‘సన్‌ ఆఫ్‌’లో మంచి కంటెంట్‌ ఉంది.. పెద్ద హిట్‌ అవ్వాలి: కోన వెంకట్‌ | Kona Venkat Talk About Son Of Movie At Trailer Release Event | Sakshi
Sakshi News home page

‘సన్‌ ఆఫ్‌’లో మంచి కంటెంట్‌ ఉంది.. పెద్ద హిట్‌ అవ్వాలి: కోన వెంకట్‌

Feb 11 2026 4:27 PM | Updated on Feb 11 2026 4:30 PM

Kona Venkat Talk About Son Of Movie At Trailer Release Event

బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌’. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో.. ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారు. ‘సన్ ఆఫ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement