విజయ్-త్రిష బంధంపై బీజేపీ చీఫ్ దారుణమైన కామెంట్స్ | Tamilnadu BJP Chief Nainar Nagendran Sensational Comments On Vijay And Trisha Amid Assembly Poll Preparations | Sakshi
Sakshi News home page

Vijay-Trisha: విజయ్ అమాయకుడు.. రాజకీయాలు అర్థం కావట్లేదు

Feb 14 2026 7:35 PM | Updated on Feb 14 2026 7:42 PM

Tamilnadu BJP Chief Nainar Nagendran Comments On Vijay Trisha

చివరి సినిమా చేసేసిన తమిళనాడు స్టార్ హీరో విజయ్.. అధికారం సాధించడమే లక్ష‍్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నాడు. అలాంటి ఇతడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషతో బంధాన్ని ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)

చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో భాగంగా బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రకు విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. 'విజయ్ చాలా అమాయకుడు. ఇప్పటికీ రాజకీయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొదటగా అతడు గూడు నుంచి బయటకు రావాలి. మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది' అని నాగేంద్రన్ ఆరోపించారు.

నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్నాయి. విజయ్‌ని అభిమానించే వాళ్లతో అధికార డీఎంకే నాయకులు కూడా నాగేంద్రన్ కామెంట్స్‌ని ఖండిస్తున్నారు. విజయ్, త్రిష రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాన్ని.. నేతలు బహిరంగ వేదికలపై ప్రస్తావించడం అవమానకరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement