Nainar Nagenthiran
-
బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా అనేశాడు. దీంతో పెద్ద చర్చే నడిచింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు.. ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పుడు త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.(ఇదీ చదవండి: అలాంటి కంటెంట్‌కి లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకు?)'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.దళపతి విజయ్, త్రిష పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. చివరగా విజయ్ హీరోగా నటించిన 'గోట్' మూవీలో త్రిష, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ చాన్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీటిని విజయ్‌పై విమర్శల చేయడానికి ఉపయోగించడమే ఈ మొత్తం వివాదానికి కారణమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)Disrespect should and always will be called out. pic.twitter.com/FmXdIBvAJ6— Trish (@trishtrashers) February 16, 2026 -
విజయ్-త్రిష బంధంపై బీజేపీ చీఫ్ దారుణమైన కామెంట్స్
చివరి సినిమా చేసేసిన తమిళనాడు స్టార్ హీరో విజయ్.. అధికారం సాధించడమే లక్ష్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నాడు. అలాంటి ఇతడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషతో బంధాన్ని ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లో భాగంగా బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రకు విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. 'విజయ్ చాలా అమాయకుడు. ఇప్పటికీ రాజకీయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొదటగా అతడు గూడు నుంచి బయటకు రావాలి. మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది' అని నాగేంద్రన్ ఆరోపించారు.నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్నాయి. విజయ్‌ని అభిమానించే వాళ్లతో అధికార డీఎంకే నాయకులు కూడా నాగేంద్రన్ కామెంట్స్‌ని ఖండిస్తున్నారు. విజయ్, త్రిష రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాన్ని.. నేతలు బహిరంగ వేదికలపై ప్రస్తావించడం అవమానకరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్) -
ఎవరీ నైనర్ నాగేంద్రన్..?
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనర్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైంది. ఇటీవల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కే అన్నామళై రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్ని నాగేంద్రన్ చేపట్టడం ఇక లాంఛన ప్రాయమే. కేవలం రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పోటీలో నిలిచే అభ్యర్థుల పరంగా చూస్తే కేవలం నాగేంద్రన్ నామినేషన్ మాత్రమే వచ్చింది.ఏమైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్పా నాగేంద్రన్ ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ గా వ్యవహరించడం ఖాయం. ఇప్పటివరకూ కేవలం నాగేంద్రన్ నామినేషన్ మాత్రమే వచ్చిన తరుణంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియలో భాగంగా నాగేంద్రన్ పేరును అధికారికంగా రేపు(శనివారం) ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు(శుక్రవారం) మందీ మార్బలంతో వచ్చి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఇప్పటివరకూ అధ్యక్షునిగా కొనసాగిన అన్నామళై కూడా రావడం విశేషం.ఎవరీ నాగేంద్రన్..?ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నాగేంద్రన్. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఉపాధ్యక్షుడిగా సేవల అందిస్తూ వస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో కొనసాగిన నాగేంద్రన్.. 2017లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. 2001 మే 19 వ తేదీ నుంచి 2006 మే 12 వరకూ ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు బీజేపీ గూటికి చేరారు. ఆయన బీజేపీలో చేరిన మూడేళ్ల తర్వాత అంటే 2020 జూలై 3 వ తేదీన బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.జయలలిత మరణం తర్వాత..2016లో మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత చాలా మంది ఎఐఏడీఎంకే నేతలు.. బీజేపీలో చేరారు. వారిలో నాగేంద్రన్ కూడా ఒకరు. 2017 ఆగస్టులో కాషాయ జెండా కప్పుకున్నారు నాగేంద్రన్. ఆయనకు ఢిల్లీ అధినాయకత్వంలో మంచి గుర్తింపు ఉంది. 2021లో తిరునెల్వెలి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఆయనకు మద్దతుగా అమిత్ షా సైతం వచ్చి అక్కడ ప్రచారం చేశారు. సుమారు 23వేలకు పైగా ఓట్లతో డీఎంకే అభ్యర్థిపై నాగేంద్రన్ గెలిచి ఇక్కడ మూడోసారి విజయాన్ని అందుకున్నారు.ఆయన అసలు పేరు.. నాగేందిరేన్ కాగా, రెండో పేరు నాగేంద్రన్. ప్రస్తుతం ఈ పేరుతో మరింత ప్రాచుర్యం పొందారాయన. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఆయన పేరును మాజీ అధ్యక్షుడు అన్నామళైతో పాటు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, మాజీ కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌లు బలపరిచారు.


