శ్రీకాంత్ తనయుడి సినిమా.. భారీ ధరకు ఓటీటీ డీల్.! | Roshan Champion Movie OTT Rights Deal Goes For Huge Amount Went Viral On Social Media, Check Out Price Details Inside | Sakshi
Sakshi News home page

Champion Movie Ott Rights: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్.!

Dec 22 2025 2:31 PM | Updated on Dec 22 2025 2:48 PM

Champion Movie Ott Rights deal for Huge amoount goes Viral

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్‌ చిత్రం ఛాంపియన్. బ్రిటీష్ కాలంలో జరిగిన  బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్‌ మరింత పెరిగింది.  రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు రూ.16 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్‌లో డీల్ సెట్ చేశారంటే మూమూలు విషయం కాదు. ఇప్పటికే రోషన్‌ మరో సినిమాకు రెడీ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.

కాగా.. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement