కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్‌గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.
(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)
మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్‌గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.
నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్‌ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్‌గా చేయబోతున్నాడా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్‌కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్)


