థ్రిల్లర్ మూవీ 'దృశ్యం' సూపర్ డూపర్ హిట్టు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయి అక్కడా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో 'దృశ్యం' ఫ్రాంచైజీలో రెండవ భాగాన్ని తీసుకొచ్చారు. కాకపోతే 2021లో కరోనా వల్ల మలయాళ వర్షన్‌ను ఓటీటీలో రిలీజ్ చేశారు.
సూపర్ హిట్ దృశ్యం
ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రావడటంతో తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. వెంకటేశ్ 'దృశ్యం 2' కూడా అదే ఏడాది ఓటీటీలో విడుదలైంది. అయితే అజయ్ దేవ్‌గణ్ హిందీ 'దృశ్యం 2' మాత్రం 2022లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు' దృశ్యం' మూడో పార్ట్ రాబోతోంది.
మూడో పార్ట్
మోహన్‌లాల్- జీతూ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం 3' షూటింగ్ ఇటీవలే మొదలైంది. టబు, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ డైరెక్టర్. ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆ విషయంలో డిమాండ్
ఈయన 'దృశ్యం 2'లో పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్ అయిన అక్షయ్.. మూడో పార్ట్ (Drishyam 3 Movie)లో నటించేందుకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట! అలాగే తన పాత్ర తెరపై కనిపించే తీరులో కొన్నిమార్పులు చేయమని సూచించాడట!
నిజమెంత?
ఈ విషయంలో నటుడికి, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు భోగట్టా.. దీంతో ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైనప్పటికీ అక్షయ్ ఖన్నా డిమాండ్లకు తలొగ్గి మళ్లీ అతడిని సినిమాలో తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.
చదవండి: వితికా షెరుకు ప్రమోషన్


