ప్రెగ్నెన్సీ జర్నీలో భార్యకు భర్త తోడుండాలంటోంది హీరోయిన్ శ్రియా శరణ్. ఆ సమయంలో భర్త తోడు ఎక్కువ కావాలనిపిస్తుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా మాట్లాడుతూ.. మహిళ గర్భం దాల్చినప్పుడు తన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటోందంటే అదొక అద్భుతమైన అనుభవం.
అతడిదే బాధ్యత
కానీ ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపులో ఉండవు. కడుపులో ఓ బిడ్డను మోస్తూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు నీలాగే కనబడవు. ఆ సమయంలో ఆడవారి శరీరం ఒక ఆవులా కనిపిస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే! నేను గర్భం దాల్చినప్పుడు ఎక్కువ బాధగా అనిపించేది. నా భర్త నాతో ఎక్కువసేపు ఉంటే బాగుండనిపించేది. అదే సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పనికి వెళ్లాలనిపించేది. ఇలా నా ఎమోషన్స్ అదుపులో ఉండేవి కాదు అని చెప్పుకొచ్చింది.
సినిమా
శ్రియా.. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను 2018లో పెళ్లి చేసుకుంది. 2021లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు రాధా శరణ్ కొశ్చీవ్ జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నేనున్నాను, ఛత్రపతి, మనం వంటి పలు సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కొన్ని ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. చివరగా మిరాయ్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం హిందీ దృశ్యం 3లో నటిస్తోంది.
చదవండి: తరుణ్ భాస్కర్‌తో డేటింగ్? తొలిసారి పెదవి విప్పిన హీరోయిన్


