తెలుగు దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయజయజయహేకి రీమేక్‌గా తెరకెక్కింది.
తర్వాత చెప్తా
తాజాగా సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈషా రెబ్బాకు డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్- ఈషా.. రియల్ లైఫ్‌లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. ఆమె రూమర్స్‌ను ఖండించనూ లేదు, ఒప్పుకోనూ లేదంటే సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉన్నట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గట్టిగా కొట్టాడు
ఇక సినిమాలో తనను తరుణ్ నిజంగా కొట్టాడంది ఈషా. ఒక సన్నివేశంలో చట్నీ నా చెంపకు అంటాలని దర్శకుడు చెప్పాడు. అప్పుడు తరుణ్ నన్ను గట్టిగా కొట్టాడు. అది నేను ఊహించలేదు. ఆ దెబ్బకు నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. సీన్ అయిపోగానే సారీ చెప్పాడు. కానీ చివర్లో నేను కూడా గట్టిగానే కొట్టాను అని ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.
చదవండి: ప్రభాకర్ కొడుకును కాకపోయుంటే ఎన్నో సినిమాలు చేసేవాడిని


