కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఈ ట్యాగ్‌లైన్‌తోనే సీజన్ మొదలైంది. ఈ ట్యాగ్‌తోనే సీజన్ ముగింపు కాబోతోంది. కామనర్ కల్యాణ్, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కాబోతున్నారు. సీజన్ ముగింపుకు చేరుకోవడంతో హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్‌ను ఎలిమినేట్ చేశారు.. నేటి ఎపిసోడ్‌లో భరణిని పంపించేయనున్నారు.
ఒక్క కారణం..
సుమన్ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్ కోసం ఓవరాక్టింగ్ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్‌లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.
నవ్విస్తాడనుకుంటే..
సినిమాల్లో కమెడియన్‌గా నవ్వించిన సుమన్ శెట్టి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్‌గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్‌ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.
ఒక్క స్టెప్పేస్తే చాలు
వీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్ టు ఫినాలే రేసులో సుమన్ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.
అందుకే 14 వారాలు
కేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్‌లో ఉండటం సుమన్ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్‌బాస్ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్‌ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన!


