రీసెంట్ టైంలో నటీనటుల పనివేళలు, సెట్‌కి సమయానికి రావడం అనే విషయాలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అడపాదడపా నటీనటులు, సినీ ప్రముఖులు ఈ టాపిక్ గురించి నేరుగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 'ఓజీ'లో విలన్‌గా చేసిన ఇమ్రాన్ హష్మీ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొందరు నటులు అస్సలు సెట్‌కి రారనే ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)
అసలు విషయానికొస్తే.. 'హక్'(HAQ) అనే హిందీ సినిమా చేసిన ఇమ్రాన్ హష్మీ దాని ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహనటి యామీ గౌతమ్‌ని ప్రశంసించాడు. సెట్‌కి సమయానికి వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి ఈ కాలంలో కూడా టైమ్‌కి రాని యాక్టర్స్ ఉంటారా? అని యాంకర్ అడగ్గా.. 'కొందరు నటులు అసలు సెట్‌కే రారు' అని కామెంట్స్ చేశాడు.
అయితే ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యల్ని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు. పలువురు నార్త్ నెటిజన్లు సల్మాన్ ఖాన్ గురించి అన్నాడని అంటుండగా.. మరికొందరు మాత్రం పవన్ కల్యాణ్ గురించి ఈ కామెంట్స్ చేశాడా అనే సందేహపడుతున్నారు. ఎందుకంటే 'ఓజీ'లో పవన్ కొన్నిరోజులే షూటింగ్‌కి రాగా మిగిలిన చోట్ల పవన్ డూప్‌ని పెట్టి మేనేజ్ చేశారు. ఇమ్రాన్ గతంలో సల్మాన్‌తో కలిసి 'టైగర్ 3' చేశాడు. అప్పుడేమైనా సల్మాన్ సెట్‌కి రాలేదా అని అనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.
(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')
About whom Emraan Hashmi talking ????
Recently he worked in #TheyCallHimOG #EmraanHashmi pic.twitter.com/MncfXvbTG2— TFI Movie Buzz (@TFIMovieBuzz) October 27, 2025


