చాలామంది సెలబ్రిటీలు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించారు. ప్రజలకు సేవ చేసేందుకు పాలిటిక్స్‌లో అడుగుపెట్టామన్నది వారి వాదన. అలా తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్, విజయకాంత్, శరత్‌కుమార్, కమల్ హాసన్, విజయ్.. ఇలా అందరూ రాజకీయాలను ఎంచుకున్నావే.. కానీ కర్ణాటకలో సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. ఇదే ప్రశ్న ఓ విలేఖరి స్టార్ నటుడు శివన్నను అడిగాడు.
కారణాలేంటి?
కన్నడ నటులు శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45: ది మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ జనవరి 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో శివన్నకు.. కన్నడ నటులు రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు? దానివెనక గల కారణాలేంటి? అన్న ప్రశ్న ఎదురైంది.
నా డబ్బుతో సేవ చేస్తా..
అందుకాయన స్పందిస్తూ.. నాకు రాజకీయాలు తెలియవు. అధికారం, పదవి లేకపోయినా జనాలకు సేవ చేయడమే నాకు తెలుసు. రాజకీయాలు కొన్నిసార్లు జనాల మధ్య బేధాన్ని సృష్టిస్తాయి. కానీ నేను నా డబ్బుతో ఎటువంటి పక్షపాతం చూపించకుండా జనాలకు సేవ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఎన్నికల్లో శివన్న భార్య
కాగా శివరాజ్‌కుమార్ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన భార్య గీత గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్స్‌లో నిలబడింది. భార్య కోసం శివన్న ప్రచారం కూడా చేసినప్పటికీ ఆమె ఓడిపోయింది. కాగా గీత మరెవరో కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప కుమార్తె!
You don't need to enter politics or seek power like @TVKVijayHQ . Politics introduces bias towards people & I prefer to help everyone impartially, using my own money 🙌 @NimmaShivanna - Clarity 👌🔥🔥#45TheMovie #Jailer2 #Shivannapic.twitter.com/7BIBRl3j1E
— Achilles (@Searching4ligh1) December 22, 2025


