'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ | Tollywood Actor Thiruveer Reveals Why He Missed Roles in Prabhas' Salaar, Fauji | Sakshi
Sakshi News home page

Thiruveer: సలార్, ఫౌజీ సినిమాల్లో అవకాశాలు.. కానీ మిస్ చేసుకున్నా

Oct 28 2025 2:14 PM | Updated on Oct 28 2025 2:46 PM

Actor Thiruveer Reacts Salaar And Fauzi Movie Chances

పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత ప్రభాస్ నుంచి వరస సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈయన చేసిన సలార్, ఫౌజీ చిత్రాల్లో తనకు అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యాయని తెలుగు యంగ్ హీరో తిరువీరు చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')

'ప్రభాస్‌ 'సలార్‌' కాటేరమ్మ ఫైట్‌లో విలన్‌గా నేనే చేయాలి. కానీ డేట్స్ సమస్య కారణంగా అది మిస్ అయింది. అలానే 'ఫౌజీ'లోనూ మంచి ఆఫర్ వచ్చింది. కానీ వేరే సినిమాలు, లుక్ కంటిన్యూటీ కారణంగా వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తిరువీర్ చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో లీడ్ రోల్స్ చేశాడు.‍ జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. త్వరలో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే మూవీతో రాబోతున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగానే మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాలు వల్ల ప్రభాస్ సలార్, ఫౌజీలో అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: టాలీవుడ్‌పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement