టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం.. గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. తాజాగా థియేటర్లలో రిలీజైన 'గుర్రం పాపిరెడ్డి' మూవీలో జడ్జి పాత్రలో అలరించారు. ఇప్పుడు ఆయన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. తానే స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)
రాష్ట్రపతి ముర్ము గత మూడురోజులుగా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సేదదీరారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన బ్రహ్మానందం.. ఈమెని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. శాలువాతో బ్రహ్మీని సత్కరించారు. ప్రతిగా బ్రహ్మానందం తన స్వహస్తాలతో లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ముర్ముకు బహుకరించారు.
హాస్యనటుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం.. తీరిక సమయాల్లో చాలా బొమ్మలు గీస్తుంటారు. వాటిని పలువురు తెలుగు సెలబ్రిటీలకు బహుమతులుగా ఇచ్చారు. ఇప్పుడు అలానే రాష్ట్రపతికి తను గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్‌లో ఈ కోణం ఉందా?)



