దృశ్యం-3 సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు పలు భాషలలో సూపర్ హిట్ అయ్యాయి. అయితే, తాజాగా దృశ్యం-3 హిందీ వర్షన్ అప్‌డేట్ ఇచ్చారు. అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుందని చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇకపోతే ఈ సిరీస్‌లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్‌లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయింది. తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే.


