేనా? అని 17 సార్లు అడిగాడు: నటి
కన్నడ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah).. హిందీలో సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లో స్థిరపడిపోయాడు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 21 ఏళ్ల తర్వాత తన మాతృభాషలో సినిమా చేసే ఛాన్స్ వరించింది. అదే కాంతార: చాప్టర్ 1 (Kantara: A Legend Chapter-1 Movie). ఈ మూవీలో విలన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న గుల్షన్ ప్రస్తుతం 'థెరపీ షెరపీ' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇందులో మరాఠి నటి గిరిజ ఓక్ నటిస్తోంది.ముందే చెప్తారుతాజాగా ఆమె సిరీస్ షూటింగ్లో ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. గిరిజ (Girija Oak Godbole) మాట్లాడుతూ.. సిరీస్ అయినా, సినిమా అయినా కొన్ని అభ్యంతరకర ససన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కొందరు సెట్లోనే ఉంటారు. నటీనటులు ఇబ్బందిపడకుండా వాళ్లు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సీన్ ఎలా ఉండబోతుంది? ఏం చేయాలి? అనేది వాళ్లు క్లియర్‌గా వివరిస్తారు.ఏ ఇబ్బందీ రానివ్వలేదుఅయినప్పటికీ కొన్నిసార్లు సడన్‌గా డైలమాలో పడుతుంటాం. అయితే కొందరు నటులతో పనిచేసినప్పుడు అసౌకర్యం అనేదే ఉండదు. అలాంటివారిలో గుల్షన్ ఒకరు. మేము దుస్తులు ధరించే ఉన్నాం, అక్కడ చెడుగా ఏమీ లేదు. అప్పటికీ అతడు మీకు ఓకే కదా? ఇబ్బందేం లేదుగా అని 16-17 సార్లు అడిగాడు. ఆయన చూపించిన గౌరవం, కేరింగ్ నాకెంతో నచ్చింది. తనవల్లే ఎటువంటి ఇబ్బంది లేకుండా సీన్ పూర్తి చేశాం అని గిరిజ ఓక్ చెప్పుకొచ్చింది.చదవండి: తనవల్లే తెలిసొచ్చింది.. నేను పూర్తిగా మారిపోయా: శర్వానంద్ -
సమంత 'బంగారం'లో కాంతార విలన్
కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్‌గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్‌ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్‌గా చేయబోతున్నాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్‌కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్)


